E-Paper
Advertisement

కొడుకుతో కలిసి.. ప్రియుడిని చంపిన మహిళ!

కొడుకుతో కలిసి.. ప్రియుడిని చంపిన మహిళ!
Advertisement

Crime News: స్వేచ్ఛ బ్యూరో: వేధిస్తున్నాడని కొడుకుతో కలిసి తనతో సహ జీవనం చేస్తున్న వ్యక్తిని దారుణంగా హత్య చేసింది ఓ మహిళ. మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా తరలించే ప్రయత్నంలో ఇద్దరూ పట్టుబడ్డారు. స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఈ హత్య జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. చింతల్ అంబేద్కర్ నగర్ వాస్తవ్యులైన అరుణ (35), శివారెడ్డి (40) పదేళ్లుగా సహజీవనంలో ఉన్నారు. వీరితోపాటు అరుణ కుమారుడు సాయిరత్నం (19) కూడా ఉంటున్నాడు.

Also Read: తెలంగాణకు మోదీ.. మే 10న పరేడ్ గ్రౌండ్స్ లో సభ అంటే ఏంటో చూపిస్తాం: ఎంపీ అరవింద్

మటన్ కొట్టే కత్తితో..

Advertisement

కాగా కొన్ని రోజులుగా మద్యానికి అలవాటు పడ్డ శివారెడ్డి తరచూ అరుణతో గొడవలు పడుతుండటంతోపాటు వేధిస్తున్నాడు. దాంతో విసిగిపోయిన అరుణ తన కొడుకు సాయిరత్నంతో కలిసి శివారెడ్డిని హత్య చేసేందుకు పథకం వేసింది. దాని ప్రకారం మటన్ కొట్టే కత్తితో శివారెడ్డి గొంతు కోసి చంపిన తల్లికొడుకులు మృతదేహాన్ని సంచిలో మూటగట్టి తరలించే ప్రయత్నం చేశారు. కాగా, అదే బిల్డింగ్ లో ఉంటున్న ఓ వ్యక్తి అందించిన సమాచారంతో వెంటనే అక్కడికి వెళ్లిన పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. శివారెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు.

Also Read: వలస వెళ్లినా చదువు ఆగదు.. దేశంలోనే తొలిసారిగా కొత్త విద్యా విప్లవం..!

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×