E-Paper
Advertisement

Vishwambhara Release Date: ఎట్టకేలకు చిరంజీవి విశ్వంభర విడుదల తేదీ ఫిక్స్.. ఎప్పుడంటే..?

Vishwambhara Release Date: ఎట్టకేలకు చిరంజీవి విశ్వంభర విడుదల తేదీ ఫిక్స్.. ఎప్పుడంటే..?
Advertisement

Vishwambhara Release Date: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రతిష్టాత్మక సోషియో ఫాంటసీ చిత్రం విశ్వంభరపై అభిమానుల్లో అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమా విడుదల తేదీపై స్పష్టత రావడంతో పాటు ట్రైలర్‌కు సంబంధించిన హాట్ అప్‌డేట్ కూడా బయటకు వచ్చింది. ఈ సినిమా ఇప్పటికే విడుదల పలుమార్లు వాయిదా పడగా ఇప్పుడు ఫైనల్ గా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్న క్లారిటీ వచ్చేసింది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ ట్రైలర్ పూర్తిగా సిద్ధమైంది. టీజర్‌లో చూపించిన విజువల్స్ కేవలం ఆరంభం మాత్రమేనని, ట్రైలర్‌లో మాత్రం మరో స్థాయి విజువల్ ఫీస్ట్ ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. జులై నెలలో సినిమా విడుదల చేయాలని ప్లాన్ చేస్తుండటంతో అభిమానుల్లో ఉత్కంఠ పెరిగింది.

ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచినా, ఇప్పుడు రాబోయే ట్రైలర్ మాత్రం మరో స్థాయిలో ఉంటుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

ఈ భారీ చిత్రాన్ని ‘బింబిసార’ సినిమాతో గుర్తింపు పొందిన దర్శకుడు మల్లిడి వశిష్ఠ తెరకెక్కిస్తున్నారు. సామాజిక సందేశంతో కూడిన ఫాంటసీ కథ, భారీ విజువల్స్, గ్రాఫిక్స్ ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలవనున్నాయి. మెగాస్టార్ సరసన హీరోయిన్‌గా త్రిష నటిస్తుండటం మరో విశేషం. ఆమె పాత్ర కథలో చాలా కీలకంగా ఉంటుందని సమాచారం.

ఇప్పటికే విడుదలైన టీజర్‌లో కొన్ని విజువల్ ఎఫెక్ట్స్‌పై సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. దీనిపై స్పందించిన మేకర్స్ ఎక్కడా రాజీ పడకుండా సీజీ వర్క్‌ను మరింత మెరుగుపరిచినట్లు తెలుస్తోంది. తాజాగా నిర్మాతలు వెల్లడించిన వివరాల ప్రకారం, ‘విశ్వంభర’ ట్రైలర్ పూర్తిగా సిద్ధమైంది. టీజర్‌లో చూపించిన విజువల్స్ కేవలం ఆరంభం మాత్రమేనని, ట్రైలర్‌లో మాత్రం ప్రేక్షకులకు అసలైన విజువల్ ఫీస్ట్ ఉంటుందని యూనిట్ చెబుతోంది. ట్రైలర్ రిలీజ్‌తో సినిమాపై భారీ పాజిటివ్ బజ్ క్రియేట్ అవ్వడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.

Advertisement

ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నది ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం. ఎం. కీరవాణి. ఆయన అందించే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పాటలు సినిమాకు మరింత ప్రాణం పోస్తాయని అభిమానులు ఆశిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో, అత్యాధునిక సాంకేతికతతో ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నారు.

ఇక సినిమా విడుదల విషయానికి వస్తే, ‘విశ్వంభర’ను జులై నెల మొదటి వారం లేదా మూడో వారం థియేటర్లలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ట్రైలర్ విడుదల తేదీని కూడా త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. మొత్తం మీద, ట్రైలర్‌తోనే అంచనాలు రెట్టింపు అవుతాయని, మెగాస్టార్ అభిమానులకు ‘విశ్వంభర’ ఓ గ్రాండ్ విజువల్ ట్రీట్‌గా నిలుస్తుందని చెప్పొచ్చు.

ALSO READ: Spirit Leaked Photo: స్పిరిట్ నుంచి ప్రభాస్ ఫోటో లీక్.. చూస్తే ఫ్యూసులు ఎగిరిపోతాయి..!

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×