E-Paper
Advertisement

Exclusive: శ్రీ విష్ణు మూవీ విష్ణు విన్యాసం విడుదల తేదీ ఖరారు.. రిలీజ్ ఎప్పుడంటే..?

Exclusive: శ్రీ విష్ణు మూవీ విష్ణు విన్యాసం విడుదల తేదీ ఖరారు.. రిలీజ్ ఎప్పుడంటే..?
Advertisement

Vishnu Vinyasam Release Date: కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ శ్రీ విష్ణు మరోసారి ప్రేక్షకులను నవ్వుల ప్రపంచంలోకి తీసుకెళ్లడానికి రెడీ అయ్యారు. ఆయన హీరోగా నటిస్తున్న తాజా సినిమా విష్ణు విన్యాసం. ఈ సినిమా రిలీజ్ డేట్‌ ప్రస్తుతం కన్ఫామ్ అయ్యింది. బిగ్ టీవీ కి అందిన ఎక్స్క్లూజివ్ న్యూస్ ప్రకారం.. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 27 విరుదల చేయాలి అని నిర్మాతలు ఫిక్స్ అయ్యారు. ఇక ఇదే విషయాన్ని మేకర్స్ ఈరోజు సాయంత్రం అధికారికంగా ప్రకటించనున్నారు. హ

డిఫరెంట్ కథలు, యూనిక్ పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రీ విష్ణు ఈసారి పూర్తిస్థాయి కామెడీ ఎంటర్‌టైనర్‌తో రాబోతున్నారు. కొత్త దర్శకుడు యదునాథ్ మారుతీ రావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘No Brakes – Just Laughs…’ అనే ఉపశీర్షిక ఉండటం విశేషం. పేరు చెప్పినట్టే ఈ సినిమా ఆగకుండా నవ్వించే వినోదంగా ఉండబోతోందని చిత్రబృందం చెబుతోంది.

Advertisement

ఈ చిత్రాన్ని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ పతాకంపై సుమంత్ నాయుడు జి నిర్మిస్తున్నారు. హేమ – షాలిని సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫిబ్రవరి 2026లో థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే సినిమా టాకీ పార్ట్ మొత్తం పూర్తయ్యిందని, ఇంకా రెండు పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉందని దర్శక నిర్మాతలు తెలిపారు.

ఈ సినిమాలో శ్రీ విష్ణు సరసన నయన్ సారిక కథానాయికగా నటిస్తున్నారు. వీరిద్దరి జోడీ ప్రేక్షకులకు కొత్తగా అనిపిస్తుందని యూనిట్ భావిస్తోంది. అలాగే ఈ చిత్రంలో సత్య, బ్రహ్మాజీ, ప్రవీణ్, మురళి శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, ‘సత్యం’ రాజేష్, శ్రీనివాస్ వడ్లమాని, గోపరాజు రమణ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Advertisement

సాంకేతికంగా కూడా ‘విష్ణు విన్యాసం’ బలంగా ఉంది. ఛాయాగ్రహణ బాధ్యతలను సాయి శ్రీరామ్ నిర్వహించగా, సంగీతాన్ని రధన్ అందిస్తున్నారు. పాటల సాహిత్యం రామజోగయ్య శాస్త్రి రాయగా, కళా దర్శకత్వం ఎ రామాంజనేయులు చేస్తున్నారు.

మొత్తానికి ఫిబ్రవరి 27న థియేటర్లలో నవ్వుల పండగ ఖాయం అని అభిమానులు అంటున్నారు. కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే హాస్యం, ఎంటర్‌టైన్‌మెంట్‌తో ‘విష్ణు విన్యాసం’ మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం చిత్రబృందంలో కనిపిస్తోంది.

ALSO READ: Sankranthi 2027 Releases: 2027 సంక్రాంతికి సిద్ధమైపోయిన సీనియర్ బ్యాచ్.. ఈసారి విజేత ఆ హీరోనేనా..?

Related News

Poojitha Ponnada : గార్జీయస్ లుక్ లో మెరిసిపోతున్న పూజిత.. కుర్రాళ్ళు ఏమైపోతారమ్మా..!

HBD Pawan Kalyan : బర్త్ డే స్పెషల్.. ఆ ఒక్కటే పవర్ స్టార్ ను చేసిందా..?

కృష్ణుడిగా రామ్ చరణ్.. సూపర్ హిట్ సినిమా రీమేక్ చేయనున్నారా?

టాక్సిక్ సినిమాకు రేటింగ్ మహేష్ బాబు కొడుకు గౌతమ్ రేటింగ్.. ఇంత రారుణమా?

మై లిటిల్ ప్యారడైజ్..కొడుకుతో క్యూట్ ఫోటోలను షేర్ చేసిన నాని..

యాంకర్ గా స్రవంతి ఉంటే సినిమా హిట్టే.. డైరెక్టర్ ప్రశంశలు..సుమ క్రేజ్ తగ్గిందా?

లెనిన్ హిట్.. మెగా హీరోతో ఛాన్స్ కొట్టేసిన భాగ్య శ్రీ?

మధ్యం మానేశాను.. హృదయ విదారకమైన బాధ అంటున్న కొండన్న!

Big Stories

Advertisement
×