E-Paper
Advertisement

Vishwak Sen Cult: 45 నిమిషాలు హీరో కనిపించడు.. విశ్వక్ సేన్ ‘కల్ట్’లో షాకింగ్ ట్విస్ట్!

Vishwak Sen Cult: 45 నిమిషాలు హీరో కనిపించడు.. విశ్వక్ సేన్ ‘కల్ట్’లో షాకింగ్ ట్విస్ట్!
Advertisement

Vishwak Sen Cult : తెలుగు సినిమాల్లో మరో సంచలన ప్రయోగానికి సిద్ధమవుతున్నారు విశ్వక్ సేన్. ఆయన హీరోగా నటిస్తూ..దర్శకత్వం వహిస్తున్న తాజా సినిమా కల్ట్ ఇప్పటికే షాకింగ్ అంశాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా విడుదలైన గ్లింప్స్‌తో పాటు ఆయన చేసిన వ్యాఖ్యలు ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.

కథేమిటంటే..!

కల్ట్ కథ ఒక భయంకరమైన ఆట చుట్టూ తిరుగుతుంది. ఒక పార్టీ హోస్ట్ చాలా హుషారుగా పార్టీని ఏర్పాటు చేస్తాడు. మొదట అంతా సరదాగా కనిపించినా, క్రమంగా ఆ పార్టీ భయానకంగా మారుతుంది. అక్కడ ఉన్న అతిథులు ఒక్కొక్కరిగా చనిపోతూ ఉంటారు. బయటకు తప్పించుకునే మార్గం ఉండదు. బతకడమే ఒకే ఒక నిబంధనగా మారుతుంది.

Advertisement

ఈ గందరగోళ పరిస్థితుల్లో “గేమ్ మాస్టర్” అనే రహస్య వ్యక్తి కథలోకి వస్తాడు. అతను నిజంగా అందరిని కాపాడటానికి వచ్చాడా? లేక మరింత పెద్ద ప్రమాదమా? అనే సందేహమే సినిమాకి ప్రధాన సస్పెన్స్. ఈ ప్రశ్న చుట్టూనే కథ మొత్తం సాగుతుంది.

ఈ సినిమాతో విశ్వక్ సేన్ భారతీయ సినిమాల్లో చాలా అరుదైన జానర్‌ను టచ్ చేస్తున్నారు. కల్ట్ ను ఇండియాలో తొలి నిజమైన స్లాషర్ సినిమాగా చెబుతున్నారు. నిజ జీవిత ఘటనల నుంచి ప్రేరణ పొందిన ఈ సినిమా చాలా రా, భయానకంగా, రక్తపాతం ఎక్కువగా ఉండేలా రూపొందించారట. ఇది సాధారణ కమర్షియల్ ఎంటర్టైనర్ కాదని గ్లింప్స్ చూస్తేనే అర్థమవుతుంది.

Advertisement

టీజర్ లాంచ్ ఈవెంట్‌లో విశ్వక్ సేన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. “ఫ్యామిలీస్ ఈ సినిమాకు దూరంగా ఉండటం మంచిది. పిల్లలను ఈ సినిమాకు తీసుకురావద్దు. బలహీన హృదయులు ఈ సినిమాను చూడకపోవడం మంచిది” అని ఆయన స్పష్టంగా హెచ్చరించారు. ఈ మాటలే సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి.

45 నిమిషాల పాటు నో హీరో..!

ఇది దర్శకుడిగా విశ్వక్ సేన్‌కు మూడో సినిమా. ఎప్పుడూ కొత్త కథలు, కొత్త ప్రయోగాలతో ముందుకు వెళ్లే ఆయన మరో షాకింగ్ ట్విస్ట్‌ను వెల్లడించారు. ఈ సినిమాలో మొదటి 45 నిమిషాల పాటు హీరో స్క్రీన్‌పై కనిపించడు. అయినా కూడా ఆ సమయంలో తన వాయిస్ వినిపించేలా ప్లాన్ చేశానని ఆయన తెలిపారు. ఆవేశం సినిమాలో లాగా ఈ కాన్సెప్ట్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందని ఆ సినిమాలో లాగానే ఈ సినిమాలో కూడా మొదట 45 నిమిషాలు హీరో కనిపివ్వరని చెప్పకు వచ్చారు.

ALSO READ: Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఆరా టైమ్ ఫిక్స్ చేశారు.. ఫ్యాన్స్ రెడీగా ఉండండి..

Related News

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

Big Stories

Advertisement
×