Virosh Wedding: రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) పెళ్లి బంధంలో ఒకటైన విషయం తెలిసిందే. గత కొన్నాళ్లుగా వీరిద్దరి ప్రేమ, పెళ్లి గురించి రకరకాల వార్తలు వైరల్ అవగా, వాటన్నింటికీ సమాధానంగా ఉదయ్‌పూర్‌లో వీరి వివాహం నిలిచింది. అత్యంత వైభవంగా.. ఇరు కుటుంబాలకు చెందిన దగ్గరి బంధువులు, సన్నిహితుల మధ్య వారి పెళ్లి ముచ్చట పూర్తయింది. ఈ వేడుకకు సంబంధించిన కొన్ని ఫోటోలను విజయ్, రష్మికలు అధికారికంగా విడుదల చేయడంతో.. వారి అభిమానులు హ్యాపీగా ఫీలవుతున్నారు. మరోవైపు.. ఈ పెళ్లి వార్త తెలుగు రాష్ట్రాల్లో పండగ వాతావరణాన్ని తెస్తే, కర్ణాటకలో మాత్రం పెద్ద దుమారాన్నే రేపుతోంది. అవును కన్నడ నెటిజన్లు ఈ పెళ్లిపై ఫైర్ అవుతున్నారు.
Also Read- Sangeeta Vijay: విజయ్ తో విడాకుల కోరిన ఆయన భార్య సంగీత ఆస్తి వివరాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
రష్మిక మందన్నా పెళ్లి అనే వార్తలు వచ్చినప్పటి నుంచి కన్నడ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. దీనికి ప్రధాన కారణం రష్మిక తన కెరీర్ ఆరంభంలో చేసిన కొన్ని పనులే. రష్మికకు సినిమా రంగంలో తొలి అవకాశం ఇచ్చి, ఆమెను వెండితెరకు పరిచయం చేసింది కన్నడ నటుడు, దర్శకుడు రక్షిత్ శెట్టి (Rakshit Shetty). ‘కిరిక్ పార్టీ’ సినిమా సమయంలో వీరిద్దరి మధ్య చిగురించిన ప్రేమ.. 2017లో నిశ్చితార్థానికి దారితీసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో రక్షిత్ శెట్టి ఆమెకు నటనకు ఎంతో వెన్నుదన్నుగా నిలిచారని, ఆమె ఎదగడానికి కావాల్సిన ప్రతి సాయం చేశారని కన్నడ అభిమానులు గుర్తు చేస్తున్నారు. కానీ, నిశ్చితార్థం జరిగిన కొన్ని రోజులకే రష్మిక ఆ బంధాన్ని తెంచుకోవడం అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది. కేవలం కెరీర్‌లో ఎదగడం కోసమే రక్షిత్ శెట్టిని ఆమె మోసం చేసిందని కన్నడ నెటిజన్లు ఆరోపిస్తున్నారు.
Also Read- Movies Censor: సెన్సార్ సర్టిఫికెట్లపై కేంద్రం కీలక నిర్ణయం.. ఇక సినిమాలకు అలా జరగదంటూ..!
రక్షిత్ శెట్టితో విడిపోయిన తర్వాత రష్మిక టాలీవుడ్‌లో వరుస విజయాలతో బిజీ అయిపోయింది. ‘గీత గోవిందం’ సినిమా షూటింగ్ సమయంలోనే విజయ్ దేవరకొండతో ఆమెకు పరిచయం ఏర్పడిందని, ఆ బంధమే ఇప్పుడు పెళ్లి వరకు దారితీసిందనేలా వార్తలు వినిపిస్తున్న విషయం తెలియంది కాదు. రక్షిత్ శెట్టికి జరిగిన అన్యాయాన్ని కన్నడిగులు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. ముఖ్యంగా రష్మిక తన వ్యక్తిగత ఎదుగుదల కోసం తనకు అండగా నిలిచిన వ్యక్తిని విస్మరించడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. విజయ్-రష్మికల వివాహం ఒకవైపు కొత్త ప్రయాణానికి నాంది పలికితే, మరోవైపు పాత వివాదాలను మళ్ళీ తెరపైకి తెచ్చింది. కన్నడ ఇండస్ట్రీ, అక్కడి నెటిజన్లు ఈ పెళ్లిపై చేస్తున్న కామెంట్స్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి.
Also Read- Puri jagannadh: సూర్య పూరి జగన్నాథ్ కాంబోలో మిస్సైన సూపర్ హిట్ మూవీ.. మళ్ళీ ఇన్నాళ్ళకు?