E-Paper
Advertisement

Best Induction Stoves: వంట గ్యాస్ సిలిండర్ కంటే ఇండక్షన్ స్టవ్‌ కొనడం బెటర్.. ఆన్‌లైన్‌లో బెస్ట్ ఆప్షన్స్ ఇవే

Best Induction Stoves: వంట గ్యాస్ సిలిండర్ కంటే ఇండక్షన్ స్టవ్‌ కొనడం బెటర్.. ఆన్‌లైన్‌లో బెస్ట్ ఆప్షన్స్ ఇవే
Advertisement

Best Induction Stoves| దేశంలో LPG (వంట గ్యాస్) సిలిండర్ల ధరలు మళ్లీ పెరిగాయి. పైగా ఇరాన్ యుద్ధం కారణంగా గ్యాస్ సరఫరా లేక దేశవ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ల తీవ్ర కొరత ఏర్పడింది. ఈ కారణంగా మధ్య తరగతి కుటుంబాలు వంట గ్యాస్ ఖర్చుల గురించి ఆందోళన చెందుతున్నాయి. కొరత వల్ల ఇప్పుడు సిలిండర్ బుకింగ్‌ కోసం ఎక్కువ రోజులు వేచి ఉండాల్సి వస్తోంది. ఈ ఆలస్యం వల్ల కొన్ని గ్యాస్ ఏజెన్సీలు ఎక్కువ ధరలు వసూలు చేస్తున్నాయి. దీంతో చాలా మంది గ్యాస్ సిలిండర్లకు ప్రత్యామ్నాయ వంట సాధనాల కోసం వెతుకుతున్నారు. ఇలాంటి వారికి ఇండక్షన్ కుక్‌టాప్‌లు బెస్ట్ ఆప్షన్. ఇటీవలి కాలంలో ఈ స్టవ్‌లు చాలా పాపులర్ అవుతున్నాయి. కరెంట్‌తో పనిచేసే ఇండక్షన్ స్టవ్‌లపై వంట త్వరగా, సురక్షితంగా పూర్తవుతుంది. ఆన్‌లైన్‌లో తక్కువ ధరలో మంచి మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిలో బెస్ట్ ఇవే..

Wellberg Infrared ఇండక్షన్ స్టవ్ 2200 Watts

వెల్‌బర్గ్ ఇన్‌ఫ్రారెడ్ ఇండక్షన్ స్టవ్ 2200 వాట్స్ మోడల్ ఎక్కువ పవర్‌తో బలంగా పనిచేస్తుంది. ఆన్‌లైన్‌లో ఈ స్టవ్ ధర దాదాపు రూ.2,440కి లభిస్తోంది. తక్కువ ధరలో ఎక్కువ వాట్స్‌ పవర్ ఇచ్చే మోడల్ ఇదే. ఓవర్‌హీటింగ్ అయితే ఆటోమాటిక్‌గా ఆఫ్ అవుతుంది. సాఫ్ట్ టచ్ కంట్రోల్స్ ఉన్నాయి. టెంపరేచర్, పవర్ సెట్టింగ్స్ సులభంగా మార్చవచ్చు. గ్లాస్ టాప్ డిజైన్ స్టైలిష్‌గా ఉంటుంది. దాదాపు అన్ని రకాల వంట పాత్రలతో పనిచేస్తుంది.

Wonderchef Acura 1400W సింగిల్ ఇండక్షన్ కుక్‌టాప్

Advertisement

చిన్న కుటుంబాలకు బాగా సరిపోయే మోడల్ వండర్‌చెఫ్ అక్యూరా 1400W సింగిల్ ఇండక్షన్ కుక్‌టాప్. దీని ధర దాదాపు. రూ.1,999. ఇందులో 11 ప్రీసెట్ కుకింగ్ ఫంక్షన్లు ఉన్నాయి. వివిధ వంటలు సులభంగా చేయవచ్చు. పుష్ టచ్ బటన్స్‌తో టెంపరేచర్ సులభంగా సెట్ చేయవచ్చు. డ్యూయల్-లేయర్ కాయిల్ సిస్టమ్ వల్ల వేగంగా వేడెక్కుతుంది. ఆటోమాటిక్ షట్ ఆఫ్, LED డిస్‌ప్లే ఉన్నాయి. ఇందులో భద్రత, సమాచారం స్పష్టంగా ఉంటాయి.

Havells 1600W ఇండక్షన్ కుక్‌టాప్

రోజువారీ వంట చేసేందుకు మంచి ఆప్షన్ హావెల్స్ 1600W ఇండక్షన్ కుక్‌టాప్. ఈ స్టవ్ ధర సుమారు రూ.3,499. ఇందులో పుష్-బటన్ కంట్రోల్స్, 9 కుకింగ్ మోడ్స్ ఉన్నాయి. డిజిటల్ డిస్‌ప్లే, LED ఇండికేటర్లు సెట్టింగ్స్ స్పష్టంగా చూపిస్తాయి. ఓవర్‌హీటింగ్ ప్రొటెక్షన్, ఆటో ప్యాన్ డిటెక్షన్ ఉన్నాయి. ప్యాన్ లేకపోతే ఆటోమాటిక్ ఆఫ్ అవుతుంది.

Usha 2000W ఇండక్షన్ కుక్‌టాప్

Advertisement

2000 వాట్స్ పవర్‌తో బలమైన మోడల్ ఉషా 2000W ఇండక్షన్ కుక్‌టాప్. చాలా త్వరగా వేడెక్కుతుంది. ఆన్‌లైన్‌లో రూ.3,839కే కొనుగోలు చేయొచ్చు. టచ్ కంట్రోల్ ప్యానెల్ రెస్పాన్సివ్‌గా ఉంటుంది. సెట్టింగ్స్ సులభంగా మార్చవచ్చు. ఆటోమాటిక్ పవర్-ఆఫ్ ప్రొటెక్షన్ ఉంది. బరువు 2 కిలోలు మాత్రమే. కిచెన్‌లో సులభంగా ఎక్కడైనా పెట్టొచ్చు.

Also Read: వేసవిలో కరెంట్ బిల్లు తగ్గించడానికి ఈజీ టిప్స్.. ఖర్చు లేకుండానే కూల్ కూల్

Bajaj 2200W ఇండక్షన్ కుక్‌టాప్

2200 వాట్స్ హీటింగ్ కెపాసిటీతో మరో పవర్‌ఫుల్ మోడల్ బజాజ్ 2200W ఇండక్షన్ కుక్‌టాప్. ధర సుమారు రూ.3,499. మోడరన్ టచ్ కంట్రోల్ ప్యానెల్ ఉంది. కుకింగ్ మోడ్స్, పవర్ లెవల్స్ సులభంగా మార్చవచ్చు. డిజిటల్ LED డిస్‌ప్లే టెంపరేచర్, టైమర్, పవర్ స్పష్టంగా చూపిస్తుంది. ఆటోమాటిక్ షట్-ఆఫ్ సేఫ్టీ ఫీచర్ ఉంది.

ఇండక్షన్ స్టవ్‌లు.. గ్యాస్ సిలిండర్ల కంటే బెటర్ ఎందుకంటే?

ఇంట్లో ఇండక్షన్ కుక్‌టాప్‌ స్టవ్‌ ఉంటే గ్యాస్ సిలిండర్లపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది. గ్యాస్ అందుబాటు లేనప్పుడు ఏ సమస్య ఉండదు. వంట త్వరగా జరుగుతుంది, విద్యుత్ తక్కువ వినియోగమవుతుంది. చాలా మోడల్స్‌లో అడ్వాన్స్ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. ఆన్‌లైన్‌లో అతి తక్కువ ధరల్లో లభిస్తున్నాయి. మీ బడ్జెట్ ఆధారంగా కొనుగోలు చేయండి.

Related News

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

Big Stories

Advertisement
×