E-Paper
Advertisement

Vishwambhara: విశ్వంభరపై విమర్శలు.. నిర్మాతలు సంచలన నిర్ణయం!

Vishwambhara: విశ్వంభరపై విమర్శలు.. నిర్మాతలు సంచలన నిర్ణయం!
Advertisement

Vishwambhara:టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi ) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఏడు పదుల వయసులో కూడా వరుస చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న ఈయన.. తాజాగా ఈ సంక్రాంతికి ‘మన శంకర వరప్రసాద్ గారు’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.. అదే జోష్ లో ప్రముఖ డైరెక్టర్ బాబీ కొల్లి తో మరోసారి జతకట్టారు. ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో మళ్లీ ఈ కాంబినేషన్లో సినిమా అనేసరికి అభిమానుల అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీనికి తోడు ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవిని తొలిసారి బెంగాల్ మాఫియా డాన్ గా చూపించబోతున్నట్లు చెప్పడంతో ఆ అంచనాలు ఇంకా పెరిగిపోయాయి అనడంలో సందేహం లేదు .
విశ్వంభరా టీజర్ పై విమర్శలు..

ఇదిలా ఉండగా మరొకవైపు మెగాస్టార్ చిరంజీవి అంజి సినిమా తరహాలో.. సోషియో ఫాంటసీ మూవీగా డైరెక్టర్ వశిష్ట మల్లిడి దర్శకత్వంలో ‘విశ్వంభర’ సినిమా చేస్తున్నారు. ఎప్పుడో గత ఏడాదే విడుదల కావాల్సిన ఈ సినిమా పలు కారణాలవల్ల వాయిదా పడుతూ వచ్చింది. కనీసం ఈ సంక్రాంతి కైనా విడుదల చేస్తారు అనుకుంటే అది కుదరలేదు. పైగా ఈ ఏడాది సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ ఉండగా.. గతంలో టీజర్ పై వచ్చిన విమర్శలను దృష్టిలో పెట్టుకొని తాజాగా మేకర్స్ తీసుకున్న నిర్ణయం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

అలాంటి కథతో..

Advertisement

అసలు విషయంలోకి వెళితే.. హిట్లర్ సినిమాలో ఉండే అన్న – చెల్లెల సెంటిమెంటు , జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాలోని అద్భుతమైన ఫాంటసీ ఎలిమెంట్స్, వినోదం కలగలిపి విశ్వంభరలో హైలెట్ గా నిలవనున్నాయట. సృష్టి, స్థితి, లయ అనే అంశాల చుట్టూ తిరిగే ఈ కథలో చిరంజీవి విశ్వంభరుడిగా కనిపించబోతున్నారు. ఇక రీసెంట్గా విడుదలైన టీజర్ లోని గ్రాఫిక్స్ పట్ల మెగా అభిమానుల్లో అసంతృప్తులు వ్యక్తమయ్యాయి. అందుకే మేకర్స్ దీనిపై ఎలా స్పందిస్తారు? అసలు సినిమా కథ ఏంటి ? అనే విషయాలకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ వైరల్ గా మారింది.

ALSO READ:Bhumika Chawla: భూమిక ఇండస్ట్రీలోకి రాకముందు ఏం చేసేవారో తెలుసా?

కీలక నిర్ణయం తీసుకున్న మేకర్స్..

Advertisement

ఇటీవల జరిగిన ఒక సినిమా ఈవెంట్లో యూవీ క్రియేషన్స్ ప్రతినిధి అజయ్ కుమార్ మాట్లాడుతూ.. విశ్వంభర గ్రాఫిక్స్ పై వస్తున్న కామెంట్స్ కి స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. “టీజర్ లోని విజువల్స్ విషయంలో వచ్చిన ఫీడ్బ్యాక్ ను మేము గమనించాము. ఒక పెద్ద సినిమాను రూపొందిస్తున్నప్పుడు ఇలాంటివి రావడం సహజం. అందుకే రెండో టీజర్ లో విజువల్ ఎఫెక్ట్స్ తో చాలా పటిష్టంగా నెక్ట్స్ లెవెల్ లో ఉండేలా ప్లాన్ చేస్తున్నాము. నాణ్యత కోసమే ఈ గ్యాప్ తీసుకోవడం జరిగింది” అంటూ ఆయన తెలిపారు. మొత్తానికైతే రెండో టీజర్ మెగా ఫాన్స్ కు ఒక విజువల్ ఫీస్ట్ అందిస్తుందని ఆయన చెప్పుకువచ్చారు. ఇకపోతే గ్రాఫిక్స్ మీద మాత్రమే కాకుండా స్ట్రాంగ్ ఎమోషన్స్ మీద కూడా ఆధారపడి ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ సినిమాతో చిరంజీవి ఎలాంటి రికార్డ్స్ తిరగరాస్తారో చూడాలి.

Related News

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సల్మాన్ ఖాన్.. వీడియో వైరల్!

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

Big Stories

Advertisement
×