Eshwar Sai New Folk Song:బాసింగ బలాలు అంటూ ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చేసాడు ఈశ్వర్ సాయి.ఇక కెరీర్ లో దూసుకు పోతాడు అన్న టైమ్ లో రెడ్డి భవన్ లో మాధురి రాథోడ్ తో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడటంతో కెరీర్ కాస్త స్లో అయిన పరిస్థితి.అయితే అవన్నీ గతం అంటూ ప్రస్తుతం కెరీర్ పై ఫోకస్ పెంచిన ఈశ్వర్ సాయి ఒక వైపు సినిమాలతో బిజీ అవుతూనే మరోవైపు ఫోక్ సాంగ్స్ లతోనూ కమ్ బ్యాక్ ఇచ్చేందుకు రెడీ అయిపోయాడు.
బాయిల్ల బచ్చలి కూర’ అనే మరో ఇంట్రెస్టింగ్ ఫోక్ సాంగ్
ఈ క్రమంలోనే మోహబ్బత్ అనే సినిమాలో హీరో ఫ్రెండ్ గా చేస్తున్న ఈశ్వర్ సాయి ఇపుడు ‘బాయిల్ల బచ్చలి కూర’ అనే మరో ఇంట్రెస్టింగ్ ఫోక్ సాంగ్ తో ఫోక్ లవర్స్ ని పలకరించేందుకు రెడీ అయిపోయాడు. మధురి రాజేంద్రప్రసాద్ నిర్మాణంలో అడ్డుల జంగిరెడ్డి,ప్రభ బంగారి గల్ల పాడిన ఈ పాటకి మానుకోట లిరిక్స్ అందించగా ఫోక్ సాంగ్స్ ని తనదైన మ్యూజిక్ తో ఏలుతున్న కళ్యాన్ కీసే ఈ పాటకి కూడా మ్యూజిక్ అందించడం విశేషం.ఇక పాటకి హరీష్ పటేల్ సినిమాటో గ్రఫీ ,రంగు అజయ్ ఎడిటింగ్, రాజేష్ పైండ్ల పాటకి కొరియోగ్రఫీ అందించారు.ఇక ఈజాగా రిలీజ్ అయిన ఈ పాటకి అప్పుడే మంచి వ్యూస్ దక్కుతుండటంతో పాటు ఈశ్వర్ సాయి ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్స్ వదులుతున్నారు ఫోక్ లవర్స్.
నాలుగు నెలల్లోనే ఏకంగా 22 కోట్ల కి పైగా వ్యూస్
ఈశ్వర్ సాయి ఫోక్ సాంగ్స్ విషయానికి వస్తే అందాల మైనా (Andala Maina) — రబ్బరి గాజులు (Rabbari Gajulu) —ప్రమీల ఓ ప్రమీల (Pramila) అది అబ్బబ్బాగా పోరి (Adi Abbabbaga Pori) లయి లయి లబ్బరి బొమ్మ (Layi Layi Labbari Bomma) బాసింగా బలాలే (Basinga Balaalu) కళ్లకు కాటుక దిద్దినారో (Kallaku Katuka Diddinaro) అంటూ ఎన్నో పాటలతో ఫోక్ లవర్స్ ని అలరించిన సంగతి తెల్సిందే.వీటిలో మరీ ముఖ్యంగా బాసింగ బలాలు అనే పాట ఫోక్ ఇండస్టీని ఎలా షేక్ చేసిందో చెప్పక్కర్లేదు.ఇప్పటి ఈ పాట కేవలం నాలుగు నెలల్లోనే ఏకంగా 22 కోట్ల కి పైగా వ్యూస్ కొల్లగొట్టిందంటే ఆడియన్స్ ని ఎలా మెస్మరైజ్ చేసిందో అర్థం అవుతుంది.
వరుస ఫోక్ సాంగ్స్ తో బిజీ
మరో వైపు ఈశ్వర్ సాయితో పాటు పట్టుబడిన మాధురి రాథోడ్ కూడా ఇపుడు ఆ బ్యాడ్ ఫేజ్ మర్చిపోయేందుకు వరుస ఫోక్ సాంగ్స్ తో బిజీ అయిపొయింది.ఈ క్రమంలోనే చేసిన ‘భామ సుందరాలో’అనే పాట కేవలం 4 రోజుల్లోనే ఏకంగా 6.2మిలియన్ల వ్యూస్ కొల్లగొట్టడంతో మళ్ళీ సాలిడ్ కమ్ బ్యాక్ ఇచ్చినట్టే కనిపిస్తుంది.ఇక పది రోజుల కిందటే రిలీజ్ అయిన గాజులోల్ల పోరడ అనే పాట ఏకంగా 2 మిలియన్ల వ్యూస్ ని క్రాస్ చేసి దూసుకుపోవడం ఇక్కడ మరో విశేషం.
ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో !
మొత్తానికి ఒక బ్యాడ్ ఫేజ్ లో ఉన్న ఈ ఇద్దరు ఇపుడు వాటిని దాటుకుని మళ్ళీ తమవైన పాటలతో ఆడియన్స్ ని అలరించేందుకు వస్తున్న ఈ ఇద్దరు ఫోక్ డాన్సర్ ని నిజంగా మెచ్చుకుని తీరాల్సిందే. చూడాలి మరి ‘బాయిల్ల బచ్చలి కూర’ అంటూ మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చిన ఈశ్వర్ సాయి ఈ ఫోక్ సాంగ్ తో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో !