E-Paper
Advertisement

హీరోయిన్ మోనాలిసా సంచలనం.. నాపై 10 సార్లు లైంగిక దాడి.. డైరెక్టర్‌పై పోక్సో కేసు!

హీరోయిన్ మోనాలిసా సంచలనం.. నాపై 10 సార్లు లైంగిక దాడి.. డైరెక్టర్‌పై పోక్సో కేసు!
Advertisement

Monalisa Controversy : కుంభమేళాలో పూసలు అమ్ముకుంటూ తనదైన అందంతో సోషల్ మీడియా పుణ్యమా అని రాత్రికి రాత్రే సెలబ్రిటీగా మారింది మోనాలిసా భోంస్లే. ఇక డైరెక్టర్ సనోజ్ మిశ్రా ఈమెతో ఏకంగా సినిమా తీస్తానని అనౌన్స్ చేశాడు కూడా. మరి ఏ ముహూర్తాన వైరల్ అయ్యిందో కాని అప్పటి నుండి కంటెంట్ తక్కువ, కాంట్రవర్సీలు ఎక్కువ అన్నట్టుగా తయారైంది ఈవిడ పరిస్థితి. హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతుందనుకున్న మోనాలిసా, ఇప్పుడు వరుస కాంట్రవర్సీలు, లైంగిక వేధింపుల ఆరోపణలతో పాటు లీగల్ ఇష్యూస్‌తో ఫైట్ చేస్తూ మీడియాలో హైలెట్ అవుతుంది.

సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్

Advertisement

ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళాలో పూసలు, రుద్రాక్షలు అమ్ముకుంటూ వైరల్ అయిన మోనాలిసా సొంత ఊరు మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లాలోని మహేశ్వర్. కుంభమేళాకు వచ్చిన లక్షలాది భక్తుల కళ్లలో ఈ పిల్లికళ్ల అమ్మాయి పడటంతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ అయిపోయింది. ఇక ఈమె క్రేజ్ ఏ రేంజ్‌కి చేరిందంటే ఆమె ఉన్న చోట ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి. ఆ క్రేజ్ చూసే ఆమె ఇంటికి వెళ్లి మరీ, తన సినిమా ‘ది డైరీ ఆఫ్ మణిపూర్’ కోసం హీరోయిన్‌గా ఎంపిక చేశారు బాలీవుడ్ దర్శకుడు సనోజ్ మిశ్రా. కట్ చేస్తే… ఆగస్టు 2025లో సనోజ్ – మోనాలిసా కాంబోలో సినిమా షూటింగ్ మొదలైంది. ఇక సినిమా సాఫీగా సాగుతుంది అనుకున్న టైమ్‌లో సనోజ్ తనని సెక్సువల్‌గా హరాస్ చేశాడు అంటూ సంచలన కామెంట్స్ చేసి మీడియాలో హైలెట్ అయ్యింది.

also read :చూడటానికి సాఫ్ట్.. కానీ మాటల్లో ఫైర్! కరిష్మా కపూర్ నెగెటివ్ వీడియో వైరల్!

Advertisement

కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా

ఇదిలా ఉంటే మోనాలిసా లైఫ్‌లో మరో షాకింగ్ ఇన్సిడెంట్ ఆమె మ్యారేజ్. మార్చి 11, 2026న కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా ఫర్మాన్ ఖాన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అయితే నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ చేసిన ఇన్వెస్టిగేషన్‌లో పెళ్లి సమయానికి ఆమెకి 16 ఏళ్ల 2 నెలలు మాత్రమేనని తేలడంతో మైనర్‌ని పెళ్లాడాడు అన్న కారణంతో ఫర్మాన్‌పై పోక్సో కేసు నమోదై జైలుకు వెళ్లాల్సి వచ్చింది. అయితే పెళ్లయిన కొద్దిరోజులకే తాను గర్భవతినని సోషల్ మీడియాలో మోనాలిసా అనౌన్స్ చేయడం ఇక్కడ గమనార్హం.

తనపై 10 సార్లు లైంగిక వేధింపులు

ఇక తాజాగా తనను హీరోయిన్‌గా పరిచయం చేసిన దర్శకుడు సనోజ్ మిశ్రా షూటింగ్ సమయంలో తనపై 10 సార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ ఎర్నాకులం పోలీస్ స్టేషన్ లో ఫోక్సో కేస్ పెట్టింది . సినిమా అవకాశాల పేరుతో తనను వేధించారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. సనోజ్ మిశ్రాతో పాటు తన ఇమేజ్ డ్యామేజ్ చేయడంలో ఒక లాయర్ హస్తం కూడా ఉందంటూ తెలిపింది. ఈ క్రమంలోనే దర్శకుడితో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదు చేశారు పోలీసులు.

చూడాలి మరి… మారుమూల గ్రామంలో పుట్టి రాత్రికి రాత్రే సెలబ్రిటీగా మారి ప్రస్తుతం చిక్కుల్లో పడ్డ మోనాలిసా ఈ వివాదాల నుండి ఎప్పుడు బయటపడుతుందో!

also read :హైహీల్స్‌లో అక్షయ్ కుమార్ డ్యాన్స్ ..సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వైరల్ వీడియో

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×