E-Paper
Advertisement

Sangareddy News: ముత్తంగి రింగ్ రోడ్ వద్ద భారీ డ్రగ్స్ ఆపరేషన్.. ముగ్గురు అరెస్ట్

Sangareddy News: ముత్తంగి రింగ్ రోడ్ వద్ద భారీ డ్రగ్స్ ఆపరేషన్.. ముగ్గురు అరెస్ట్
Advertisement

Sangareddy News: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో భారీగా గంజాయిని పట్టుకున్నారు SOT పోలీసులు. పటాన్‌చెరు సమీపంలోని ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డు టోల్ గేట్ వద్ద పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేస్తున్నారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా జరుగుతోందన్న పక్కా సమాచారంతో పోలీసులు అక్కడ నిఘా పెట్టారు. అనుమానాస్పదంగా వస్తున్న ఒక డీసీఎం వ్యాన్, ఒక కారును ఆపి తనిఖీ చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

ఈ తనిఖీల్లో సుమారు 92కేజీల గంజాయిని పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ మార్కెట్‌లో లక్షల్లో ఉంటుందని అంచనా.. ఈ గంజాయిని ఒరిస్తా రాష్ట్రం నుంచి మహారాష్ట్రలోని సోలాపూర్‌కు తరలిస్తున్నట్లు నిందితులు విచారణలో ఒప్పుకున్నారు. సుదూర ప్రాంతాల నుంచి పోలీసుల కళ్లు కప్పి గంజాయిని తరలించేందుకు నిందితులు డీసీఎం వ్యాన్‌ను ఉపయోగించినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

ఈ అక్రమ రవాణాకు పాల్పడుతున్న మహారాష్ట్రలోని సోలాపూర్‌కు చెందిన గంగారాం, మహేష్, విజయ్ అనే ముగ్గురు వ్యక్తులను పోలీసలు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద గంజాయితో పాటు డీసీఎం వ్యాన్, కారు, 11వేల రూపాయల నగదు పోలీసులు సీజ్ చేశారు.

ALSO READ:16 ఉపగ్రహాలతో నింగిలోకి దూసుకెళ్లిన పిఎస్ఎల్వీ-సి 62

Related News

ముక్కు మూసుకుని బతుకమ్మ నిమజ్జనం చేసిన మహిళలు.. ఎందుకో తెలుసా..?

మా తీర్పులు కాగితాలకే పరిమితమా..? పీరియడ్ హైజీన్ ఉత్తర్వుల అమలుపై సుప్రీం కోర్టు ఫైర్!

తెలంగాణలో 429 ప్రభుత్వ ఉద్యోగాలకు ఆర్థిక శాఖ ఆమోదం.. త్వరలో నోటిఫికేషన్..?

ఎన్ హెచ్ఎం ఉద్యోగుల జీతాల్లో కోత సమంజసమా? సీఎం రేవంత్ కు కవిత సవాల్!

వనపర్తి ప్రజలకు గుడ్ న్యూస్.. పట్టణాభివృద్ధికి రాజా కృష్ణదేవరావు అభయం!

దాండియా ఆడుతూ.. కీలక సందేశాన్నిచ్చిన సైబరాబాద్ పోలీసులు!

కొత్త క్యూర్ చట్టంతో.. మేయర్, కౌన్సిలర్ల అధికారాలకు కోత!

సీబీఐ, ఈడీ అధికారులమంటూ మోసం.. రిటైర్డ్ ఉద్యోగికి రూ.29 లక్షల టోకరా!

Big Stories

Advertisement
×