E-Paper
Advertisement

Vishnu Vinyasam: ఎన్ని విన్యాసాలు వేసినా ఏం లాభం.. థియేటర్లు ఖాళీ! ఖర్చులు కూడా కష్టమేనా?

Vishnu Vinyasam: ఎన్ని విన్యాసాలు వేసినా ఏం లాభం.. థియేటర్లు ఖాళీ! ఖర్చులు కూడా కష్టమేనా?
Advertisement

Vishnu Vinyasam: టాలీవుడ్‌లో మినిమం గ్యారెంటీ హీరోగా, విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకులను అలరించే శ్రీవిష్ణు (Sree Vishnu)కు ఈసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎంటర్‌టైన్‌మెంట్ కింగ్‌గా పేరు తెచ్చుకున్న ఆయన నటించిన తాజా చిత్రం ‘విష్ణు విన్యాసం’ (Vishnu Vinyasam) ఫిబ్రవరి 27, శుక్రవారం.. భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమా చూసిన ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే, ఈ విన్యాసం బాక్సాఫీస్ వద్ద చతికిలపడినట్లే కనిపిస్తోంది. ఈ సినిమా విడుదలకు ముందు చిత్ర బృందం చేసిన ప్రమోషన్లు, ట్రైలర్ క్రియేట్ చేసిన హైప్ చూసి అందరూ శ్రీవిష్ణు ఖాతాలో మరో హిట్ పక్కా అని భావించారు. ముఖ్యంగా జాతకాల నేపథ్యంలో సాగే కథాంశం కావడంతో, ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ చాలా కాన్ఫిడెంట్‌గా ఉంది. కానీ, థియేటర్లలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. కథలో పస లేకపోవడం, ఆశించిన స్థాయిలో ఎంటర్‌టైన్‌మెంట్ పండకపోవడంతో ప్రేక్షకులు ఈ సినిమాకు కనెక్ట్ కాలేకపోతున్నారు.

Also Read- Virosh Wedding: విజయ్‌, రష్మికల పెళ్లిపై కన్నడ నెటిజన్లు ఆగ్రహం!

వెలవెలబోతున్న థియేటర్లు

Advertisement

ప్రస్తుతం చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య థియేటర్లకు జనాలు రాకపోవడం. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ‘విష్ణు విన్యాసం’ టీమ్ తమ సినిమా కచ్చితంగా ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తుందని ధీమా వ్యక్తం చేసింది. కానీ, మొదటి రోజే థియేటర్లలో కుర్చీలన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. జాతకాల చుట్టూ శ్రీవిష్ణు ఎన్ని విన్యాసాలు చేసినా, జనాలు మాత్రం ఆ విన్యాసాలను చూసేందుకు ఆసక్తి చూపడం లేదు. మొదటి రోజు మార్నింగ్ షో నుంచే నెగిటివ్ టాక్ మొదలవ్వడం ఈ సినిమాకు పెద్ద మైనస్‌గా మారింది. సాధారణంగా శ్రీవిష్ణు సినిమాలకు మౌత్ టాక్‌తో కలెక్షన్లు పెరుగుతాయి, కానీ ఈ సినిమా విషయంలో అది కూడా కష్టమే అనిపిస్తోంది. సినిమా నిర్మాణానికి పెట్టిన ఖర్చులు కూడా తిరిగి రావడం కష్టమే అనేలా ట్రేడ్ వర్గాల్లో సైతం టాక్ నడుస్తుంది.

Also Read- Movies Censor: సెన్సార్ సర్టిఫికెట్లపై కేంద్రం కీలక నిర్ణయం.. ఇక సినిమాలకు అలా జరగదంటూ..!

మిరాకిల్ జరగాల్సిందే

Advertisement

రిలీజ్‌కు ముందు కాస్తో, కూస్తో బజ్ ఉంది. కానీ మొదటి రోజే జనాలు లేకపోతే, రాకపోతే.. ఇక ఈ సినిమాపై బజ్ ఏమున్నట్టు? అలాగే, రిలీజ్ రోజే రాని ప్రేక్షకులు వీకెండ్‌లో వస్తారని ఆశించడం కూడా అత్యాశే అవుతుందనేలా టాలీవుడ్ సర్కిల్స్‌ కూడా వార్తలు వైరల్ అవుతుండటం విశేషం. శ్రీవిష్ణు పడ్డ కష్టం, ఆయన నటన బాగానే ఉన్నప్పటికీ, బలహీనమైన కథనం సినిమాను ముంచేసిందని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమా గట్టెక్కాలంటే ఏదైనా మిరాకిల్ జరగాల్సిందే. ఓవరాల్‌గా ‘విష్ణు విన్యాసం’ బాక్సాఫీస్‌కు ఒక పెద్ద ఝలక్ ఇచ్చిందని చెప్పక తప్పదు. చూద్దాం మరి.. ఈ పరిస్థితుల్లో సినిమాను నిలబెట్టేందుకు టీమ్ ఎలాంటి ప్రయత్నాలు చేస్తారో? మరోవైపు, తదుపరి శుక్రవారమే శ్రీవిష్ణు నటించిన మరో సినిమా వచ్చేందుకు రెడీగా ఉంది. ఎటు చూసినా, ఈ సినిమాకు ఇబ్బందులు తప్పేలా లేవు.

Also Read- Peddi Release Date: ‘పెద్ది’ వాయిదా లేనట్టే.. మరోసారి కన్ఫర్మ్ చేసిన మేకర్స్!

Related News

కావ్య మారన్ తో అనిరుధ్ పెళ్లి ఫిక్స్.. వారికి ప్రత్యేక ఆహ్వానం!

ఈ జనరేషన్‌కు మరో బ్రహ్మానందం దొరికేశాడు.. కోనా వెంకట్ కామెంట్స్!

గ్లామర్ మాత్రమే కాదు.. చీరకట్టులోనూ త్రిష అందం అదుర్స్!

రజనీకాంత్‌కు తిరుగులేదుగా.. ‘జైలర్ 2’ కలెక్షన్ల లెక్క ఇదే!

గ్యాంగ్‌స్టర్ సినిమా అనుకుంటే.. చిరంజీవి సినిమాలో అసలు ట్విస్ట్ ఇదే!

రేవంత్ రెడ్డి, కేసీఆర్‌తో పరిచయాలున్నా.. ఆ పని మాత్రం చేయలేదు!

స్పెషల్ అట్రాక్షన్ గా రణబీర్ వాచ్.. రాముడు, హనుమంతుడితో ప్రత్యేక డిజైన్..

దాసరి సినిమా షూటింగ్‌లో అసలేం జరిగింది? దివ్యవాణి బయటపెట్టిన విషయాలు

Big Stories

Advertisement
×