Vijay Trisha: దళపతి విజయ్ త్రిషల మధ్య ప్రేమాయణం నడుస్తుందన్న వార్తలు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సంగతి తెల్సిందే.ఇక తాజాగా విజయ్ తమిళ నాట జరిగిన ఎన్నికల్లో సంచలన విజయం సాధించి సీయం కుర్చీ ఎక్కేందుకు సిద్దమవడంతో మరోసారి వీరి మధ్య ఉన్న బంధం తెరమీదకి వస్తుంది.ఈ క్రమంలో వీరిద్దరు కలిసి చేసిన సినిమాలేంటా అంటూ ఆరా తీస్తున్నారు మూవీ లవర్స్.మరి ఈ కాంబోలో వచ్చిన ఆ సినిమాల సంగతులేంటో మీరే చూసేయండి !
వెండితెర ప్రయాణం ‘గిల్లి’చిత్రంతో
విజయ్ మరియు త్రిషల కాంబినేషన్ అంటేనే తమిళ సినీ పరిశ్రమలో ఒక ఎవర్ గ్రీన్ క్రేజ్. వీరిద్దరి వెండితెర ప్రయాణం ‘గిల్లి’ (2004) చిత్రంతో ఎంతో గ్రాండ్‌గా మొదలైంది. తెలుగులో మహేష్ బాబు క్లాసిక్ హిట్ ‘ఒక్కడు’కు రీమేక్‌గా వచ్చిన ఈ సినిమా, కోలీవుడ్‌లో అంతకు మించిన రికార్డులను సృష్టించింది. ఒక సాధారణ కబడ్డీ ఆటగాడు వేలు (విజయ్), మధురై గ్యాంగ్‌స్టర్ (ప్రకాష్ రాజ్) నుండి ధనలక్ష్మి (త్రిష)ని రక్షించి, ఆమెను తన ఇంటికి తీసుకురావడం చుట్టూ సాగే ఈ కథ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసింది.
ముఖ్యంగా ఈ సినిమాలో విజయ్ మాస్ ఎనర్జీకి, త్రిష అమాయకత్వానికి జనం ఫిదా అయ్యారనే చెప్పాలి.ఇక ‘అప్పడి పోడు’ పాట అప్పట్లో ఒక నేషనల్ సెన్సేషన్. నేటికీ ఆ పాట వింటే అభిమానులు పూనకాలతో ఊగిపోతారంటే ఆశ్చర్యం లేదు.విజయ్‌ను ఒక పక్కా మాస్ యాక్షన్ హీరోగా నిలదొక్కుకుంది ఈ సినిమాతోనే.
ALSO READ :సెప్టెంబర్‌లో పెళ్లి పీటలెక్కనున్న జాన్వీ? వెడ్డింగ్‌పై క్లారిటీ వచ్చేసింది!
‘తిరుపాచి’ మరోసారి మ్యాజిక్ రిపీట్
ఇక ఆ తర్వాత వచ్చిన ‘తిరుపాచి’ (2005) లో ఈ జంట మరోసారి మ్యాజిక్ రిపీట్ చేసింది. అన్నాచెల్లెళ్ల సెంటిమెంట్ ప్రధానంగా సాగే ఈ మాస్ ఎంటర్టైనర్‌లో శివగిరి, శుభగా ఈ ఇద్దరి మధ్య పండిన కెమిస్ట్రీ సినిమాకే హైలెట్ .ఇక ఈ సినిమానే తెలుగులో పవన్ కళ్యాణ్ అన్నవరంగా రీమేక్ చేసినప్పటికీ ఇక్కడ ఆ స్థాయి హిట్ చూడకపోవడం గమనార్హం.
ఇదే కాంబోలో వచ్చిన మరో సినిమా ఆది
తిరుపాచ్చి తర్వాత ఇదే కాంబోలో వచ్చిన మరో సినిమా ఆది (2006).కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చి సూపర్ హిట్ అయిన ‘అతనొక్కడే’కి రీమేక్ ఇది .విజయ్, త్రిషలు ఆది,అంజలి పాత్రల్లో ఒదిగిపోయారనే చెప్పాలి.అయితే రివేంజ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా అనుకున్నంత రేంజ్ లో ఆడకపోయినా ఈ కాంబోకి ఉన్న క్రేజ్ వల్ల ఓపెనింగ్స్ మాత్రం ఊహించని రేంజ్ లో రాబట్టింది.ఇక ఈ ఆల్రెడీ సినిమాని అతనొక్కడే ని రీమేక్ చేసిన మేకర్స్ ఈ సినిమాని మళ్ళీ ఆది అంటూ డబ్ చేయడం విచిత్రం.
ALSO READ :వాళ్లు చేయలేనిది.. విజయ్ చేసి చూపించాడు
నాలుగో సినిమా కురువి
ఇక ఇదే కాంబోలో వచ్చిన నాలుగో సినిమా కురువి (Kuruvi – 2008).వెట్రివేల్, దేవి పాత్రల్లో అలరించిన ఈ జోడీ పాత ‘గిల్లి’ రోజులను గుర్తుచేసిందంటే ఆశ్చర్యం లేదు. అడ్వెంచర్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాలో వీరి డ్యాన్స్ హైలైట్‌గా నిలిచింది.ఇక ఈ సినిమాకి గిల్లి దర్శకుడు ధరణినే మెగా ఫోన్ పట్టడం విశేషం. ఇందులో విజయ్ ఫాదర్ కనిపించకుండా పోవడం, దాని వెనకాల ఉన్న మిస్టరీ ఏంటో తెలుసుకునేందుకు హీరో ఫారిన్ వెళ్ళడం. అక్కడ విలన్ చెల్లిని హీరో లవ్ చేయడం వంటివి ఆడియన్స్ ని బాగా అలరించాయి.
అసలైన సర్ ప్రైజ్ లియో
ఇక . అయితే, వీరిద్దరి కెరీర్‌లో అసలైన సర్ ప్రైజ్ ఏదన్న ఉందంటే అది ‘లియో’ (2023) సినిమానే .ఏకంగా 15 ఏళ్ల తర్వాత పార్థిబన్/లియో దాస్ గా విజయ్ ని,సత్య పాత్రలో త్రిషని భార్యాభర్తలుగా చూపించి విజయ్ ఫ్యాన్స్ కి మాంచి గిఫ్ట్ ఇచ్చాడు లోకేష్ కనగరాజ్.ఇక మొదట్లో డివైడ్ టాక్ వచ్చినప్పటికీ మెల్లిగా ఈ సినిమా ఏకంగా 600 కోట్లు కొల్లగొట్టేసింది.ముఖ్యంగా వయసు పెరిగినా వీరిద్దరి మధ్య అదే పాత కెమిస్ట్రీ ఉండటం ఇక్కడ విశేషం.
ఇక ఈ రోజు (మే 4, 2026) త్రిష బర్త్ డే అవడం, ఇదే రోజు విజయ్ రాజకీయ పార్టీ (TVK) తమిళ నాట విజయడంకా మోగించడం, ఇదే సమయంలో త్రిష ఆయనను కలిసి విషెస్ చెప్పడం చూస్తుంటే, సినిమా రీల్ లైఫ్ నుంచి రియల్ లైఫ్ పొలిటికల్ జర్నీ వరకు వీరి మధ్య ఎంతటి అన్స్టాపబుల్ కెమిస్ట్రీ ఉందో అర్థమవుతుంది. ఏది ఏమైనా రెండు దశాబ్దాలు గడిచిపోయినా ‘గిల్లి’ జోడీ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదనడానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్ .
ALSO READ :హీరోయిన్ మోనాలిసా సంచలనం.. నాపై 10 సార్లు లైంగిక దాడి.. డైరెక్టర్‌పై పోక్సో కేసు!