E-Paper
Advertisement

Kakinada District: సంక్రాంతి వేళ ఆ గ్రామంలో పెను విషాదం, మంటల్లో బూడిదైన పదుల సంఖ్యలో ఇళ్లు

Kakinada District: సంక్రాంతి వేళ ఆ గ్రామంలో పెను విషాదం, మంటల్లో బూడిదైన పదుల సంఖ్యలో ఇళ్లు
Advertisement

Kakinada District: సంక్రాంతి పండుగ సమీపిస్తున్న వేళ గ్రామాలు ఆనందంతో కళకళలాడుతున్నాయి. తాజాగా కాకినాడ జిల్లాలోని మన్యం మండలంలోని సర్లంకపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. భయంకరమైన అగ్నిప్రమాదంలో దాదాపు 40 కుటుంబాల జీవితాలను తలకిందులు చేసింది. అసలు ఘటన ఎలా జరిగింది. ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..

సంక్రాంతి వేళ కాకినాడ జిల్లాలోని ఓ గ్రామంలో పెను విషాదం

Advertisement

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి వేళ పల్లెల్లో సందడి మొదలైంది. నగరాలు, పట్నాల నుంచి నుంచి ప్రజలు పల్లెలకు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అగ్నిప్రమాదం కారణంగా 40 కుటుంబాలకు గుండెకోత మిగిల్చింది. ఈ ఘటన కాకినాడ జిల్లా మన్యంలోని సార్లంకపల్లెలో రాత్రి ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.

ఈ తండాలో దాదాపు 40 పూరిళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. దీంతో ఈ గ్రామానికి చెందిన కుటుంబాలు రోడ్డున పడ్డారు. మూడు ఇళ్లు మినహా అన్ని అగ్నికి ఆహుతయ్యాయి. నిలువనీడ లేక కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు బాధితులు.  సంక్రాంతి పండుగ కోసం సరకులు కొనుగోలు చేసేందుకు గ్రామస్థులు సోమవారం సాయంత్రం తుని వెళ్లారు.

Advertisement

అగ్ని ప్రమాదానికి దగ్గమైన ఇళ్లు, రోడ్డున పడిన బాధితులు

ఆ సమయంలో ఏం జరిగిందో తెలీదు. ఒక్కసారిగా గ్రామంలో మంటలు చెలరేగి దావానంలా వ్యాపించాయి. ఊళ్లో కొద్దిమంది ప్రాణాలు చేత పట్టుకుని భయంతో పరుగులు తీశారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న బాధితులు తమ గ్రామానికి చేరుకునేసరికి సర్వం బూడిదైంది. ఆ ఇళ్లను చూసి గుండెలవిసేలా రోదిస్తున్నారు గ్రామస్తులు.

సార్లంకపల్లె మారుమూల ప్రాంతంలో ఉంది. 50 కిలోమీటర్ల దూరంలోవున్న తుని నుంచి అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపు జరగాల్సిన నష్టం జరిగింది. ఘటన గురించి తెలియగానే ప్రత్తిపాడు ఎమ్మెల్యే సత్యప్రభ ఆ గ్రామానికి చేరుకుని బాధితులను పరామర్శించారు.

ALSO READ:  మాజీ మంత్రి అప్పల సూర్యనారాయణ కన్నుమూత

బాధితులకు తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఘటన ఎలా జరిగింది అనేదానిపై ఆరా తీస్తున్నారు. గ్యాస్ లీక్ కారణంగా మంటలు వ్యాపించి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

Related News

కాంగ్రెస్ అభ్యర్థులపై దాడులు.. చంద్రబాబు సర్కారుపై షర్మిల సంచలన ఆరోపణలు

టైం మీది కొడుతున్నారు.. రేపు మా టైం వస్తుంది: జగన్ సంచలన వ్యాఖ్యలు!

వైసీపీకి బిగ్ షాక్.. నామినేషన్ల గడువు పెంపు పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు!

ఇచ్చాపురం మున్సిపాలిటీలో తోటికోడళ్ల కుర్చీ పోరు.. వైసీపీ పార్టీకి బిగ్ షాక్..?

దర్శిలో హైటెన్షన్.. వైసీపీ దాడిలో SI కి తీవ్ర గాయాలు

మా ప్రభుత్వం వస్తే నేనే హోంమంత్రిని: అంబటి రాంబాబు

సీఈసీ నియామకానికి మద్దతిచ్చి తప్పు చేశాం.. విజయవాడలో జగన్ సంచలన వ్యాఖ్యలు!

సీఎం చంద్రబాబుపై జగన్ తీవ్రమైన ఆరోపణలు.. గొడ్డళ్లు సప్లై చేశారంటూ మండిపాటు

Big Stories

Advertisement
×