E-Paper
Advertisement

Vrushakarma Film: నాగ వంశీ చేతికి వృషకర్మ తెలుగు థియేట్రికల్ రైట్స్..చైతూ కెరియర్ లోనే హైయెస్ట్!

Vrushakarma Film: నాగ వంశీ చేతికి వృషకర్మ  తెలుగు థియేట్రికల్ రైట్స్..చైతూ కెరియర్ లోనే హైయెస్ట్!
Advertisement

Vrushakarma Film: అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం వృషకర్మ (Vrushakarma). విరూపాక్ష దర్శకుడు కార్తీక్ వర్మ దండు(Karthik Varma Dandu) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ సినిమాకు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నాగచైతన్య సినీ కెరియర్ లోనే హైయెస్ట్ భారీ బడ్జెట్ సినిమాగా వృషకర్మ ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ చిత్రాన్ని జూన్ లేదా జూలై నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు. ఇకపోతే ఇటీవల ఈ సినిమా నుంచి గ్లింప్స్ వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ వీడియోకి విపరీతమైన ఆదరణ లభించడమే కాకుండా సినిమా పై భారీ స్థాయిలో అంచనాలను పెంచేసింది.

రూ. 45 కోట్లకు నాగ వంశీ డీల్…

ఇక ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగా జరుపుకుంటుందని తెలుస్తుంది. ఇండస్ట్రీ సమాచారం ప్రకారం ఇప్పటికే తెలుగు థియేట్రికల్ రైట్స్ కు సంబంధించిన బిజినెస్ పూర్తి అయిందని సమాచారం. ఈ సినిమాకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అలాగే కర్ణాటక రాష్ట్రాలలో థియేట్రికల్ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నాగ వంశీ (Nagavamsi) భారీ ధరలకు కైవసం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మూడు రాష్ట్రాలకు కలిపి రూ.45 కోట్లకు డీల్ కుదుర్చుకున్నట్టు సమాచారం. అలాగే ఓవర్సీస్ లో ఈ సినిమా 10 కోట్ల రూపాయలకు బిజినెస్ పూర్తి చేసుకుందని తెలుస్తోంది. కేవలం తెలుగు థియేట్రికల్ రైట్స్ 55 కోట్ల రూపాయలకు అమ్ముడు పోయాయి.

భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్..

Advertisement

ఇక ఈ సినిమా కోసం చిత్ర నిర్మాతలు 110 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించినట్లు సమాచారం. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలి అంటే సుమారు 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంటుంది. ఇక ఈ సినిమా దర్శకుడు కార్తీక్ వర్మ విరూపాక్ష సినిమా అలాగే నాగచైతన్య తండేల్ సినిమాను మించిన బిజినెస్ జరుపుకునే చెప్పాలి. మరి ఈ సినిమా విడుదల తర్వాత ఏ విధమైనటువంటి సక్సెస్ అందుకుంటుంది, నాగచైతన్య కెరియర్ కు ఈ సినిమా ఎలా ప్లస్ అవుతుందనే విషయాలు తెలియాల్సి ఉంది.

వృషకర్మపై పెరిగిన అంచనాలు..

Advertisement

ఈ సినిమా నాగచైతన్య కెరియర్ లోనే మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా కావటం విశేషం. ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు ఈ సినిమాలో నాగచైతన్య జోడిగా మీనాక్షి సోదరి హీరోయిన్ గా నటించబోతున్న సంగతి తెలిసిందే . ఈమె దక్ష అనే పాత్రలో మీనాక్షి చౌదరి కనిపించబోతున్నారు. మైథాలజికల్ ఫాంటసీ థ్రిల్లర్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వృషకర్మ మూవీ పై అక్కినేని అభిమానులలో కూడా భారీగా అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం చివరిదశ షూటింగ్ పనులలో చిత్రబృందం బిజీగా ఉన్నారని తెలుస్తోంది.

Also Read: Allu Sirish: భార్య నైనిక పేరును  టాటూగా వేయించుకున్న శిరీష్.. ఇది కదా ప్రేమంటే?

Related News

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×