ViswakSen : టాలీవుడ్ యంగ్ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఒక్కో సినిమాతో తన టాలెంట్ నిరూపించుకుంటూ మాస్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు.. ఫలక్ నుమా దాస్, దాస్ కా ధమ్కీ తర్వాత కల్ట్ తో మెగా ఫోన్ పట్టుకున్నాడు. కథ స్క్రీన్ ప్లే కూడా సమకూర్చుకుని మాటలు మాత్రం తరుణ్ భాస్కర్ కి ఇవ్వడం విశేషం.. ఈ మూవీ కోసం విశ్వక్ ప్రత్యేకంగా ప్రమోషన్స్ చేయడం విశేషం.. తాజాగా కల్ట్ మూవీ నుంచి టీజర్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే.. ఆ టీజర్ వీడియోకు జనాల నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది.. సోషల్ మీడియాలో ఈ టీజర్ వీడియో ప్రస్తుతం ట్రెండ్ అవుతుంది.. అయితే టీజర్ లాంచ్ ఈవెంట్లో మ్యూజిక్ డైరెక్టర్ కు విశ్వక్ గిఫ్ట్ ఇచ్చిన విషయం తెలిసిందే. గిఫ్ట్ కాస్ట్ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి. మరి ఆ ఖరీదైన గిఫ్టు ధర ఎంత ఉంటుందో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం…
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ రీసెంట్ గా ఫంకీ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఆ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా రెస్పాన్స్ ని తగ్గించుకోలేకపోయింది.. యావరేజ్ టాక్ ని సొంతం చేసుకోవడంతో ఈ సినిమా ఫ్యాన్స్ కి నిరాశనే మిగిలింది.. ప్రస్తుతం ఆయన కల్ట్మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. ’టైగర్ నాగేశ్వరరావు’ బ్యూటీ గాయత్రీ భరద్వాజ్ కూడా ఈ సినిమాలో అత్యంత కీలక పాత్ర పోషిస్తోంది.. కానీ పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే.. ఈ చిత్రం నుంచి రీసెంట్గా టీజర్ రిలీజ్ అయ్యింది.. టీజర్ లాంచ్ ఈవెంట్ కార్యక్రమంలో విశ్వక్ స్పీచ్ అందరిని ఆకట్టుకుంది. అంతేకాదు ఆ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ కు ఖరీదైన రోలెక్స్ గోల్డ్ వాచ్ ని గిఫ్ట్ గా ఇచ్చాడు.. ఆ వాచ్ ఖరీదు దాదాపు 35 లక్షల వరకు ఉంటుందని సమాచారం. ఒక మ్యూజిక్ డైరెక్టర్ కి అంత ఖరీదైన గిఫ్ట్ ఇవ్వడం పై నెటిజెన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.. ఈవెంట్ వీడియో వైరల్ అవ్వడంతో విశ్వక్ మరోసారి వార్తల్లో నిలిచాడు..
Also Read :సాయి పల్లవి అరుదైన రికార్డ్.. ఏకంగా 7 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు..
హీరో విశ్వక్ కల్ట్ మూవీ లుక్కుతోని యాక్షన్ విధ్వంసాన్ని సృష్టించాడు.. ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన లుక్కు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. తాజాగా టీజర్ ని రిలీజ్ చేశారు. గోవా బ్యాక్ డ్రాప్ కథని సిద్ధం చేశారు. ఇదొక పార్టీ థ్రిల్లర్. కల్ట్ అనే పార్టీలోకి పాసులతో ఎంట్రీ ఇచ్చిన జనం.. అయితే ఆ జనం మొత్తం డెడ్లీ గేమ్ లోకి వెళ్ళాల్సి వస్తోంది. తర్వాత జరిగిన పరిణామాలు యమడేంజర్ గా వుంటాయి. స్క్విడ్ గేమ్ ఛాయల్లో నడిచిన కల్ట్ పార్టీ ఇది. భారీ యాక్షన్స్ సన్నివేశాలలో ఈ మూవీ టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. ఇందులో వైలెన్స్ ఎక్కువగా ఉందన్న టాక్ కూడా వినిపిస్తుంది.. టీజర్ తోనే విశ్వక్ గూస్ బంప్స్ తెప్పించాడు. మరి సినిమాలో ఇంకేలాంటి వైలెన్స్ ఉండబోతుందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.. ప్రస్తుతం ఈ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది అయితే ఈ మూవీ అయినా కూడా విశ్వక్ ఖాతాలో హిట్ పడేలా చేస్తూనేమో చూడాలి…