E-Paper
Advertisement

TCL Trifold Monitor: ప్రపంచంలోనే తొలి 28 ఇంచుల ట్రై-ఫోల్డ్ మానిటర్.. ఇక ఫోన్లనే కాదు.. డెస్క్‌టాప్‌నూ మడతపెట్టొచ్చు!

TCL Trifold Monitor: ప్రపంచంలోనే తొలి 28 ఇంచుల ట్రై-ఫోల్డ్ మానిటర్.. ఇక ఫోన్లనే కాదు.. డెస్క్‌టాప్‌నూ మడతపెట్టొచ్చు!

TCL Trifold Monitor: సాధారణంగా ఫోల్డబుల్ టెక్నాలజీ అంటే.. మనందరికీ వెంటనే గుర్తొచ్చేవి స్మార్ట్‌ఫోన్‌లు. ఇప్పటికే మార్కెట్లోకి రకరకాల ఫోల్డబుల్ ఫోన్లు వచ్చాయి కానీ, మానిటర్ల విషయంలో మాత్రం ఈ మార్పు ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. స్పానిష్ నగరం బార్సిలోనాలో జరిగిన MWC 2026 వేదికగా TCL కంపెనీ ఓ అద్భుతాన్ని ఆవిష్కరించింది. అదే ప్రపంచంలోనే మొట్టమొదటి 28 అంగుళాల ట్రై-ఫోల్డ్ డెస్క్‌టాప్ మానిటర్. ఇది కేవలం ఒక ప్రోటోటైప్ మాత్రమే కాదు.. భవిష్యత్తులో మనం పని చేసే విధానాన్ని పూర్తిగా మార్చేసే సరికొత్త టెక్నాలజీ.

ఆ మానిటర్‌ను మడత పెడితే..

ఈ మానిటర్ ప్రత్యేకత ఏమిటంటే.. దీనిని 3 భాగాలుగా మడత పెట్టుకోవచ్చు. 28 అంగుళాల భారీ స్క్రీన్ ఉన్నప్పటికీ, దీనిని మడత పెట్టినప్పుడు కేవలం 16 అంగుళాల పరిమాణానికి తగ్గిపోతుంది. ఎక్కడికైనా జర్నీ చేసేటప్పుడు కూడా ఈ పెద్ద డెస్క్‌టాప్ స్క్రీన్‌ను ల్యాప్‌టాప్ బ్యాగులో సులభంగా తీసుకెళ్లవచ్చు. దీనిని ఓపెన్ చేసినప్పుడు 3840×1280 రిజల్యూషన్‌తో అల్ట్రా వైడ్ ఫీల్‌ను అందిస్తుంది. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ ట్రై-ఫోల్డ్ మానిటర్ మందం కేవలం 4.48 మిల్లీమీటర్లు మాత్రమే. ఇంత సన్నగా ఉన్నా, దీని కలర్ క్వాలిటీ మాత్రం సినిమా స్క్రీన్లకు ఏమాత్రం తీసిపోదు.

Also Read: ఇంటికి హై స్పీడ్ Wi-Fi కనెక్షన్ కావాలా? ఎయిర్‌టెల్, జియో.. ఏది తీసుకుంటే లాభం?

అద్భుతమైన ఇంజనీరింగ్ వర్క్..

ఈ మానిటర్ తయారీలో వాడిన మడత పెట్టే మెకానిజం టెక్నాలజీ పరంగా చాలా క్లిష్టమైనది. వాటర్‌డ్రాప్ హింజ్ డిజైన్ వల్ల స్క్రీన్‌ను మడత పెట్టినప్పుడు ఎలాంటి గ్యాప్ లేకుండా, చాలా నీట్‌గా ఉంటుంది. దీంతో ఈ మానిటర్‌ను పూర్తిగా ఓపెన్ చేసి వాడుకోవచ్చు. లేదంటే రెండు పక్కల ఉన్న ప్యానెల్స్‌ను కొద్దిగా లోపలికి వంచి కర్వ్‌డ్ మానిటర్ లాగా కూడా మార్చుకోవచ్చు. తద్వారా పని చేసేటప్పుడు లేదా గేమ్స్ ఆడేటప్పుడు మెరుగైన పనితీరును అందిస్తుంది. ఈ మానిటర్ వెనుకున్న ఉన్న స్టాండ్ సహాయంతో మనకు నచ్చిన యాంగిల్‌లో నిలబెట్టుకోవచ్చు.

త్వరలోనే మార్కెట్లోకి..

స్వయంగా TCL సంస్థ ఈ మానిటర్‌ను మార్కెట్లోకి విడుదల చేయదు. వారు కేవలం డిస్‌ప్లే ప్యానెల్స్‌ను తయారు చేసే కంపెనీ కాబట్టి.. ఇతర ప్రముఖ కంపెనీలకు ఈ టెక్నాలజీని అందిస్తారు. లెనోవో వంటి సంస్థలు ఇప్పటికే టీసీఎల్ తయారు చేసిన స్క్రీన్లను వాడుతున్నాయి. సో.. రాబోయే రోజుల్లో మనం సరికొత్త ట్రై ఫోల్డ్ మానిటర్లను వివిధ బ్రాండ్ల పేరుతో మార్కెట్లో చూడొచ్చన్నమాట. ఈ మానిటర్ ద్వారా ఆఫీస్ వర్క్, వీడియో ఎడిటింగ్ వంటి పనులను ఈజీగా చేసుకోవచ్చు.

Also Read: బంపర్ ఆఫర్ మావా.. డాల్బీ అట్మాస్ స్మార్ట్ టీవీలు సగం ధరకే వచ్చేస్తున్నాయ్!

Related News

ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లను హ్యాకర్లు ఎలా దొంగిలిస్తున్నారో తెలుసా?

ఫ్లిప్‌కార్ట్ అదిరిపోయే ఆఫర్.. రూపాయి ఖర్చు లేకుండా ‘నెట్‌ఫ్లిక్స్’ ఉచితం!

50MP కెమెరా, 6,500mAh బ్యాటరీతో Motorola Edge 70 Pro+ లాంచ్.. ధర వింటే షాకే!

డిజైన్ అదిరింది.. 5x పెరిస్కోప్ కెమెరాతో Xiaomi 17T లాంచ్, సేల్స్ ఎప్పటి నుంచంటే?

Physical SIM vs eSIM: ఆండ్రాయిడ్ ఫోన్లలో ఏ సిమ్ బెస్ట్? ఏది వాడితే ఎక్కువ లాభం?

గంటల తరబడి హెడ్‌ఫోన్స్ పెట్టుకుంటున్నారా? ఈ 60/60 రూల్ తెలియకపోతే డేంజర్లో పడ్డట్టే!

అమెజాన్ బంపరాఫర్.. మోటో ఎడ్జ్ 50పై రూ.5 వేలకు పైగా తగ్గింపు.. ఫోన్ ప్రత్యేకతలు ఇవే!

సరికొత్త లుమియో టీవీ.. డాల్బీ అట్మోస్, 4K డిస్‌ప్లే.. ఇక ఇంట్లోనే థియేటర్!

Big Stories

×