England vs Nepal: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( ICC T20 World Cup 2026 tournament) నిన్న ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ నిన్న ప్రారంభం కాగా అరుదైన సంఘటనలు జరుగుతున్నాయి. నిన్న నెదర్లాండ్స్ పైన గెలిచేందుకు పాకిస్తాన్ అష్ట కష్టాలు పడింది. అటు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా జట్టు పైన గెలిచేందుకు టీమిండియా కూడా చాలా పోరాడాల్సి వచ్చింది. అయితే ఇవాళ ఈ టోర్నమెంట్ లో భాగంగా ఇంగ్లాండ్ వర్సెస్ నేపాల్ (England vs Nepal, 5th Match ) మధ్య ఐదవ మ్యాచ్ జరిగింది. అయితే ఇందులో అద్భుతంగా రాణించిన నేపాల్, ఇంగ్లాండ్ కు ముచ్చెమటలు పట్టించింది. క్రికెట్ కనిపెట్టిన ఇంగ్లాండ్ జట్టును చిత్తుచిత్తుగా ఓడించినంత పని చేసింది నేపాల్. కానీ చివరి బంతికి 6 పరుగులు ఉండగా, నేపాల్ ప్లేయర్ లోకేష్ సిక్సర్ కొట్టలేకపోయాడు. దీంతో ఇంగ్లాండ్ చేతిలో నేపాల్ పోరాడి ఓడింది. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ 184 పరుగులు సాధించగా ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 180 పరుగులు మాత్రమే సాధించింది నేపాల్. దీంతో ఇంగ్లాండ్ 4 పరుగుల తేడాతో విజయం సాధించింది.
టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ ఇంగ్లాండ్ వర్సెస్ నేపాల్ (England vs Nepal, 5th Match ) మధ్య ఐదవ మ్యాచ్ జరిగింది. ముంబైలోని వాoఖడే స్టేడియం వేదికగా ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో మొదట ఇంగ్లాండు బ్యాటింగ్ చేసింది. ఈ నేపథ్యంలోనే 20 ఓవర్లు ఆడింది ఇంగ్లీష్ జట్టు. ఈ తరుణంలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు సాధించింది ఇంగ్లాండు. ఇంగ్లాండ్ బ్యాటర్లలో జాకబ్ బెత్లె 55 పరుగులు సాధించగా బట్లర్ 26 పరుగులతో రాణించాడు. అటు ఇంగ్లాండ్ టి20 కెప్టెన్ బ్రూక్ 53 పరుగులతో దుమ్ము లేపాడు. చివరలో విల్ జాక్స్ 18 బంతుల్లో 39 పరుగులు సాధించడం ఇంగ్లాండుకు చాలా ప్లస్ అయింది. ఈ పరుగుల ఇంగ్లాండ్ ను గెలిపించాయి.
ఇంగ్లాండ్ విధించిన 185 పరుగుల లక్ష్యాన్ని చేదించే క్రమంలో నేపాల్ ( Nepal Team) పోరాడి ఓడింది. నిర్ణీత 20 ఓవర్లు ఆడిన నేపాల్ 6 వికెట్ల నష్టానికి 180 పరుగులు సాధించింది. నేపాల్ జట్టులో దీపేంద్ర సింగ్ 44 పరుగులు సాధించగా రోహిత్ 39 పరుగులతో రెచ్చిపోయాడు. చివరలో లోకేష్ 39 పరుగులతో టచ్ లోకి వచ్చాడు. కానీ ప్రెషర్ పెరగడంతో ఇంగ్లాండ్ పై పోరాడి ఓడింది నేపాల్. చివరి బంతికి సిక్సర్ కొట్టాల్సిన పరిస్థితిలో.. లోకేష్ చేతులెత్తేశాడు. దీంతో ఇంగ్లాండ్ నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది.
What a game! Nepal almost won it, but Sam Curran’s experienced bowling became the difference as England edged home by just 4 runs.🔥
PC: JioStar | #ENGvsNEP #T20WC2026 pic.twitter.com/JUeOAqhwOi
— OneCricket (@OneCricketApp) February 8, 2026