E-Paper
Advertisement

Bhumika Chawla: భూమిక ఇండస్ట్రీలోకి రాకముందు ఏం చేసేవారో తెలుసా?

Bhumika Chawla: భూమిక ఇండస్ట్రీలోకి రాకముందు ఏం చేసేవారో తెలుసా?
Advertisement

Bhumika Chawla:భూమిక చావ్లా (Bhumika Chawla).. అందంతో ఆకట్టుకుంటూ కుర్రకారు హృదయాలను దోచుకున్న ఈ చిన్నది తమిళ్, తెలుగు, హిందీ చిత్రాలలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. 2000 సంవత్సరంలో నాగార్జున (Nagarjuna)మేనకోడలు సుప్రియ యార్లగడ్డ(Supriya yarlagadda)ప్రోత్సాహంతో ‘యువకుడు’ అనే సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగు పెట్టింది. ఈ సినిమాతో వచ్చిన ఇమేజ్ కారణంగా వరుస సినిమాలలో అవకాశాలు లభించాయి. వాళ్ళ 2001లో ‘ఖుషి’ , 2003లో ఒక్కడు, సింహాద్రి.. ఆ తర్వాత జై చిరంజీవ, మిడిల్ క్లాస్ అబ్బాయి ఇలా పలు చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అలా 2000వ దశాబ్దకాలంలో తెలుగు, తమిళ్ అంటూ వరుస సినిమాలు చేసి భారీ పాపులారిటీ అందుకుని ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమయింది .

పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి దూరమైన భూమిక..

అక్కడే తాను ప్రేమించిన యోగా టీచర్, ప్రముఖ రచయిత అయిన భరత్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈమె.. ఒక కొడుకుకు జన్మనిచ్చిన తర్వాత మళ్లీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. మధ్యలో కొన్ని రోజులు సినిమాలు చేసి మళ్లీ ఇండస్ట్రీకి దూరమైంది.

గుణశేఖర్ యుఫోరియాతో రీఎంట్రీ..

Advertisement

అలాంటి ఈమె ఇప్పుడు ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో వస్తున్న యుఫోరియాతో మళ్ళీ తెలుగులో రీఎంట్రీ ఇచ్చింది భూమిక. ఫిబ్రవరి 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో వరుస ప్రమోషనల్ ఇంటర్వ్యూలలో పాల్గొంటోంది. అందులో భాగంగానే ఇండస్ట్రీలోకి రాకముందు భూమిక ఏం చేసింది అనే విషయంపై క్లారిటీ ఇచ్చింది.

ఇండస్ట్రీలోకి రాకముందు భూమిక ఏం చేసేదంటే?

ఇండస్ట్రీలోకి రాకముందు మీరేం చేసేవారు? అని ప్రశ్నించగా ఆమె మాట్లాడుతూ.. “నాకు స్వతంత్ర భావాలు చాలా ఎక్కువ. అందుకే చదువు అయిపోగానే నా కాళ్ళ మీద నేను నిలబడాలని ఒక హార్డ్వేర్ కంపెనీలో కొన్నాళ్ళు పనిచేశాను. అక్కడ నా సహోద్యోగులంతా కూడా నేను చాలా అందంగా ఉన్నానని, సినిమాల్లో ప్రయత్నించమని చెప్పడంతో.. ఇక వారి ప్రోత్సాహంతోనే గ్లామర్ ఫీల్డ్ లోకి రావాలనే ఆలోచన నాలో మెదిలింది. అలా తల్లిదండ్రుల సహకారంతో మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టాను” అంటూ చెప్పుకొచ్చింది భూమిక. మొత్తానికైతే ఇండస్ట్రీలోకి రాకముందు ఒక హార్డ్వేర్ కంపెనీలో పని చేసినట్లు తెలిపింది.

Advertisement

ALSO READ:HBD Simbu: ప్రేమాయణం లిస్ట్ పెద్దదే.. మరి పెళ్లి సంగతేంటి ?

భూమిక అసలు పేరు ఏమిటంటే?

ఇదే ఇంటర్వ్యూలో తన అసలు పేరు గురించి కూడా చెప్పుకొచ్చింది. నేను చదువులో టాపర్ ను కాకపోయినా.. డిస్టింక్షన్ లో మాత్రం పాస్ అయ్యేదాన్ని. 9వ తరగతిలోనే గుర్రపు స్వారీ నేర్చుకున్నాను. ఇక స్కూల్లో జరిగే డిబేట్లు, ఫ్యాషన్ షోలన్నింటిలో కూడా ఖచ్చితంగా నేను పాల్గొనేదాన్ని. అక్కడ అందంగా ముద్దుగా కనిపించడంతో నన్ను అందరూ “గుడియా” అని పిలిచేవారు. అది చూసి ఇంట్లో కూడా అలాగే పిలవడం మొదలుపెట్టారు. ఇక నా అసలు పేరు రచనా చావ్లా(Rachana Chawla) సినిమాలోకి వచ్చాకే భూమికగా మారింది అంటూ తెలిపింది.

Related News

ప్రమాదానికి గురైన అలీ..కాలికి పెద్ద కట్టుతో అలా..ఏమైందంటే?

యశ్ ‘టాక్సిక్’ ఇంగ్లీష్ వెర్షన్ రిలీజ్ డేట్ ఫిక్స్.. అక్కడైనా సక్సెస్ అయ్యేనా?

అరుదైన ఘనత సాధించిన రష్మిక మందన్న!

అన్నపూర్ణ స్టూడియోస్ పై అల్లరి నరేష్ షాకింగ్ కామెంట్స్!

రామాయణంలోకి అమీర్ ఖాన్ కూతురు.. ఆ 5 నిమిషాలే కీలకమట!

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే న్యూస్.. ఆ రూమర్స్ కు చెక్..

మమిత బైజుకు ఏమైంది..? సినిమాలకు గుడ్ బై..?

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

Big Stories

Advertisement
×