E-Paper
Advertisement

మా హీరో గొప్పంటే మా హీరో గొప్ప.. ఫ్యాన్ వార్స్‌పై విశ్వక్ సేన్ ఫైర్

మా హీరో గొప్పంటే మా హీరో గొప్ప.. ఫ్యాన్ వార్స్‌పై విశ్వక్ సేన్ ఫైర్
Advertisement

Vishwak Sen:సోషల్ మీడియాలో హీరోల ఫ్యాన్స్ మధ్య జరిగే గొడవల గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ .తమ హీరో గొప్ప అంటే తమ హీరో గొప్ప అంటూ అభిమానులు చేసే రచ్చ ఇప్పటిది కాదని, గతంలో కూడా ఇలాంటి గొడవలు ఉండేవని ఆయన గుర్తు చేశారు.

అయితే అప్పట్లో ఆ గొడవలు ఒక ప్రాంతానికే పరిమితమయ్యేవని, ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని ప్రపంచమంతా కనిపిస్తున్నాయని చెప్పారు. అంతేకాదు, సోషల్ మీడియాలో ఎవరికి నచ్చినట్లు వాళ్లు మాట్లాడటం, నటీనటులపై ఇష్టమొచ్చిన కామెంట్స్ చేయడం మంచిది కాదని తన అభిప్రాయాన్ని చెప్పారు .ముఖ్యంగా ఇతరుల గురించి మాట్లాడేటప్పుడు వాడే భాషకు ఒక హద్దు ఉండాలని సలహా ఇచ్చారు.

Advertisement

సినిమాల విషయానికి వస్తే ప్రతి హీరో తన సినిమా హిట్ అవుతుందనే నమ్మకంతోనే పనిచేస్తాడని, తన సినిమాలకు కూడా మొదటి నుంచి అలాంటి నమ్మకమే ఉంటుందని చెప్పారు. తన సినిమా టైటిల్‌గా ‘కల్ట్’ అనే పేరును ఎంచుకోవడం వెనుక కూడా ఇదే ఆలోచన ఉందని వివరించారు.

గతంలో తన సినిమాకు ‘హిట్’ అనే పేరు పెట్టినప్పుడు, ఇప్పుడు ‘కల్ట్’ అని ఎందుకు పెట్టకూడదని అనిపించిందని తెలిపారు. చాలారోజులు రకరకాల పేర్లు అనుకున్న తర్వాత ఒకరోజు ఉదయం ఈ టైటిల్ పెట్టాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. అప్పటికి ఆ పేరు అందుబాటులో ఉండటంతో వెంటనే రిజిస్ట్రేషన్ చేయించుకున్నానని చెప్పుకొచ్చారు.

Advertisement

తనకు తెలిసినంత వరకు, ఆ తర్వాత మరో సినిమా యూనిట్ కూడా ‘కల్ట్’ అనే టైటిల్‌పై ఆసక్తి చూపించిందని కానీ అప్పటికే ఆ పేరు తన దగ్గర ఉండటంతో వాళ్లు వేరే టైటిల్ పెట్టుకున్నారని తెలిపారు.

ఇక తన కెరీర్ గురించి మాట్లాడుతూ, తనకు ఏదీ అంత ఈజీగా దొరకదని మొదటి రోజు నుంచి ఏదో ఒక పోరాటం ఉంటూనే ఉంటుందని చెప్పారు. కొన్నిసార్లు మన వల్ల సమస్యలు వస్తే, మరికొన్నిసార్లు ఎదుటివాళ్ల నుంచి ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు. అందరిలా సాఫీగా వెళ్లే దారిని ఎంచుకుంటే పెద్దగా గొడవలు ఉండకపోవచ్చని, కానీ తాను సెలెక్ట్ చేసే కథలు, చేసే ప్రయోగాలు తనను మరో దారిలోకి తీసుకెళ్తాయని చెప్పారు.

కొత్తగా ఏదైనా చేయాలనే ఉద్దేశంతో సినిమాలు చేసినప్పుడు కొన్నిసార్లు ఫలితం తేడా కొట్టొచ్చని విశ్వక్ సేన్ అంగీకరించారు. ఒక దర్శకుడిని నమ్మి, ఆ సినిమా కోసం ఎంత కష్టపడినా, ఫలితం అనుకున్నట్టుగా రాకపోతే విమర్శలు తప్పవని అన్నారు. అయితే తనకు తనపై నమ్మకం ఎక్కువగా ఉంటుందని, ఆ కాన్ఫిడెన్స్ తన మాటల్లో కూడా కనిపిస్తుందని చెప్పారు. తాను మాట్లాడే మాటలు కొన్నిసార్లు గన్‌షాట్స్‌లా ఉంటాయని, వాటిని అందరూ ఒకేలా తీసుకోలేరని చెప్పుకొచ్చారు.

అసలు ఫ్యాన్ వార్స్ విషయానికి వస్తే గతంలో హీరోల అభిమానులు చెట్ల కింద, రచ్చబండల దగ్గర కూర్చొని తమ హీరో గొప్ప అంటే తమ హీరో గొప్ప అంటూ వాదించుకునేవారని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు సోషల్ మీడియా రావడంతో అదే గొడవ పెద్దదైపోయిందని చెప్పారు. ఒకప్పుడు ఒక ఊరిలో జరిగిన గొడవ అక్కడితో అయిపోయేదని, ఇప్పుడు ఒక పోస్టు లేదా వీడియో వల్ల ఆ గొడవ అందరికీ తెలిసిపోతోందని వివరించారు.

టెక్నాలజీ రోజురోజుకూ పెరుగుతోందని, దాన్ని ఎలా ఉపయోగిస్తున్నామనేదే ముఖ్యమని విశ్వక్ సేన్ అన్నారు. సోషల్ మీడియాను మంచి విషయాల కోసం ఉపయోగిస్తే ఎంతో మందికి ఉపయోగపడుతుందని, దానినే ఇతరులను తిట్టడానికి, ఉపయోగిస్తే సమస్యలు వస్తాయని చెప్పుకొచ్చారు.

మొత్తానికి విశ్వక్ సేన్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్‌పై మరోసారి చర్చకు దారితీస్తున్నాయి .చూడాలి వీటిపై ఎలాంటి కౌంటర్లు కురుస్తాయో !

also read:నాన్న పరిచయం చేసిన అబ్బాయినే ప్రేమించా.. కానీ పెళ్లికి ఒప్పుకోలేదు!

Tags

Related News

వియత్నాం ట్రిప్ ఫొటోలతో కుర్రాళ్లను ఫిదా చేస్తున్న మినాక్షి

నాన్న పరిచయం చేసిన అబ్బాయినే ప్రేమించా.. కానీ పెళ్లికి ఒప్పుకోలేదు!

అబ్బా.. చీరలో రుక్మిణి వసంత్ లుక్ మామూలుగా లేదుగా!

రణబాలి డైరెక్టర్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

రజినీకాంత్‌తో ‘జైలర్’ తీసిన నెల్సన్.. ఒకప్పుడు ఏం చేసేవారో తెలుసా?

‘మంగళవారం’లో పులిరాజు పాత్ర వెనుక ఇంత కథ ఉందా?

రింగ్ దొరకక ప్రపోజ్ చేయలేదు.. ఆ మూమెంట్ మిస్సయిన రష్మిక: విజయ్ దేవరకొండ

Big Stories

Advertisement
×