E-Paper
Advertisement

BPL: చ‌రిత్ర‌లో తొలిసారి.. ఒకే మ్యాచ్ లో తండ్రి, కొడుకులు..ముస్తాఫిజుర్ మెంటెలోడు అంటూ ప‌రువు తీసిన‌ న‌బీ

BPL: చ‌రిత్ర‌లో తొలిసారి.. ఒకే మ్యాచ్ లో తండ్రి, కొడుకులు..ముస్తాఫిజుర్ మెంటెలోడు అంటూ ప‌రువు తీసిన‌ న‌బీ

BPL:  క్రికెట్ చరిత్రలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ఇప్పటి వరకు ఎక్కడ జరగని ఘటన జరిగింది. తండ్రి కొడుకులు ఒకే జట్టుకు ఆడి, సరికొత్త చరిత్ర సృష్టించారు. ఈ సంఘటన బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్లో జరిగింది. ఢాకా కాపిటల్స్ వర్సెస్ నోఖాలి ఎక్స్ ప్రెస్‌ జట్ల మధ్య 22వ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ సందర్భంగా ఆఫ్ఘనిస్తాన్ ఆల్రౌండర్ మహమ్మద్ నబీ ( Mohammad Nabi ), తన కుమారుడు హసన్ ఐసఖిల్ ( Hasan Eisakhil  ) ఇద్దరు కలిసి ఒకే జట్టుకు ఆడారు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంటులో నోఖాలి ఎక్స్‌ప్రెస్ జట్టుకు ఈ తండ్రి కొడుకులు ఇద్దరు ఆడుతున్నారు. నిన్నటి మ్యాచ్ లో ఒకే జట్టుకు ఆడి ఈ తండ్రీ కొడుకులు ఇద్దరు రికార్డు సృష్టించారు. దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది.

Also Read: Lizelle Lee: 100 కేజీల బ‌రువు, ద‌క్షిణాఫ్రికాకు రిటైర్మెంట్‌..కానీ WPL 2026లో క‌ళ్లు చెదిరే క్యాచ్‌..ఎవ‌రీ లిజెల్ లీ

ఒకే జట్టులో తండ్రి కొడుకులు.. మహమ్మద్ నబీ ఫ్యామిలీ చరిత్ర

బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో భాగంగా ఢాకా క్యాపిటల్స్ vs నోఖాలి ఎక్స్‌ప్రెస్ ( Dhaka Capitals vs Noakhali Express ) మధ్య 22వ మ్యాచ్ జరిగింది. ఇందులో అద్భుతంగా రాణించిన నోఖాలి ఎక్స్‌ప్రెస్ 41 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో మొదట నోఖాలి ఎక్స్‌ప్రెస్ బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లు ఆడిన నోఖాలి ఎక్స్‌ప్రెస్ 7 టికెట్లు నష్టానికి 184 పరుగులు సాధించింది. ఇందులో నబీ కొడుకు హసన్ ఐసఖిల్ 92 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్‌ ద మ్యాచ్ అందుకున్నాడు. అటు మ‌హ‌మ్మ‌ద్ న‌బీ 17 పరుగులకే వెనుతిరిగాడు. అయితే 184 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఢాకా క్యాపిటల్స్ చతికల పడింది. 18.2 ఓవర్లలో 143 పరుగులు చేసిన ఢాకా క్యాపిటల్స్, 41 పరుగుల తేడాతో దారుణంగా ఓడిపోయింది.

ముస్తాఫిజుర్ రహమాన్ పరువు తీసిన నబీ

బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో ( BPL 2025-26) ఆడుతున్న మహమ్మద్ నబీ, బంగ్లా క్రికెటర్ ముస్తాఫిజుర్ రహమాన్ పరువు తీశాడు. ఐపీఎల్ 2026 టోర్నమెంట్ లో ముస్తాఫిజుర్ రహమాన్ ను తొలగించడంపై మీ స్పందన ఏంటి ? అని మహమ్మద్ నబీని ( Mohammad Nabi ) అక్కడి విలేకరులు ప్రశ్నించారు. అయితే దీనికి అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు న‌బీ. ఆ చిల్లర గాడి గురించి నాకెందుకు? మ్యాచ్ గురించి అడగండి చెబుతాను.. అంటూ అదిరిపోయే ఆన్సర్ ఇచ్చాడు నబీ. దీంతో మహమ్మద్ నబీ పై ఇండియన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ముస్తాఫిజుర్ రహమాన్ పరువు తీసేలా మాట్లాడినందుకు అతనికి సపోర్ట్ గా నిలుస్తున్నారు ఇండియన్స్. ఇది ఇలా ఉండ‌గా, ముస్తాఫిజుర్ రహమాన్ పై బీసీసీఐ వేటు వేసింది. హిందువుల‌పై దాడులు జ‌రుగుతోన్న నేప‌థ్యంలో ఐపీఎల్ 2026 లో ముస్తాఫిజుర్ రహమాన్ ఆడ‌కుండా ఆదేశాలు ఇచ్చింది బీసీసీఐ.

Also Read: BCCI-Bangladesh: బంగ్లాదేశ్ జ‌ట్టులో చీలిక‌, శ‌త్రువులో జ‌ట్టులో “ఇండియన్ ఏజెంట్”..త‌ల‌ప‌ట్టుకుంటోన్న BCB

 

 

 

Related News

బ‌ల‌హీనమైన గుజ‌రాత్ పై గెలిచి బిల్డ‌ప్ ఇస్తున్నారు..RCB ప‌రువు తీసిన అంబ‌టి !

Pakistan : పాకిస్తాన్ కోచ్ గా వీరేంద్ర సెహ్వాగ్ ? PCB షాకింగ్ నిర్ణ‌యం

Tanveer Ahmed: బాబ‌ర్ ను ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

Big Stories

×