E-Paper
Advertisement

VK Naresh: మళ్లీ పెళ్లిపై నరేష్ షాకింగ్ కామెంట్స్.. మరీ ఇలా తయారయ్యారేంటి?

VK Naresh: మళ్లీ పెళ్లిపై నరేష్ షాకింగ్ కామెంట్స్.. మరీ ఇలా తయారయ్యారేంటి?

VK Naresh: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు వీకే నరేష్ (VK Naresh). ఒకప్పుడు కామెడీ ప్రధానంగా సినిమాలు చేసి మంచి ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్న ఈయన.. తాజాగా నటిస్తున్న చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’. శర్వానంద్ (Sharwanand) హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో సాక్షి వైద్య, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. రామ్ అబ్బరాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ సహకారంతో ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై అనిల్ సుంకర భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 14వ తేదీన థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టిన చిత్ర బృందం ప్రెస్ మీట్ నిర్వహించగా.. ఆ ప్రెస్ మీట్ లో దర్శక నిర్మాతలతో పాటు హీరోయిన్లు ఇద్దరు , సీనియర్ నటుడు వీ.కే.నరేష్ పాల్గొన్నారు. అందులో భాగంగానే ఆయన “మళ్లీ పెళ్లి” గురించి కామెంట్లు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.

నరేష్ 3.0 వెర్షన్ చూస్తారు..

నరేష్ మాట్లాడుతూ.. సామజవరగమన సినిమా నుంచి నరేష్ 2.0 వెర్షన్ మీరు చూస్తున్నారు. అయితే నారీ నారీ నడుమ మురారి సినిమా నుంచి నరేష్ 3.0 వెర్షన్ చూస్తారు. ఒకవేళ మీరు అలా చూడలేకపోతే నేను సినిమాలు మానేస్తాను అని మాత్రం చెప్పను . కచ్చితంగా నేను ఇంకా మంచి మంచి సినిమాలతో మీ ముందుకు వస్తాను. ముఖ్యంగా మీడియాతో , జనాలతో నేను పెట్టుకోను ..అందుకే చాలెంజ్ లు కూడా చేయను. అయితే సినిమా చూసిన తర్వాత మీరే నరేష్ 3.0 అని చెబుతారు. నా కెరియర్ లోనే ఒక మంచి రోల్ ఇది. శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి సినిమా మంచి విజయం సాధిస్తుంది అంటూ నరేష్ చెప్పుకొచ్చారు. నరేష్ చేసిన కామెంట్లు ఇప్పుడు సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి.

మళ్లీ పెళ్లిపై నరేష్ కామెంట్స్..

ఇకపోతే ఈ సినిమాలో శర్వానంద్ కి తండ్రి పాత్రలో నరేష్ నటించారు.ఈ సినిమాలో ఆయన సెకండ్ మ్యారేజ్ చేసుకున్నట్లు ట్రైలర్ లో చూపించారు. ఇక అందులో భాగంగానే రెండో పెళ్లి చేసుకున్నారా? అని అడిగితే మళ్లీ పెళ్లి చేసుకున్నాను అని నరేష్ నవ్వులు పూయించారు. ఇకపోతే నరేష్ – పవిత్ర గతంలో మళ్లీ పెళ్లి అనే చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాలో మళ్లీ పెళ్లి అంటూ తన మీదనే జోక్స్ వేసుకోవడం గురించి కూడా నరేష్ మాట్లాడారు. నరేష్ మాట్లాడుతూ..” ఇవన్నీ కూడా కేవలం నవ్వించడానికి మాత్రమే తీసే సినిమాలు. కాబట్టి ట్రోలింగ్ లాంటివి ఏముండవు. ఆ క్యారెక్టర్ కి సూట్ అయ్యే డైలాగులు మాత్రమే వస్తూ ఉంటాయి.

అందరి నడుములు పట్టుకుంటానంటే కుదరదు కదా..

ఇక కే- ర్యాంప్ సినిమాలో మాదిరిగా అందరి నడుములు పట్టుకుంటాను అంటే కుదరదు కదా.. ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ కి ఒక లవ్ స్టోరీ ఉంది. అందుకే వాడు అందరి నడుములు పట్టుకుంటూ ఉంటాడు. అయితే ఈ సినిమాలో ఉన్న క్యారెక్టర్ కి మళ్ళీ పెళ్లి అవుతుంది.అందులో తప్పేముంది? ఎంతోమంది చేసుకోవడం లేదా? అంటూ నవ్వుతూ నరేష్ కామెంట్ చేశారు. కానీ ఇది ఇన్ డైరెక్ట్ గా తన వ్యక్తిగత జీవితంపై చేసిన కామెంట్లే అంటూ నెటిజన్స్ ఒక రేంజ్ లో తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. మొత్తానికైతే మళ్లీ పెళ్లి కాన్సెప్ట్ తో వార్తల్లో నిలిచారు నరేష్.

also read:Naa Anveshana: ట్రావెలింగ్ ఆపేస్తున్నా.. ఇకపై మీకోసం కాదు నాకోసం!

Related News

అభిమానిపై ‘రాకింగ్ స్టార్’ రియల్ ప్రేమా.. క్యాన్సర్ బాధితుడికి వీడియో కాల్ చేసిన యష్!

పెద్ది’ మూవీ రివ్యూ: రామ్ చరణ్ ఊరమాస్ జాతర.. బుచ్చిబాబు హిట్ కొట్టాడా?

పెద్ది ఓటీటీ లాక్….అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ పై క్లారిటీ వచ్చేసిందిగా!

ప్రభాస్ ‘స్పిరిట్’ లొకేషన్ సెల్ఫీ లీక్.. లుక్ చూస్తే పూనకాలే!

బన్నీ-లోకేష్ కనగారాజ్ సినిమా క్యాన్సిల్ అయిందా? …. అసలు నిజం తెలిస్తే షాకవ్వాల్సిందే!

చరణ్ ‘పెద్ది’ బాక్సాఫీస్ బ్యాటింగ్ స్టార్ట్.. సమంత, వరుణ్ తేజ్ రివ్యూస్ వైరల్.. ‘మెగా 158’ టీమ్ స్పెషల్ విష్

పెద్ది’ రిలీజ్ వేళ రచ్చ.. రామ్ చరణ్ విగ్రహంపై దారుణంగా ట్రోల్స్, క్షమాపణలు చెప్పిన ఫ్యాన్స్!

ఇది కదా క్యారెక్టర్ డెడికేషన్ అంటే! ‘పెద్ది’ గెటప్‌లో రోడ్లపై తిరిగిన జగ్గూభాయ్..

Big Stories

×