E-Paper
Advertisement

Summer Destinations: తెలుగు రాష్ట్రాల్లో.. వేసవి విహారానికి సిద్ధమా? అయితే ఈ ప్రాంతాలు చుట్టేయండి!

Summer Destinations: తెలుగు రాష్ట్రాల్లో.. వేసవి విహారానికి సిద్ధమా? అయితే ఈ ప్రాంతాలు చుట్టేయండి!
Advertisement

Summer Destinations: మండు వేసవిలో చల్లటి ప్రదేశాలు అనగానే ఏపీ, తెలంగాణలోనూ పలు ప్రదేశాలు గుర్తుకు వస్తాయి. అలాంటి వాటిలో కొన్ని ఏపీలోని హార్సిలీ హిల్స్, లంబసింగి, అరకులోయలు. పచ్చని కొండ కోనల మధ్య, మేఘాలతో దోబూచులాడుతున్నట్లుగా ఇక్కడి వాతావరణం ఉంటుంది. అందుకే ఈ ప్రాంతాన్ని ఆంధ్రా కశ్మీర్‌గా అభివర్ణిస్తుంటారు. తెలంగాణకు వస్తే అనంతగిరి హిల్స్‌ చాలా ప్రధానమైనది.

ఏపీలోని చిత్తూరు జిల్లాలో ఉన్న ప్రముఖ టూరిస్ట్ స్పాట్ హార్సిలీ హిల్స్. సముద్ర మట్టానికి 12 వందల 90 మీటర్ల ఎత్తులో ఉంటుందీ ప్రదేశం. చల్లటి వాతావరణం, పచ్చని దట్టమైన అడవులు, గాలి బండ, ఇతర వ్యూపాయింట్లు, సాహసకృత్యాల కోసం ట్రెక్కింగ్, రాపెల్లింగ్, జోర్బింగ్, స్విమ్మింగ్ లాంటి స్పాట్లు చాలానే కన్పిస్తాయి.

Advertisement

లంబసింగి చుట్టుపక్కల ఉండే పాడేరుకు వెళ్లారంటే వంజంగి కొండలు అద్భుతంగా కన్పిస్తాయి. సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో ఇక్కడి అందాలను చూసి తరించాల్సిందే తప్ప వర్ణించడానికి మాటలు చాలవంటే అతిశయోక్తి కాదు.

తెలంగాణలో ఉన్న ప్రముఖ వేసవి విడిది కేంద్రం అనంతగిరి. హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న ఈ టూరిస్ట్ స్పాట్ వేసవిలోనూ ఎంతో చల్లగా ఉంటుంది. దట్టమైన అడవులతోపాటు ప్రకృతి అందాలకు కేరాఫ్ అనంతగిరి హిల్స్. మండు వేసవిలో ఇక్కడ పారే జలపాతాల్లో సేద తీరేందుకు హైదరాబాద్‌ నుంచే కాదు.. తెలంగాణ వ్యాప్తంగా సందర్శకులు పెద్ద ఎత్తున వస్తుంటారు.

Advertisement

కర్ణాటకలోనూ కూర్గ్ సుప్రసిద్ధమైన వేసవి పర్యాటక కేంద్రంగా నిలుస్తోంది. పచ్చటి ప్రకృతి అందాలు, కాఫీ తోటలు, ఇతర సుగంధ ద్రవ్యాల తోటలు మన చూపుల్ని తిప్పుకోనివ్వకుండా చేస్తాయి. అందుకే ప్రతి ఏటా వేలాదిగా టూరిస్టులు కూర్గ్‌లో పర్యటిస్తారు. ఇంకో ముఖ్యమైన విషయం ఇక్కడి కాఫీ రుచిని ఆస్వాదించాలే కాని వర్ణించనలవి ఏ మాత్రం కాదు.

కూర్గ్‌ టూర్‌లో చూడాల్సిన ప్రదేశాల్లో ప్రధానమైనది తడియాండమోల్ శిఖరం. సముద్రమట్టానికి 5 వేల 700 అడుగుల ఎత్తులో ఉన్న ఈ శిఖరం పర్వాతారోహకులకు ఫేవరెట్ స్పాట్. ఇదే కాదు.. కుమార పర్వత కొండ సైతం ఇదే మాదిరి అనుభూతిని మీకు పంచుతుంది. క్యాంపింగ్‌కు సైతం ఇది ఫేమస్ ప్లేస్.

మడికేరికోట చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. ఎందరో పాలకులు, రాజవంశాల జీవితాల ఉత్థానపతనాలను ఇది చూసింది. 17వ శతాబ్దం రెండవ భాగంలో ముద్దురాజా స్థాపించిన ఈ కట్టడం మట్టితో, గ్రానైట్‌తో రూపుదిద్దుకుంది. నాటి రాచరిక ఆనవాళ్లు ఇప్పటికీ స్పష్టంగా కన్పిస్తూ కనువిందు చేస్తుంది ఈ మడికేరి కోట.

కూర్గ్‌ టూర్‌లో మనకు కన్పించే వాటిలో అత్యంత ముఖ్యమైనవి అబ్బే జలపాతం, ఇరుప్పు జలపాతం. 70 అడుగుల నుంచి అబ్బే జలపాతం దూకుతూ పరవళ్లు తొక్కుతుంటే ఆ అందాలు చూసి వారెవ్వా అనాల్సిందే ఎవరైనా. ఇదే మాదిరిగా ఇరుప్పు జలపాతం సైతం చూసే వాళ్లను మంత్ర ముగ్ధుల్ని చేస్తుంది.

Also Read: Kerala Tourism: దేవభూమి అందాలు.. మున్నార్, వయనాడ్, అలప్పుజ.. సమ్మర్‌లో తప్పక చూడాల్సిందే!

నందిహిల్స్‌ ఓ సుప్రసిద్ధమైన హిల్ స్టేషన్. ఇది సముద్ర మట్టానికి 14 వందల 70 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ ప్రాంతం నుంచి ఉదయించే సూర్యుడిని చూడడం మర్చిపోలేని అనుభూతి. చల్లటి వాతావరణం, టిప్పు డ్రాప్, పురాతన నంది ఆలయం, పారాగ్లైడింగ్ సహా పలు ఇతర క్రీడలకు నందిహిల్స్ ఓ చక్కటి కేరాఫ్ అడ్రస్.

Also Read: T20 World Cup 2026 Super 8: శ్రీలంక‌లో కుండ‌పోత‌..గ్రూప్ 2 మ్యాచ్ లు అన్ని ర‌ద్దు..పాకిస్తాన్ కు నో ఛాన్స్‌, సెమీ ఫైన‌ల్ కు వెళ్లేది ఎవ‌రంటే ?

Related News

ఈ తప్పులు చేస్తే తిరుమలలో రూమ్ దొరకదు.. టీటీడీ కొత్త గైడ్‌లైన్స్ ఇవే!

చివరి నిమిషంలోనూ కన్ఫర్మ్ సీట్.. రైల్వేలో సీక్రెట్ రూల్ గురించి తెలుసా?

12 రోజుల ఆధ్యాత్మిక యాత్ర.. అదీ EMIలో.. IRCTC ప్యాకేజ్ అదిరింది భయ్యా!

నల్లగొండ జిల్లాలో దాగిన ఉన్న అద్భుతాలు.. ఒక్కో చోట ఒక్కో విశేషం!

దుబాయ్ 5 ఏళ్ల మల్టిపుల్ ఎంట్రీ విజిట్ వీసా.. తక్కువ ధరలోనే.. భారతీయులకు అర్హత వివరాలు

హోటళ్లలో చెక్ ఇన్.. చెక్ అవుట్ ఆ సమయాల్లో ఎందుకు? దీని వెనుక అసలు కారణాలివే?

తాజ్ మహల్ కింద ఉన్న ఆ 22 గదులను ఎందుకు తెరవరు? నిజంగానే అక్కడ నిధులు, విగ్రహాలు ఉన్నాయా?

మాన్సూన్ రోడ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ క్రేజీ రివర్‌ సైడ్ స్పాట్స్ అస్సలు మిస్ అవ్వకండి!

Big Stories

Advertisement
×