E-Paper
Advertisement

BSNL 50 days Plan: జియో, ఎయిర్‌టెల్‌ కంపెనీలకు సవాల్.. మార్కెట్‌ని షేక్ చేస్తున్న బిఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్

BSNL 50 days Plan: జియో, ఎయిర్‌టెల్‌ కంపెనీలకు సవాల్.. మార్కెట్‌ని షేక్ చేస్తున్న బిఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్
Advertisement

BSNL 50 days Plan| బిఎస్‌ఎన్‌ఎల్ మళ్లీ చీప్ ప్రీపెయిడ్ ప్లాన్‌తో మార్కెట్‌లో సంచలనం సృష్టించింది. ఈ ప్లాన్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ లాంటి ప్రైవేట్ టెలికాం కంపెనీలకు గట్టి పోటీ నిస్తోంది.ఎక్కువ వాలిడిటీ, ఉచిత కాలింగ్, రోజువారీ డేటా, SMSలు.. ఈ బెనిఫిట్స్ అన్నీ చాలా తక్కువ ధరకు లభిస్తాయి. ప్రైవేట్ కంపెనీలు ఒకవైపు ధరలు పెంచుతుంటే.. బిఎస్‌ఎన్‌ఎల్ మాత్రం ధర ఇంకా తగ్గించి చీప్ రీఛార్జ్ ప్లాన్స్ తెస్తోంది. ఈ ఆఫర్ తక్కువ ఖర్చుతో ఎక్కువ బెనిఫిట్స్ కావాల్సినవారికి బెస్ట్. రోజుకు రూ.5 కంటే తక్కువ ఖర్చుతో ఫోన్ యాక్టివ్‌గా ఉంచవచ్చు.

బిఎస్‌ఎన్‌ఎల్ రూ.347 ప్లాన్ వివరాలు

బిఎస్‌ఎన్‌ఎల్ తన అధికారిక X అకౌంట్‌లో ఈ ప్లాన్ వివరాలు షేర్ చేసింది. ఈ రీఛార్జ్ ధర కేవలం రూ.347 మాత్రమే. ఇందులో 50 రోజుల పూర్తి వాలిడిటీ లభిస్తుంది. సిమ్ కార్డ్ పూర్తిగా 50 రోజులపాటు యాక్టివ్‌గా ఉంటుంది, ఎక్స్‌ట్రా ఛార్జీలు లేవు. బడ్జెట్ యూజర్లు, సెకండరీ సిమ్ ఉపయోగించేవారిక ఇది ఐడియల్ ప్లాన్.

అన్‌లిమిటెడ్ కాలింగ్, నేషనల్ రోమింగ్ బెనిఫిట్స్ 

Advertisement

ఈ ప్లాన్‌లో భారతదేశం అంతటా అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ ఉంది. లోకల్, ఎస్‌టీడీ కాల్స్ ఎన్ని చేసినా లిమిట్ లేదు. ఫ్రీ నేషనల్ రోమింగ్ కూడా ఉంది. దేశంలో ఎక్కడికి వెళ్లినా అదనపు రోమింగ్ ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రైవేట్ ప్లాన్స్‌తో పోలిస్తే ఇది చాలా వాల్యూ యాడ్ చేస్తుంది.

రోజువారీ డేటా, SMS బెనిఫిట్స్

ప్రతిరోజూ 2జీబీ హై-స్పీడ్ డేటా లభిస్తుంది. మొత్తం 50 రోజుల్లో 100జీబీ డేటా వస్తుంది. రోజువారీ డేటా అయిపోయాక స్పీడ్ తగ్గుతుంది. ప్రతిరోజూ 100 ఉచిత SMSలు కూడా ఉన్నాయి. బ్రౌజింగ్, స్ట్రీమింగ్, మెసేజింగ్ వంటి పనులు సులభంగా చేయవచ్చు.

జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్ ల కంటే బెటర్ ప్లాన్

Advertisement

ప్రైవేట్ కంపెనీలు సాధారణంగా 56 రోజుల ప్లాన్‌కు రూ.500 పైన తీసుకుంటాయి. బిఎస్‌ఎన్‌ఎల్ రూ.347కే ఈ బెనిఫిట్స్ ఇస్తుంది. అంటే దాదాపు రూ.150 సేవింగ్స్ చేసుకోవచ్చు. చవకైన ధరకు మంచి సర్వీస్ కావాల్సినవారు బిఎస్‌ఎన్‌ఎల్‌కు మారవచ్చు. నెలవారీ ఖర్చు తగ్గించుకోవచ్చు.

Also Read: బ్యాంక్‌లో డబ్బులు లేకపోయినా యుపిఐ పేమెంట్.. గూగుల్ పే యూజర్లకు గుడ్ న్యూస్

బిఎస్‌ఎన్‌ఎల్ నెట్‌వర్క్ విస్తరణ, ఫ్యూచర్ రెడీనెస్

బిఎస్‌ఎన్‌ఎల్ దేశవ్యాప్తంగా నెట్‌వర్క్ విస్తరిస్తోంది. ఇటీవల ఒక లక్ష 4G మొబైల్ టవర్లు ఇన్‌స్టాల్ చేసింది. ఇవన్నీ భారత్‌లోనే తయారైన స్వదేశీ టెక్నాలజీతో రూపొందాయి. ఈ నెట్‌వర్క్ భవిష్యత్తులో సులభంగా 5Gకు అప్‌గ్రేడ్ అవుతుంది.

బిఎస్‌ఎన్‌ఎల్ 5G లాంచ్ ప్లాన్స్

బిఎస్‌ఎన్‌ఎల్ త్వరలో 5G సర్వీసెస్ లాంచ్ చేయనుంది. ముందుగా ఢిల్లీ, ముంబైలో స్టార్ట్ అవుతుంది. 2025 చివరి నాటికి లాంచ్ అవుతుందని అంచనా. చవకైన ధరలతో బిఎస్ఎన్ఎల్ 5G వస్తే దేశంలో టెలికాం మార్కెట్ రూపురేఖలే మారిపోతాయి.

Related News

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

Big Stories

Advertisement
×