Sankranthi 2027 Releases: 2027 సంక్రాంతికి తెలుగు సినిమా అభిమానులకు మరోసారి పండగ వాతావరణం కనిపించబోతోంది. సీనియర్ హీరోల బ్యాచ్ మళ్లీ రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతోంది. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్… ఈ నలుగురు స్టార్లు ఒకే సంక్రాంతికి తమ సినిమాలతో ప్రేక్షకులను అల్లరించడానికి సిద్ధమవుతున్నారు.. అనే విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో జోరుగా సాగుతోంది. నిజంగా ఇది జరిగితే టాలీవుడ్‌కు ఇది ఒక అత్యంత భారీ పండుగ వాతావరణం తీసుకురావడం ఖాయం.
ప్రతి సంవత్సరం సంక్రాంతి అంటే పెద్ద సినిమాల సందడి తప్పనిసరి. కుటుంబ ప్రేక్షకులు ఎక్కువగా థియేటర్లకు వచ్చే సీజన్ కావడంతో స్టార్ హీరోలు ఈ టైమ్‌ను మిస్ కావాలనుకోరు. 2027 సంక్రాంతికీ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమాలకు ఈ పండుగ సీజన్ చాలా కలిసి వస్తుంది.
ఈసారి అందరి చూపు ఎక్కువగా వెంకటేష్ మీదే ఉంది. ఆయనతో సినిమా అంటే ఫ్యామిలీ ఆడియన్స్‌కు మంచి కనెక్ట్ ఉంటుంది. వెంకీ మామ.. సినిమాలకు అత్తా-మామ ఫ్యాన్స్ నుంచి పిల్లల వరకు అందరూ వస్తారు. అందుకే ఆయన సినిమా ఉంటే పండగ వాతావరణం డబుల్ అవుతుంది అనే నమ్మకం ఉంది. అంతేకాదు, ఈ ప్రాజెక్ట్‌ను దర్శకుడు అనిల్ రవిపూడి తెరకెక్కిస్తూ ఉండడంతో.. వచ్చే సంక్రాంతికి ఈ చిత్రమే తప్పకుండా విన్నర్ అవుతుంది అని ప్రేక్షకులు ఇప్పటినుంచి ఫిక్స్ అయిపోతున్నారు. సంక్రాంతి అంటే అనిల్ రవిపూడి, అనిల్ రవిపూడి అంటే సంక్రాంతి అన్నంతగా ఆయనకు ఈ సీజన్ కలిసి వస్తుంది. అందులో వెంకటేష్, అనిల్ రావిపూడి కలిసి చేసిన సినిమాలు అన్నీ కూడా బ్లాక్ బస్టర్ సినిమాలే. ఈ సంవత్సరం విడుదలైన మన శంకర్ వరప్రసాద్ సినిమా కూడా.. అనిల్ రావిపూడి దర్శకత్వం వల్ల.. వెంకటేష్ కామియో వల్లి అత్యంత కలెక్షన్స్ తెచ్చుకుంది అనే వాదన కూడా ఉంది. అందుకే వెంకటేష్ ఈసారి సంక్రాంతి విన్నర్ అవ్వడం ఖాయం అన్న మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.
ఇక మెగాస్టార్ చిరంజీవి సినిమా కూడా సంక్రాంతి రేసులో ఉండే అవకాశం ఉందని చర్చ. ఆయన సినిమా వస్తే మాస్ ఆడియన్స్‌లో క్రేజ్ వేరే లెవెల్‌లో ఉంటుంది. గతంలోనూ సంక్రాంతికి చిరంజీవి సినిమాలు మంచి విజయం సాధించిన సందర్భాలు ఉన్నాయి. ఈ సంవత్సరం కూడా మన శంకర్ వరప్రసాద్ గారు చిత్రంతో మరో సూపర్ హిట్ అందుకున్నారు. మరి వచ్చే సంవత్సరం కూడా చిరంజీవి ఇదే రిపీట్ చేస్తారా లేదా చూడాలి.
మరోవైపు బాలకృష్ణ కూడా సంక్రాంతి బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. బాలయ్య సినిమా అంటే ఫ్యాన్స్‌కు పండగే. పవర్‌ఫుల్ డైలాగ్స్, మాస్ సీన్స్‌తో ఆయన సినిమా థియేటర్లను ఊపేస్తుందని అభిమానులు నమ్ముతున్నారు.
ఇక నాగార్జున విషయానికి వస్తే, ఆయన ప్రస్తుతం ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో తన వందవ సినిమా ఏకంగా ముగ్గురు హీరోలతో వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నాను అని అఫీషియల్ అనౌన్స్మెంట్ ఈరోజు ఇచ్చేశారు. దీంతో సంక్రాంతి పోటీ మరింత గట్టిగా మారింది.
మొత్తానికి 2027 సంక్రాంతి టాలీవుడ్‌కు “ఓల్డ్ బ్యాచ్ రీయూనియన్”లా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. నలుగురు సీనియర్ హీరోలు ఒకే సీజన్‌లో వస్తే ఎవరు విజేత అవుతారు అన్నది ఆసక్తికరమైన ప్రశ్న. కానీ ఒక విషయం మాత్రం నిజం… ప్రేక్షకులకు మాత్రం ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారంటీ.
ALSO READ: Yellamma: ఎల్లమ్మ సినిమాలో దేవిశ్రీప్రసాద్ కి తండ్రిగా స్టార్ నటుడు.. డైరెక్టర్ మాస్టర్ ప్లాన్..!