Vishwak Sen Cult:విశ్వక్ సేన్..వెళ్ళిపోమాకే సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ కుర్ర హీరో తాజాగా కల్ట్ అనే సినిమాతో మరోసారి ఆడియన్స్ ని అలరించేందుకు రెడీ అయిపోయాడు. ఇక ఈ సినిమా అక్టోబర్ ౩౦న రానున్న సందర్భంగా ప్రమోషన్స్ లో వేగం పెంచాడు. ఇందులో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు .
కొత్తగా ట్రై చేయాలనిపించింది.. అందుకే ‘కల్ట్’ చేశా!
విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. ఇంతకుముందు కొన్ని కమర్షియల్ సినిమాలు చేసి ప్రేక్షకులకు నచ్చుతాయేమోనని ప్రయత్నించానని, కానీ తన దగ్గర ఉన్న ఆలోచనతోనే ఒక పెద్ద సినిమా చేయాలనిపించిందని చెప్పారు. తన జీవితంలోనే బిగ్గెస్ట్ ఎక్స్పెరిమెంట్ ‘కల్ట్’ అని, అదే తనకు బిగ్గెస్ట్ కమర్షియల్ సినిమా కూడా అవుతుందని నమ్మినట్లు తెలిపారు.
హాలీవుడ్లో ఫేమస్.. ఇప్పుడు తెలుగులో
‘కల్ట్’ సినిమా స్లాషర్ జానర్ లో వస్తుందని, హాలీవుడ్లో బాగా కనిపిస్తుంటాయి కానీ మన దగ్గర ఈ జానర్లో పూర్తిస్థాయిలో సినిమా చేయడం చాలా రేర్ అని, అలాంటి కథను ఎంచుకోవడమే ఒక రిస్క్ అయితే, దానికి డార్క్ కామెడీని కూడా జోడించడం మరో రిస్క్ అని తెలిపాడు.అయితే తాను స్లాషర్ సినిమాలకు పెద్ద అభిమానినని ఇలాంటి సినిమాల్లో బ్లడ్ బాత్ సీన్స్ ఉన్నప్పటికీ, కొన్ని సందర్భాల్లో ప్రేక్షకులకు నవ్వు కూడా వస్తుందని, అలాంటి ట్రీట్మెంట్ తనకు నచ్చుతుందని తెలిపారు.
అయితే అలాంటి సన్నివేశాలను తెరపై సరిగ్గా చూపించడం అంత ఈజీ కాదు. ఎక్కడ ప్రేక్షకులు భయపడాలి? ఎక్కడ నవ్వాలి? ఎక్కడ ఉత్కంఠ పెరగాలి? ఈ మూడింటినీ సరిగ్గా బ్యాలెన్స్ చేయాలని, ఎక్కడ తేడా వచ్చినా అంతే అని అందుకే ఈ సినిమాను ఎంటర్టైనింగ్గా చూపించాలనే ఉద్దేశంతోనే తెరకెక్కించినట్లు విశ్వక్ సేన్ వివరించారు.
ట్రైలర్‌కు వచ్చిన రెస్పాన్స్ చూసి ఫుల్ ఖుషీ!
‘కల్ట్’ ట్రైలర్ విడుదలైన తర్వాత మంచి స్పందన రావడం విశ్వక్ సేన్‌కు సంతోషాన్ని ఇచ్చిందని, తన కెరీర్లో ఇంతకుముందు కూడా కొన్ని ట్రైలర్లు ట్రెండింగ్‌లో నిలిచాయని, కానీ ఈ సినిమా ట్రైలర్‌కు వచ్చిన స్పందన మాత్రం అదిరిపోయిందని చెప్పారు.
నిజానికి ఈ సినిమా గురించి బయటకు చెప్పినప్పుడు కొందరికి వింతగా అనిపించే అవకాశం ఉందని ,కథలో పోలీస్, పార్టీ, గేమ్, హింస లాంటి అంశాల గురించి విడివిడిగా చెబితే అసలు సినిమా ఎలా ఉంటుందో అర్థం కాకపోవచ్చు. కానీ వాటన్నింటినీ కలిపి ట్రైలర్లో చూపించినప్పుడు ప్రేక్షకులకు ఒక క్లారిటీ వచ్చిందని విశ్వక్ సేన్ తన అభిప్రాయాన్ని బయటపెట్టాడు.
విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గలే
కొత్తగా ఏదైనా ప్రయత్నిస్తే విమర్శలు రావడం సహజం. సినిమా పరిశ్రమలోనూ ఇలాంటి మాటలు చాలానే వినిపిస్తుంటాయి. “ఇదెందుకు చేస్తున్నావ్?”, “ఇలాంటి సినిమా ఎందుకు?” అంటూ ప్రశ్నించేవాళ్లు ఉంటారు. విశ్వక్ సేన్ కూడా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నట్లు చెప్పారు.
అయితే ఒక ప్రయోగం చేయాలని నిర్ణయించుకున్నాక, దాని ఫలితం ఎలా ఉన్నా బాధ్యత తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. సినిమా హిట్ అయితే క్రెడిట్ తీసుకోవాలి.. అదే ఫెయిల్ అయితే తప్పును కూడా ఒప్పుకోవాలి. ముందుగా మన తప్పును మనం అంగీకరిస్తే, సమస్యకు సమాధానం వెతకడం సులభమవుతుందని చెప్పారు.
150 మంది నటీనటులు.. షూటింగ్లో పెద్ద సవాలు!
‘కల్ట్’ కోసం చాలా కష్టపడ్డానని ఈ సినిమాలో దాదాపు 150 మంది ప్రొఫెషనల్ యాక్టర్స్ తో పనిచేసినట్లు చెప్పారు. వాళ్లను కేవలం జూనియర్ ఆర్టిస్టులుగా చూడకూడదని, ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు, పారితోషికం ఇవ్వాల్సిందేనని వివరించారు.
ఇక షూటింగ్ మొదలైనప్పుడు కొందరు నటీనటులు ఈ ప్రాజెక్ట్ నుంచి వెళ్లిపోవాలని అనుకున్నారట. అప్పుడు అందరినీ ఒకచోట కూర్చోబెట్టి, తాను చేయాలనుకుంటున్న సినిమా గురించి వివరించానని విశ్వక్ సేన్ చెప్పారు. తన ఆలోచన అర్థం చేసుకున్న తర్వాత వాళ్లంతా తనకు మద్దతుగా నిలిచారని, ఒక్కరు కూడా వెళ్లిపోలేదని తెలిపారు.
నాలుగున్నర నిమిషాల సింగిల్ షాట్.. 400 మందికి పైగా!
ఈ సినిమా షూటింగ్ గురించి మాట్లాడుతూ సుమారు నాలుగున్నర నిమిషాల పాటు సాగే ఒక సింగిల్ షాట్లో 400 మందికి పైగా పాల్గొన్నారని ,ఇలాంటి సీన్ తీయాలంటే చాలా ప్లానింగ్ ఉండాలని అందరూ సరిగ్గా చేయడంతో బాగా కుదిరిందని తెలిపాడు.
అనుకున్న బడ్జెట్ కంటే డబుల్
‘కల్ట్’ సినిమా కోసం పెట్టిన బడ్జెట్ కూడా అనుకున్నదానికంటే పెరిగిపోయిందని విశ్వక్ సేన్ చెప్పారు. మొదట అనుకున్న ఖర్చు చివరకు దాదాపు డబల్ అయిందని తెలిపారు. చూడాలి మరి భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమా విశ్వక్ కి ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో !
ALSO READ :ఈశ్వర్ సాయి ఈజ్ బ్యాక్.. మళ్లీ పాత జోష్ వచ్చేసినట్టేనా ?