E-Paper
Advertisement

WhatsApp Guest Chat: వాట్సాప్ లేకపోయినా ఛాటింగ్.. గెస్ట్ చాటింగ్ గురించి తెలుసా?

WhatsApp Guest Chat: వాట్సాప్ లేకపోయినా ఛాటింగ్.. గెస్ట్ చాటింగ్ గురించి తెలుసా?
Advertisement

WhatsApp Guest Chat: వాట్సాప్ అకౌంట్ లేని వారికి మెసేజ్ పంపే కొత్త ఫీచర్‌ను వాట్సాప్ అందుబాటులోకి తీసుకురాబోతుంది. ‘గెస్ట్ చాట్స్’ అని పిలుస్తున్న ఈ ఫీచర్, వాట్సాప్ అకౌంట్ లోని వినియోగదారులను వెబ్ లింక్ ద్వారా చాటింగ్ చేయడానికి అనుమతిస్తుంది. ప్రత్యేకంగా వాట్సాప్ అకౌంట్ క్రియేట్ అవసరం లేకుండానే చాటింగ్ చేసుకోవచ్చు. ఈ చాట్‌ల ఎన్‌క్రిప్షన్ కీని సృష్టించడానికి ఒక ప్రత్యేకమైన ఐడెంటిఫైయర్‌ను ఉపయోగిస్తాయి. వాట్సాప్ ఛాటింగ్ లకు వర్తించే ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను వీటికి వర్తించేలా సాంకేతికను అభివృద్ధి చేస్తుంది.

గెస్ట్ చాట్స్ ఫీచర్ ఎలా పనిచేస్తుంది?

వాట్సాప్ బీటా వెర్షన్ ఉన్న Android, iOS కస్టమర్లు గెస్ట్ చాట్ ఫీచర్‌ను యాక్సెస్ చేయవచ్చు. పేరులో సూచించినట్లే వాట్సాప్ నుంచి మెసేజ్ పొందేందుకు.. అవతలి వ్యక్తికి వాట్సాప్ ఖాతా ఉండాల్సిన అవసరం లేదు. వారి కోసం వెబ్ సైట్ లో తాత్కాలికంగా గెస్ట్ సెషన్‌ను రూపొందిస్తుంది. గెస్ట్ చాటింగ్ కోసం.. షేర్ చేసిన లింక్ ద్వారా చాట్‌లో చేరవచ్చు. వాట్సాప్‌లో సైన్ అప్ చేయకుండానే మెసేజ్ లు పంపుకోవచ్చు. ఈ చాట్‌లకు గెస్ట్ లేబుల్ ఇస్తారు. దీంతో వారికి వాట్సాప్ అకౌంట్ లేదని సులభంగా తెలుస్తుంది.

లింక్ క్రియేట్ చేసి

Advertisement

‘Invite friend’ ఆప్షన్ ద్వారా లేదా యాప్‌లోని కాంటాక్ట్స్ లిస్ట్ ద్వారా ఈ లింక్‌ను క్రియేట్ చేవచ్చు. లింక్ జనరేట్ అయిన తర్వాత, దానిని SMS ద్వారా వాట్సాప్ లేని వారికి పంపి చాటింగ్ చేయవచ్చు. ఈ లింక్ ను ఫోన్ లేదా డెస్క్‌టాప్ బ్రౌజర్‌లో ఓపెన్ చేయవచ్చు. ఈ ఫీచర్ తాత్కాలికంగా మెసేజ్ లు పంపించడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఇందులో గ్రూప్ మెసేజ్ లు, ఫొటోలు, వీడియోలు, వాయిస్ మెసేజ్ లు షేర్ చేయలేం. అలాగే వాయిస్, వీడియో కాల్‌లు కూడా అందుబాటులో ఉండవు.

Also Read: మీ వాట్సాప్‌లో ఈ మార్పును గమనించారా? కమ్యూనిటీ ట్యాబ్ మాయం, ఎందుకో తెలుసా?

10 రోజుల పాటు వాడకపోతే

Advertisement

సాధారణ వాట్సాప్ అకౌంట్ మాదిరిగానే గెస్ట్ లను బ్లాక్ చేయవచ్చు. గెస్ట్ చాట్‌లకు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ సెక్యూరిటీ ఉంటుంది. 10 రోజుల పాటు ఈ లింక్ ను వాడకుండా ఉంటే గెస్ట్ చాట్‌లు ఆటోమేటిక్ గా డిలీట్ అవుతాయి. కొత్త చాటింగ్ కోసం మరో లింక్ క్రియేట్ చేయాలి. ఈ ఫీచర్ ను అక్టోబర్ 2025లో డెవలప్ చేశారు. తాజాగా ఈ ఫీచర్ వాట్సాప్ బీటా వెర్షన్ కస్టమర్లకు అందుబాటులోకి వచ్చింది. త్వరలో సాధారణ కస్టమర్లకు అందుబాటులోకి రానుంది.

Related News

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

Big Stories

Advertisement
×