Vijay: ‘అదుర్స్’ సినిమాలో బ్రహ్మానందంను ఉద్దేశించి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ చెప్పే డైలాగ్ గుర్తుందా? చంద్రకళ, బ్రహ్మీ సన్నివేశాల్లో ప్రతిసారి బ్రహ్మానందానికి అవమానం ఎదురవుతుంటే… ‘మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురువుగారు’ అని ఎన్టీఆర్ అంటుంటారు. సేమ్ టు సేమ్ ఇప్పుడు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay) విషయంలో కూడా ఆ డైలాగ్ రిపీట్ అవుతోంది. ‘TVK’ అంటూ విజయ్ పొలిటికల్ పార్టీ పెట్టిన అనంతరం ఆయన లైఫ్‌లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయో తెలియంది కాదు. విజయ్‌ని అన్ని వైపులా బిగించేస్తున్నారు. మరోవైపు ఆయనకు ఆయనే ఉచ్చు బిగించుకున్నారు. అదెలా? అనుకుంటున్నారా? ఇది గత కొన్ని రోజులుగా విజయ్‌ని ఫాలో అయ్యేవారికి ఈజీగా అర్థమవుతుంది.
Also Read- Vishwanth And Sons Teaser: సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ టీజర్ రిలీజ్…కథ మొత్తం లీక్ చేశారుగా?
పొలిటికల్ పార్టీ పెట్టిన తర్వాత రెండు మూడు పబ్లిక్ మీటింగ్స్ పెట్టిన విజయ్‌కి జనాలు బ్రహ్మరథం పట్టారు. కచ్చితంగా ఈసారి తమిళనాడు ఎన్నికలలో విజయ్ ఏదో చేయబోతున్నాడని అనుకునే లోపే.. అంతా తుస్సుమనిపించి, సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాడు. హీరోయిన్ త్రిష (Heroine Trisha)తో ఆయన సహజీవనం చేస్తున్నట్లుగా వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ టైమ్‌లో ఏదయితే జరగకూడదో, అదే విజయ్ లైఫ్‌లో జరుగుతుంది. ఒక వైపు భార్య సంగీత, విడాకులు అంటూ కోర్టు మెట్లు ఎక్కడం, మరో వైపు త్రిషను వెంటబెట్టుకుని విజయ్ తిరుగుతుండటం.. ఇవన్నీ కూడా విజయ్ క్రేజ్‌ని డౌన్ చేసేశాయి. ఇది ఇలా ఉంటే, ఇంకో వైపు ఆయనని కేసులు వెంటాడుతున్నాయి. డివోర్స్ కేసుతో పాటు, కరూర్ తొక్కిసలాట ఘటనపై కూడా ఆయనపై కేసులు నడుస్తున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల కమిషన్ తమిళనాడు ఎన్నికలకు సంబంధించి తేదీని ప్రకటించడంతో.. నెటిజన్లకు కావల్సినంత కంటెంట్ దొరికేసింది.
Also Read- Devi Sri- Thaman: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఈవెంట్‌కు సంగీత దర్శకులు ఎందుకు రాలేదో తెలుసా?.. కారణం ఇదే?
ఎన్నికల్ కమిషన్ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రంలో ఏప్రిల్ 23న ఎలక్షన్స్ జరగనున్నాయి. కానీ, ఏప్రిల్ 20న కోర్టులో విజయ్ డివోర్స్ కేసు విచారణ ఉంది. ఇటు ఎలక్షన్స్ చూసుకుంటాడా? లేక కోర్టుల చుట్టూ తిరుగుతాడా? అనేలా నెటిజన్లు ఈ పాయింట్‌పై ట్రోల్ చేస్తున్నారు. అలాగే, మే 4న కౌంటింగ్ డే. అదే రోజు, త్రిష బర్త్‌డే. కౌంటింగా, లేదంటే త్రిష బర్త్‌డేనా? దేనిపై ఆయన మనసు పెడతాడు.. ఇలాంటి పరిస్థితి పగవాడికి కూడా రాకూడదన్నా.. అంటూ నెటిజన్లు మీమ్స్‌తో సోషల్ మీడియాని షేక్ చేస్తున్నారు. ‘ఎలక్షన్ నాదే.. త్రిషా నాదే’ అని మే 4న విజయ్ డైలాగ్ చెబుతాడంటూ ఆయన అభిమానులు మరో కోణంలో ఈ ట్రోల్స్‌కి కౌంటర్స్ ఇస్తుండటం విశేషం. ఏదిఏమైనా, ఇప్పటికే వస్తున్న వార్తలతో సతమతమవుతున్న విజయ్, త్రిషలపై.. ఈ ఎన్నికల పోలింగ్ తేదీ, కౌంటింగ్ తేదీలతో కూడా ట్రోలింగ్ నడుస్తుండటం మాత్రం దెబ్బ మీద దెబ్బ అనే చెప్పుకోవాలి.
Also Read- Kissik Talks: ‘అమ్మోరు’లో మొదట నాకే అవకాశం వచ్చింది.. ఎందుకు చేయలేదంటే? – లయ