E-Paper
Advertisement

Thalapathy Vijay: విజయ్ ఇంట్లోనే ఉంటా.. కోర్టులో సంగీత కొత్త పిటిషన్..!

Thalapathy Vijay: విజయ్ ఇంట్లోనే ఉంటా.. కోర్టులో సంగీత కొత్త పిటిషన్..!
Advertisement

Thalapathy Vijay: తమిళ స్టార్ హీరో.. టీవీకే పార్టీ అధినేత విజయ్ ప్రస్తుతం వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివాదాలతో.. వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల ఆయన భార్య సంగీత చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేయడం సినీ.. రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.

విజయ్ ఇంట్లోనే ఉంటా..!

విజయ్-సంగీత మధ్య కొనసాగుతున్న.. విడాకుల కేసు ఇంకా పూర్తిగా ముగియలేదు. ఈ నేపథ్యంలో సంగీత కోర్టును ఆశ్రయించి ఒక ముఖ్యమైన అభ్యర్థన పెట్టినట్లు తెలుస్తోంది. చెన్నైలోని నీలంకరై ప్రాంతంలో ఉన్న.. విజయ్ ఇంట్లో తాను కూడా సగం హక్కు కలిగి ఉన్నానని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు.

Advertisement

అందువల్ల విడాకుల కేసు పూర్తయ్యే వరకు తాను అదే ఇంట్లో ఉండేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును కోరినట్లు సమాచారం. అంతేకాకుండా తాను వేరే ఇంటికి మారే వరకు అక్కడే నివసించే హక్కు తనకు ఉండాలని కూడా ఆమె విజ్ఞప్తి చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ పరిణామం ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది. విజయ్ వ్యక్తిగత జీవితంపై ఇప్పటికే అనేక వార్తలు వస్తున్న సమయంలో ఈ కొత్త పిటిషన్ మరింత ఆసక్తి రేకెత్తించింది.

Advertisement

ఇదే సమయంలో ఇటీవల చెన్నైలో జరిగిన ఒక పెళ్లి వేడుకలో విజయ్ మరియు ప్రముఖ నటి త్రిష కలిసి కనిపించడం కూడా వార్తల్లో నిలిచింది. AGS ఫిల్మ్స్ యజమాని కల్పతి సురేష్ కుమారుడి పెళ్లికి ఈ ఇద్దరూ ఒకే కారులో రావడం అభిమానుల దృష్టిని ఆకర్షించింది. వేడుకలో ఇద్దరూ కలిసి స్టేజ్ పై నిలబడి కొత్త జంటకు పూల బొకేలు అందజేశారు.

ఆ కార్యక్రమంలో విజయ్ సిల్క్ షర్ట్.. సంప్రదాయ వెష్టి ధరించి కనిపించగా, త్రిష అదే రంగులో ఉన్న సిల్క్ చీరలో మెరిసింది. వారి ఫోటోలు మరియు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో వీరిద్దరి గురించి మళ్లీ రూమర్స్ మొదలయ్యాయి.

విజయ్ వ్యక్తిగత జీవితంపై జరుగుతున్న చర్చల మధ్య ఈ ఘటనలు మరింత ఆసక్తిని కలిగిస్తున్నాయి. అభిమానులు, సోషల్ మీడియా యూజర్లు ఈ విషయంపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు విజయ్ తన తదుపరి చిత్రం “జన నాయకన్” విడుదల కోసం సిద్ధమవుతున్నారు. ఈ సినిమా సర్టిఫికేషన్ సమస్యల కారణంగా ఆలస్యం అవుతోంది.

ALSO READ: Dhurandhar 2 Trailer: ధురంధర్ 2 ట్రైలర్ రిలీజ్.. అంతకుమించి!

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×