E-Paper
Advertisement

Swetcha Effect: ‘స్వేచ్ఛ’ ఎఫెక్ట్.. ప్రభుత్వ ఆసుపత్రిలో పునరుద్ధరించబడిన లిఫ్ట్ సేవలు

Swetcha Effect: ‘స్వేచ్ఛ’ ఎఫెక్ట్.. ప్రభుత్వ ఆసుపత్రిలో పునరుద్ధరించబడిన లిఫ్ట్ సేవలు
Advertisement

Swetcha Effect: స్వేచ్ఛ: హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో గత కొద్దిరోజులుగా నెలకొన్న లిఫ్ట్ సమస్యపై ‘స్వేచ్ఛ’లో వచ్చిన కథనానికి అధికారులు సానుకూలంగా స్పందించారు. ఆసుపత్రిలో లిఫ్ట్ పనిచేయకపోవడంతో గర్భిణీలు, బాలింతలు మరియు రోగులు పడుతున్న నరకయాతన గురించి ‘స్వేచ్ఛ’ పత్రికలో వార్త ప్రచురితం కావడంతో ఆసుపత్రి సూపరింటెండెంట్ తక్షణమే స్పందించారు. రోగుల ఇబ్బందులను గమనించి, యుద్ధప్రాతిపదికన లిఫ్ట్ మరమ్మతులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సూపరింటెండెంట్ చొరవతో సాంకేతిక నిపుణులు వెంటనే పనులు చేపట్టి, నిలిచిపోయిన లిఫ్ట్‌ను పునరుద్ధరించి అందుబాటులోకి తీసుకువచ్చారు.

Also Read: Ramchandra Rao: బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రాంచందర్ రావు గృహనిర్బంధం.. మేడ్చల్ వద్ద ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఆందోళన

లిఫ్ట్ అందుబాటులోకి..

Advertisement

లిఫ్ట్ సేవలు తిరిగి ప్రారంభం కావడంతో ఆసుపత్రిలో నెలకొన్న ప్రధాన సమస్య పరిష్కారమైంది. గత కొన్ని రోజులుగా రెండో అంతస్తుకు వెళ్లాలంటే మెట్ల ద్వారా ఎంతో శ్రమించాల్సి వచ్చేదని, ముఖ్యంగా ప్రసవమైన మహిళలను, రోగులను స్ట్రెచర్లపై మోసుకెళ్లడం అటెండర్లకు తీరని భారంగా మారిందని బాధితులు గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు లిఫ్ట్ అందుబాటులోకి రావడంతో వీల్‌చైర్లు, స్ట్రెచర్లను నేరుగా వార్డులకు తీసుకెళ్లే సౌకర్యం కలగడంపై రోగులు, వారి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సమస్యలపై సానుకూలంగా స్పందించి, తక్షణ పరిష్కారం చూపిన ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు మరియు ఈ సమస్యను వెలుగులోకి తెచ్చిన ‘స్వేచ్ఛ’ పత్రికకు స్థానిక ప్రజలు, ప్రజా సంఘాల ప్రతినిధులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Also Read: Epstein Files: బ్రిటన్‌లో ఎప్‌స్టీన్ ఫైల్స్ తీవ్ర దుమారం.. ఆండ్రూ మౌంట్‌బాటెన్ విండ్సర్ అరెస్ట్!

Related News

తెలంగాణలో కొత్త పింఛన్‌‌దారులకు బిగ్ రిలీఫ్.. ఆపై ప్రభుత్వం ప్రకటన

కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

Big Stories

Advertisement
×