Vijay Rashmika: విజయ్ దేవరకొండ రష్మిక మందన్నల వివాహం ఎంతో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. వీరి వివాహం గురించి సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు వచ్చాయి. ముఖ్యంగా వీరి పెళ్లి గురించి వీరు ఇచ్చిపుచ్చుకున్న బహుమతుల గురించి కూడా వార్తలు పెద్ద ఎత్తున బయటకు వచ్చాయి. ముఖ్యంగా విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)పెళ్లి సందర్భంగా తన భార్య రష్మికకు(Rashmika) 90 కోట్ల విలువచేసే లగ్జరీ విల్లా కానుకగా ఇచ్చారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు రావడంతో ఈ వార్తలు నిజమేనని అందరూ భావించారు.
ఈ నేపథ్యంలోనే విజయ్ దేవరకొండ మేనమామ ప్రముఖ నిర్మాత రంగినేని ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా రష్మిక విజయ్ దేవరకొండ పెళ్లి గురించి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. రష్మిక విజయ్ దేవరకొండ పెళ్లి కోసం బాగా ఖర్చు చేశారు కానీ ఎంత ఖర్చు చేశారనే విషయాన్ని మాత్రం తనకు స్పష్టంగా తెలియదని తెలిపారు. ఖర్చు విషయంలో ఎక్కడ వెనకాడ లేదని రంగినేని తెలిపారు. ఇక రష్మిక కోసం విజయ్ దేవరకొండ 90 కోట్లు చేసే బంగ్లా ఇచ్చారంటూ వార్తలు వచ్చాయి నిజమేనా? అంటూ ప్రశ్న ఎదురైంది.
ఈ ప్రశ్నకు రంగినేని సమాధానం చెబుతూ రష్మికకు ఖరీదైన కానుక ఇచ్చారంటూ వస్తున్న ఈ వార్తలలో ఏ మాత్రం నిజం లేదని తెలిపారు. అసలు విజయ్ దేవరకొండ నటించిన సినిమాలు ఎన్ని? తన రెమ్యూనరేషన్ ఎంత? కొన్ని సినిమాలకు రెమ్యూనరేషన్ కూడా ఇవ్వలేదని, విజయ్ సుమారు 15 సినిమాలు చేసి ఉంటాడు.ఇటీవల తన సినిమాలు కూడా పెద్దగా సక్సెస్ కాలేదు. అలాంటి వ్యక్తి 90 కోట్ల విలువైన బంగ్లా ఎలా గిఫ్ట్ గా ఇవ్వగలడు ఇదంతా కూడా కేవలం రూమర్స్ మాత్రమేనని తెలిపారు. ఇక 90 కోట్ల బంగ్లా ఇస్తానంటే ఏదైనా పేపర్ మీద రాసిచ్చాడేమో బహుశా అంటూ విజయ్ మేనమామ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
రణబాలి ఎంతో ప్రత్యేకం..
ఇక విజయ్ దేవరకొండ రష్మిక పెళ్లి పూర్తి కావడంతో వీరిద్దరూ సినిమా షూటింగ్ లకు కొంత విరామం ఇచ్చారు. త్వరలోనే తిరిగి షూటింగ్ పనులలో పాల్గొనబోతున్నారు. విజయ్ రష్మిక జంటగా రణబాలి అనే సినిమాలో నటిస్తున్నారు. పెళ్లికి ముందు వీరిద్దరూ గీతాగోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలలో నటించిన విషయం తెలిసిందే. ఇక పెళ్లి తర్వాత మొదటిసారి వీరిద్దరూ జంటగా రణబాలి సినిమాలో కనిపించబోతున్న నేపథ్యంలో అభిమానులకు కూడా ఈ సినిమా ఎంతో ప్రత్యేకంగా ఉండబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన గ్లింప్స్, ఏందయ్యా స్వామి అంటూ సాగిపోయే పాట కూడా మంచి అంచనాలను పెంచేసింది. ఇక ఈ సినిమాని ఈ ఏడాది సెప్టెంబర్ 11వ తేదీ ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి చిత్ర నిర్మాతలు సిద్ధమవుతున్నారు.
Also Read: Vijay Rashmika: రష్మికతో విజయ్ పెళ్లి .. భయపడిన విజయ్ పేరెంట్స్.. ఏమైందటే ?