E-Paper
Advertisement

Virosh wedding: రష్మికకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన కాబోయే అత్తగారు.. ఏంటో తెలుసా?

Virosh wedding: రష్మికకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన కాబోయే అత్తగారు.. ఏంటో తెలుసా?
Advertisement

Virosh Wedding: రష్మిక మందన్న విజయ్ దేవరకొండ మరికొన్ని గంటలలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట పెద్దల సమక్షంలో పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్నారు. వీరి వివాహపు తేదీ ఫిబ్రవరి 26వ తేదీ ఉదయం ఎంతో అంగరంగ వైభవంగా సాంప్రదాయ పద్ధతిలో జరగబోతున్న సంగతి తెలిసిందే .ఇక 26వ తేదీ రష్మిక (Rashmika) విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) రెండుసార్లు పెళ్లి చేసుకోబోతున్నారు. విజయ్ రష్మిక ఇద్దరి సాంప్రదాయాల ప్రకారం వీరి వివాహపు వేడుకలు జరగబోతున్నాయని తెలుస్తోంది.

రష్మిక కోసం ప్రత్యేకమైన కానుక..

మూడు రోజులపాటు వీరి పెళ్లి వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. నిన్న సాయంత్రం రష్మిక విజయ్ దేవరకొండ సంగీత్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఇందుకు సంబంధించిన కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సంగీత్ వేడుకలో భాగంగా పలువురు సెలబ్రిటీలతో పాటు ఇరువురి కుటుంబ సభ్యులకు కూడా ఎంతో సంతోషంగా గడిపారని తెలుస్తోంది. ఇక ఈ సంగీత్ వేడుకలో భాగంగా విజయ్ దేవరకొండ తల్లి మాధవి(Madhavi) రష్మిక కోసం ప్రత్యేకమైన కానుకలు కూడా అందించారని తెలుస్తుంది.

కుటుంబ వారసత్వంగా వస్తున్న గాజులు..

Advertisement

విజయ్ దేవరకొండ తల్లి మాధవి తన కుటుంబ వారసత్వంగా తరతరాలుగా వస్తున్న బంగారు గాజులను(Bangles) రష్మికకు సంగీత్ కార్యక్రమంలో కార్యక్రమంలో భాగంగా ఈ గాజులను అందజేయడంతో రష్మిక సైతం ఎంతో ఎమోషనల్ అయ్యారని తెలుస్తోంది. ఇలా కుటుంబ వారసత్వంగా వస్తున్న గాజులను రష్మికకు అందచేయడమే కాకుండా తన ఇంటి కోడలుగా తనకు ఎంతో గౌరవాన్ని ఇవ్వడంతో రష్మిక కాస్త ఎమోషనల్ అయ్యారు. ఇలా ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వివాహపు వేడుకలలో భాగంగా ఆ ప్రాంతం మొత్తం సంతోషకర వాతావరణ నెలకొందని తెలుస్తోంది.

నేడు హల్ది, మెహందీ…

Advertisement

విజయ్ దేవరకొండ రష్మిక తమ వివాహపు వేడుకను కేవలం ఒక వివాహంలా మాత్రమే కాకుండా తమ జీవితంలో ఎప్పటికీ నిలిచిపోయే మధుర జ్ఞాపకంగా ఉండేలా ఈ పెళ్లి వేడుకను జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఆటపాటలతో ఈ వేడుకకు మరింత అందం తీసుకువచ్చారు. సంగీత్ కంటే ముందు ఈ జంట పెళ్లికి వచ్చిన అతిథులతో సరదాగా విరోష్ ప్రీమియర్ లీగ్ పేరుతో క్రికెట్ మ్యాచ్ కూడా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇలా ఆటపాటలతో వీరి వివాహపు వేడుకలు ఎంతో సంతోషంగా జరుగుతున్నాయి. గత రాత్రి సంగీత్ వేడుక పూర్తి కాగా, నేడు మెహందీ, హల్ది వేడుకలు జరగనున్నాయి. ఇక 26వ తేదీ ఉదయం ఈ జంట పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్నారు.

Also Read: Virosh wedding: రష్మిక విజయ్ పెళ్లి..ఉదయ్ పూర్ చేరుకున్న టాలీవుడ్ సెలెబ్రిటీలు!

Related News

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

Big Stories

Advertisement
×