E-Paper
Advertisement

Cinema Industry: డిస్ట్రిబ్యూషన్‌లోకి మరో అగ్ర నిర్మాణ సంస్థ.. పోటీ మాములుగా లేదుగా!

Cinema Industry: డిస్ట్రిబ్యూషన్‌లోకి మరో అగ్ర నిర్మాణ సంస్థ.. పోటీ మాములుగా లేదుగా!
Advertisement

Cinema Industry: భారతీయ సినీ పరిశ్రమ (Indian Cinema Industry)లో ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ నడుస్తోంది. అగ్ర నిర్మాణ సంస్థలు కేవలం సినిమాలు నిర్మించడమే కాకుండా, తామే నేరుగా పంపిణీ రంగంలోకి అడుగుపెడుతున్నాయి. రీసెంట్‌గా టాలీవుడ్‌లో అన్నపూర్ణ స్టూడియోస్ (Annapurna Studios) డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి దిగుతోందనే వార్త ఇండస్ట్రీని ఏ రేంజ్‌లో షేక్ చేసిందో తెలిసిందే. ఈ మూవ్ వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనే చర్చలు జరుగుతుండగానే, ఇప్పుడు గ్లోబల్ బాక్సాఫీస్‌ను శాసించే మరో అగ్ర నిర్మాణ సంస్థ రంగంలోకి దిగింది. ‘కేజీఎఫ్’ సిరీస్ చిత్రాలు, ‘కాంతార’, ‘సలార్’ వంటి ల్యాండ్‌మార్క్ బ్లాక్‌బస్టర్‌లతో భారతీయ సినిమా రూపురేఖలను మార్చేసిన హోంబాలే ఫిల్మ్స్ (Hombale Films), ఇప్పుడు ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్‌లోకి అధికారికంగా ప్రవేశించింది. ఇది కేవలం ఒక వ్యాపార నిర్ణయం మాత్రమే కాదు, భారతీయ సినిమాను ప్రపంచంలోని ప్రతి మూలకు చేరవేయాలనే ఒక భారీ లక్ష్యంతో ఈ సంస్థ దిగుతోందట.

Also Read- Vishnu Vinyasam: ఎన్ని విన్యాసాలు వేసినా ఏం లాభం.. థియేటర్లు ఖాళీ! ఖర్చులు కూడా కష్టమేనా?

అసలు ఉద్దేశ్యమిదే..

Advertisement

భాషలు, సంస్కృతులతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు భారతీయ కథలను చేరువ చేయడమే ఈ కొత్త అడుగు వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యమని సదరు సంస్థ అధికారికంగా ప్రకటించింది. హోంబాలే ఫిల్మ్స్ కేవలం తమ సొంత సినిమాలను మాత్రమే పంపిణీ చేయదు. భారతదేశంలోని ఇతర ప్రతిభావంతులైన దర్శకులు, నిర్మాణ సంస్థలతో కలిసి పనిచేసి, వారి విభిన్నమైన కథలను అంతర్జాతీయ స్థాయిలో విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ‘సలార్, కాంతార చాప్టర్ 1, మహావతార్ నరసింహ’ వంటి భారీ ప్రాజెక్టుల అనుభవంతో అంతర్జాతీయ స్థాయిలో ఒక పటిష్టమైన డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌ను నిర్మించాలని సంస్థ భావిస్తోంది. దీంతో సినిమా ఇండస్ట్రీలో డిస్ట్రిబ్యూషన్ వ్యవహారం మరింత ఆసక్తికరంగా మారుతుందనడంలో అతిశయోక్తి లేనే లేదు.

Also Read- The Kerala Story 2: ది కేరళ స్టోరీ 2 పై హైకోర్టు కీలక తీర్పు..‌ సినిమా విడుదల ఉందా.. లేదా.. అంటే..!

మొదలైన పోటీ.. ఎవరికి లాభం?

Advertisement

అన్నపూర్ణ స్టూడియోస్ వంటి సంస్థలు లోకల్ మార్కెట్‌లో డిస్ట్రిబ్యూషన్ పై ఫోకస్ పెడుతుంటే, హోంబాలే వంటి సంస్థలు అంతర్జాతీయ మార్కెట్‌ను టార్గెట్ చేస్తున్నాయి. దీనివల్ల చిన్న సినిమాలకు, నాణ్యమైన కంటెంట్ ఉన్న చిత్రాలకు గ్లోబల్ ప్లాట్‌ఫారమ్ దొరుకుతుంది. అయితే, ఇప్పటికే ఈ రంగంలో పాతుకుపోయిన పాత డిస్ట్రిబ్యూటర్లకు మాత్రం ఇది గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. భారతీయ కథలను గ్లోబల్ లెవల్‌కు తీసుకెళ్లాలనే హోంబాలే ఫిల్మ్స్ విజన్, ఇండియన్ సినిమాలకు విదేశాల్లో మరింత గుర్తింపు, ఆదాయాన్ని తెచ్చిపెడుతుందనడంలో సందేహం లేదు. అగ్ర నిర్మాణ సంస్థల మధ్య మొదలైన ఈ డిస్ట్రిబ్యూషన్ వార్ మున్ముందు ఇంకెన్ని ఆసక్తికర మలుపులు తిరుగుతుందో చూడాల్సి ఉంది.

Also Read- Puri jagannadh: సూర్య పూరి జగన్నాథ్ కాంబోలో మిస్సైన సూపర్ హిట్ మూవీ.. మళ్ళీ ఇన్నాళ్ళకు?

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×