TVS కంపెనీ భారత్ లో మూడు ఎలక్ట్రిక్ స్కూటర్లను అమ్ముతుంది. వాటిలో iQube అనేది మోస్ట్ పాపులర్ మోడల్. ఇది చక్కటి హ్యాండ్లింగ్, మంచి లుక్, అంతకు మించి రేంజ్ అందిస్తుంది. అందుకే, ఈ స్కూటర్ ను కొనుగోలు చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. అయితే, ఈ స్కూటర మీరు కూడా కొనాలంటే ముందుగా కొన్ని విషయాలను తెలుసుకోవాలి. అవేంటంటే..
iQube శ్రేణి మూడు వేరియంట్లు ఉన్నాయి. iQube, iQube S, iQube ST. ప్రామాణిక iQube బేస్ వెర్షన్. పలు బ్యాటరీ ఎంపికలతో వస్తుంది. iQube S మరిన్ని ఫీచర్లు, పెద్ద డిస్ ప్లేతో వస్తుంది. iQube ST అతిపెద్ద బ్యాటరీ, ఎక్కువ రేంజ్ ను అందిస్తుంది. IQube ధరలు ప్రస్తుతం రూ. 1.11 లక్షల నుంచి ప్రారంభమై రూ.1.61 లక్షల వరకు ఉన్నాయి. వేరియంట్ ను బట్టి మారుతుంది.
iQube లైనప్ పలు బ్యాటరీ ప్యాక్ లను కలిగి ఉంటుంది. బేస్ iQube మూడు బ్యాటరీ ప్యాక్ ఎంపికలతో అందుబాటులో ఉంది. 2.2 kWh, 3.1 kWh, 3.5 kWhతో వస్తుంది. iQube S 3.5 kWh బ్యాటరీని కలిగి ఉంటుంది. iQube ST 3.5 kWh, పెద్ద 5.3 kWh బ్యాటరీని కలిగి ఉంటుంది. బ్యాటరీ పరిమాణాన్ని బట్టి ఛార్జింగ్ సమయం మారుతుంది. 2.2 kWh వెర్షన్‌కు 2 గంటల 45 నిమిషాలు, 5.3 kWh బ్యాటరీకి దాదాపు 6 గంటల 50 నిమిషాల వరకు టైమ్ పడుతుంది.
పలు రకాల బ్యాటరీ ప్యాక్ ల కారణంగా క్లెయిమ్ రేంజ్ మారుతూ ఉంటుంది. బేస్ 2.2 kWh వెర్షన్ 94 కి.మీ పరిధిని అందిస్తుంది. 3.1 kWh వేరియంట్ 123 కి.మీ వరకు ఉంటుంది. 3.5 kWh వెర్షన్లు దాదాపు 145 కి.మీ వరకు ఉంటాయి. ఈ లైనప్ టాప్ లో 5.3 kWh బ్యాటరీతో iQube ST 212 కి.మీ రేంజ్ ను అందిస్తుంది.
పలు బ్యాటరీ ప్యాక్ లు ఉన్నప్పటికీ, చాలా iQube వేరియంట్లు ఒకే రకమైన పనితీరును కలిగి ఉంటాయి. లైనప్ లో పీక్ పవర్ 4.4 kWగా రేట్ చేయబడింది. చాలా వెర్షన్లు 4.2 సెకెన్లలో 0–40 కి.మీ వేగాన్ని అందుకుంటాయి. వేరియంట్‌ను బట్టి టాప్ స్పీడ్ కొద్దిగా మారుతుంది. 2.2 kWh మోడల్ కు 75 కిమీ, 3.5 kWh వెర్షన్లకు 78 కిమీ, ST వేరియంట్ కు 82 కిమీ గరిష్ట వేగం ఉంటుంది.
iQube STలో అదనపు టెక్నాలజీ ఉంటుంది. ఇది 17.78 సెం.మీ TFT టచ్ స్క్రీన్ డిస్ ప్లే, వాయిస్ అసిస్ట్, మరిన్ని కనెక్ట్ చేయబడిన ఫీచర్లను కలిగి ఉంటుంది. టర్న్ బై టర్న్ నావిగేషన్, కాల్, SMS అలర్ట్స్, మ్యూజిక్ నియంత్రణ, జియోఫెన్సింగ్, యాంటీ థెఫ్ట్ అలారం, క్రాష్, ఫాల్ హెచ్చరిలు చేస్తుంది. రివర్స్ అసిస్ట్, రీజెనరేటివ్ బ్రేకింగ్, USB ఛార్జింగ్, 32 లీటర్ల వరకు అండర్ సీట్ స్టోరేజ్ లాంటి ఫీచర్లను కలిగి ఉంటుంది.
Read Also: లాంచ్ కు ముందే రోడ్డెక్కిన హీరో విడా VXZ ఎలక్ట్రిక్ బైక్, అసలు మ్యాటర్ ఏంటంటే?