E-Paper
Advertisement

HBD Viraj Ashwin: బేబీతో గుర్తింపు.. ఎవరీ విరాజ్ అశ్విన్.. బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్!

HBD Viraj Ashwin: బేబీతో గుర్తింపు.. ఎవరీ విరాజ్ అశ్విన్.. బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్!
Advertisement

HBD Viraj Ashwin:సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలి అంటే ప్రతిభతో పాటు అదృష్టం కూడా ఉండాలి. కానీ కొంతమందికి బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ కూడా ఇండస్ట్రీలో రాణించలేక ఇబ్బందులు పడుతున్నారు. మరికొంతమంది కుటుంబ బ్యాక్ గ్రౌండ్ ను ఉపయోగించుకోకుండా ఇండస్ట్రీలోకి వచ్చి సత్తా చాటే ప్రయత్నం చేస్తున్నారు. ఇక అలాంటి వారిలో విరాజ్ అశ్విన్ (Viraj Ashwin)కూడా ఒకరు. వెనుక కొండంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ దానిని ఏమాత్రం ఉపయోగించుకోకుండా.. ఇప్పుడు తనదైన శైలిలో అవకాశాలు అందుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇకపోతే ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కాంబినేషన్లో వచ్చిన ‘బేబీ’ సినిమాలో నటించి.. ట్రయాంగిల్ లవ్ స్టోరీ తో తన అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు. ఈ ఒక్క సినిమా ఆయన కెరియర్ నే మార్చేసింది. దీంతో ఈయన ఎవరు? ఈయన బ్యాక్ గ్రౌండ్ ఏంటి ? అని అభిమానులు కూడా ఆరా తీయడం మొదలుపెట్టారు. ఇకపోతే నేడు విరాజ్ అశ్విన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

బేబీ తో ఊహించని గుర్తింపు..

సాధారణంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఫ్యామిలీల నుండి ఎవరైనా ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నారు అంటే ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ను బాగా ఉపయోగించుకుంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే.కానీ విరాజ్ అశ్విన్ మాత్రం ఆ పని చేయలేదు.. స్వతహాగా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ప్రయత్నం చేశారు . అలా 2018లో వచ్చిన ‘అనగనగా ఓ ప్రేమకథ’ సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఆ తర్వాత వచ్చిన తెలుగు లఘు చిత్రం ‘మానస నామః’ లో ప్రధాన పాత్ర పోషించి, అనేక అవార్డులు కూడా సొంతం చేసుకున్నారు.

Advertisement

ఇక 2021లో రమేష్ దర్శకత్వం వహించి, మాగంటి శరత్ చంద్రారెడ్డి నిర్మించిన ‘థ్యాంక్యూ బ్రదర్’ సినిమాలో నటించిన ఈయన.. 2022లో వచ్చిన ‘వాళ్ళిద్దరి మధ్య’ సినిమాతో మరో అవకాశాన్ని అందుకున్నారు. కానీ ఇవేవీ పెద్దగా గుర్తింపును అందించకపోయినా.. 2023లో వచ్చిన ‘బేబీ’ సినిమా ఈయనకు ఊహించని విజయాన్ని అందించింది. ఇక ఆ తర్వాత ‘హాయ్ నాన్న’ చిత్రంలో డాక్టర్ అశోక్ భాటియా పాత్ర పోషించిన విరాట్.. శ్రీరంగనీతులు సినిమా తర్వాత ‘మారీచిక’ అనే చిత్రంలో నటిస్తున్నారు . ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఇక ఈ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకొని మళ్లీ కం బ్యాక్ అవ్వాలని చూస్తున్నారు విరాజ్ అశ్విన్.

ALSO READ:HBD Roshan Meka: చైల్డ్ ఆర్టిస్ట్ టు హ్యాండ్సమ్ హీరో.. రోషన్ ప్రయాణం ఆ స్టార్ తోనే!

విరాజ్ అశ్విన్ బ్యాక్ గ్రౌండ్.. ఆయన ముని మనవడే..

Advertisement

విరాజ్ అశ్విన్ బ్యాక్ గ్రౌండ్ విషయానికి వస్తే.. తెలుగు కుటుంబం అయిన వెంకటేశ్వరరావు, వెంకటేశ్వరి దంపతులకు జన్మించారు. వెంకటేశ్వరరావు భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోలో శాస్త్రవేత్తగా పనిచేసే రిటైర్మెంట్ తీసుకున్నారు. విరాజ్ ఎవరో కాదు దివంగత సినిమా ఎడిటర్ కె .ఎ.మార్తాండ్ మనవడు. ప్రముఖ ఫిలిం డైరెక్టర్ శంకర్ కే మార్తాండ్ మేనల్లుడు. అంతేకాదు ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు బి.ఏ.సుబ్బారావు ముని మనవడు కూడా. మరి ఇంత బ్యాక్ గ్రౌండ్ ఉండి కూడా ఆయన తన ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉపయోగించుకోకుండా ప్రస్తుతం సినిమాలలో అవకాశాలు అందుకునే ప్రయత్నం చేస్తున్నారు.

Related News

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×