E-Paper
Advertisement

Budget Data Plans: జియో vs ఎయిర్‌టెల్ vs వొడాఫోన్.. రూ.100 తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ డేటా ప్యాక్స్ ఇవే

Budget Data Plans: జియో vs ఎయిర్‌టెల్ vs వొడాఫోన్.. రూ.100 తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ డేటా ప్యాక్స్ ఇవే
Advertisement

Budget Data Plans| రోజువారీ రీఛార్జ్ ప్లాన్‌లలో డేటా త్వరగా అయిపోతుంది. డైలీ లిమిట్ ముగిసిన తర్వాత చాలా మంది ఇబ్బంది పడతారు. అప్పుడు అదనపు డేటా ప్యాక్‌లు చాలా ఉపయోగపడతాయి. ఈ ప్యాక్‌లలో కాలింగ్ బెనిఫిట్స్ ఉండవు. కేవలం ఇంటర్నెట్ డేటా మాత్రమే ఇస్తాయి. యాక్టివ్ బేస్ ప్లాన్ ఉంటేనే పనిచేస్తాయి. రూ.90 కంటే తక్కువ ధరలో ఉన్న ఈ ప్యాక్‌లు తక్కువ కాలం లేదా ఎమర్జెన్సీ డేటా అవసరాలకు బాగుంటాయి.

ఎయిర్‌టెల్ రూ.99 డేటా ప్యాక్

ఎయిర్‌టెల్ రూ.99 డేటా ప్యాక్ రెండు రోజుల వాలిడిటీ ఇస్తుంది. ఈ ప్యాక్‌లో 20GB హైస్పీడ్ డేటా లభిస్తుంది. హెవీ డేటా త్వరగా కావాలనుకునేవారికి బెస్ట్. వీడియో స్ట్రీమింగ్, పెద్ద ఫైల్స్ డౌన్‌లోడ్ సులభంగా చేయవచ్చు. ఏ యాక్టివ్ ఎయిర్‌టెల్ ప్లాన్‌తోనైనా పనిచేస్తుంది. కాలింగ్ బెనిఫిట్స్ ఉండవు.

ఎయిర్‌టెల్ రూ.77 డేటా ప్యాక్

Advertisement

ఎయిర్‌టెల్ మరో రూ.77 డేటా ప్యాక్ ఇస్తోంది. ఈ ప్లాన్ ఏడు రోజుల వాలిడిటీతో వస్తుంది. మొత్తం 5GB డేటా లభిస్తుంది. లైట్ బ్రౌజింగ్, సోషల్ మీడియా ఉపయోగానికి సరిపోతుంది. చిన్న ట్రిప్‌లు లేదా ఎమర్జెన్సీ సమయాలకు బాగుంటుంది. యాక్టివ్ బేస్ ప్లాన్ ఉండాలి.

జియో రూ.77 డేటా ప్యాక్

జియో రూ.77 డేటా ప్యాక్ అయిదు రోజుల వాలిడిటీ ఇస్తుంది. మొత్తం 3GB డేటా ఉంటుంది. Sony LIVకి ఫ్రీ యాక్సెస్ కూడా ఇస్తుంది. సినిమాలు, స్పోర్ట్స్ చూడవచ్చు. అన్ని జియో బేస్ ప్లాన్‌లతో పనిచేస్తుంది. కాలింగ్ బెనిఫిట్స్ లేవు.

జియో రూ.69 డేటా ప్యాక్

Advertisement

జియో మరో రూ.69 ప్యాక్ 7 రోజుల వాలిడిటీతో వస్తుంది. మొత్తం 6GB డేటా ఇస్తుంది. ఇది చాలా మంచి వాల్యూ ఇస్తుంది. బ్యాలెన్స్‌డ్ ఉపయోగం కావాలనుకునేవారికి బెస్ట్. యాక్టివ్ ప్లాన్ ఉండాలి.

Vi రూ.89 డేటా ప్యాక్

Vi రూ.89 డేటా ప్యాక్ ఏడు రోజుల వాలిడిటీ ఇస్తుంది. మొత్తం 6GB డేటా లభిస్తుంది. వీడియో స్ట్రీమింగ్, ఆన్‌లైన్ క్లాసులకు సరిపోతుంది. ఏ యాక్టివ్ Vi ప్లాన్‌తోనైనా పనిచేస్తుంది. కాలింగ్ లేదు.

Vi రూ.69 డేటా ప్యాక్

Vi రూ.69 ప్యాక్ 28 రోజుల వాలిడిటీ ఇస్తుంది. మొత్తం 3GB డేటా ఉంటుంది. తక్కువ డైలీ యూసేజ్ ఉన్నవారికి బాగుంటుంది. తరచూ రీఛార్జ్ చేయాల్సిన అవసరం తగ్గుతుంది. యాక్టివ్ ప్లాన్ అవసరం.

Also Read: మీ ఫోన్‌లో ఓటీపీ మెసేజ్‌లు కనిపించడం లేదా? ఇలా చేయండి

ఏ ప్యాక్ ఎంచుకోవాలి

హెవీ షార్ట్ యూసేజ్ కావాలంటే Airtel రూ.99 బెస్ట్. బ్యాలెన్స్‌డ్ వీక్లీ యూసేజ్ కావాలంటే Jio రూ.69 మంచిది. లాంగ్ లో లో యూసేజ్ కావాలంటే Vi రూ.69 సరిపోతుంది. ఈ ప్యాక్‌లన్నీ ఎమర్జెన్సీ ఇంటర్నెట్ సమస్యలను సులభంగా పరిష్కరిస్తాయి. ఖరీదైన ప్లాన్‌ల కంటే తక్కువ ఖర్చులో యుజర్ అవసరాలను తీరుస్తాయి.

Related News

జస్ట్.. రూ.3,000 లోపే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ఐఫోన్ కంటే పవర్‌ఫుల్ టార్చ్‌తో Nokia 4G ఫోన్!

8,100mAh బ్యాటరీ, AI బటన్‌తో హానర్ నుంచి క్రేజీ ఫోన్.. ధరెంతో తెలిస్తే Buy Now నొక్కేస్తారు!

జియో, విఐ బెటర్ అంటున్న యూజర్లు.. ఎయిర్‌టెల్ 5G హాట్‌స్పాట్ బ్యాన్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం!

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

Big Stories

Advertisement
×