E-Paper
Advertisement

Naga Chaitanya New Movie: ‘వృషకర్మ’గా నాగచైతన్య కొత్త సినిమా.. ఇంట్రెస్టింగ్ గా ఉందే!

Naga Chaitanya New Movie: ‘వృషకర్మ’గా నాగచైతన్య కొత్త సినిమా.. ఇంట్రెస్టింగ్ గా ఉందే!
Advertisement

Naga Chaitanya New Movie: అక్కినేని యువ సామ్రాట్ నాగచైతన్య (Nagachaitanya)తండేల్ సినిమా తరువాత విరూపాక్ష దర్శకుడు కార్తీక్ వర్మ దండు(Karthik Varma Dandu) దర్శకత్వంలో మరో సినిమాకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. సుకుమార్ రైటింగ్స్ బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఇప్పటికే దాదాపు సగభాగం షూటింగ్ పనులను కూడా పూర్తి చేసుకుందని తెలుస్తుంది. అయితే నేడు నాగచైతన్య పుట్టినరోజు (Birthday)కావడంతో ఈ సినిమా నుంచి నాగచైతన్య పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు టైటిల్ కూడా రివీల్ చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) చేతుల మీదుగా ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఈ సినిమాకు వృషకర్మ (Vrushakarma) అనే టైటిల్ పెట్టినట్టు అధికారిక పోస్టర్ ద్వారా తెలియజేశారు. ఇక నాగచైతన్య ఫస్ట్ లుక్ అందరిని ఎంతగానో ఆకట్టుకుంటుంది.

మైథాలజికల్ థ్రిల్లర్..

ఈ సినిమా మైథాలజికల్ థ్రిల్లర్ సినిమాగా ప్రేక్షకులందరికీ రాబోతోందని స్పష్టం అవుతుంది. ఈ సినిమాలో నాగచైతన్యకు జోడిగా మీనాక్షి చౌదరి (Meenakshi Chowdary)హీరోయిన్ గా నటించబోతున్నారు. మీనాక్షి చౌదరి ఈ సినిమాలో సైంటిస్ట్ గా కనిపించనున్నారు. ఇటీవల మీనాక్షి చౌదరి ఫస్ట్ లుక్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని స్పష్టం అవుతుంది. ఇప్పటివరకు నాగచైతన్య నటించని జోనర్ లో ఈ సినిమా రాబోతున్న నేపథ్యంలో సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇక ఈ సినిమాని 2026 లోనే విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.

రెండు భాగాలుగా వృషకర్మ ?

Advertisement

నాగచైతన్య హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తండేల్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ సినిమా మంచి సక్సెస్ అయిన తరుణంలో తదుపరి కార్తీక్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమాకు కమిట్ అయ్యారు.ఇకపోతే ఈ సినిమా కూడా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతోందంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కానీ ఇప్పటివరకు ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు చిత్ర బృందం ఎక్కడ అధికారకంగా వెల్లడించలేదు. ప్రస్తుతం నాగచైతన్య వరస ప్రాజెక్టులను లైన్లో పెడుతూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.

Advertisement

ఇక మీనాక్షి చౌదరి సైతం ప్రస్తుతం నార్త్ సౌత్ పని తేడా లేకుండా వరుస సినిమాలలో నటిస్తున్నారు. ఇటీవల ఈమె సంక్రాంతికి వస్తున్నాం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత తెలుగులో మీనాక్షి చౌదరి నాగచైతన్యతో తదుపరి సినిమాకు కమిట్ అయ్యారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది తాజాగా హైదరాబాద్లో ఓ భారీ సెట్ నిర్వహించి యాక్షన్ ఎపిసోడ్ షూటింగ్ చేయబోతున్నారని స్పష్టం అవుతుంది. ఇటీవల ఈ సినిమా నుంచి చిత్ర బృందం మేకింగ్ వీడియోని విడుదల చేసిన సంగతి తెలిసిందే.

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×