E-Paper
Advertisement

Bigg Boss 9 Telugu : ఎలిమినేషన్ బిగ్ ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్.. అందరూ సేఫ్..

Bigg Boss 9 Telugu : ఎలిమినేషన్ బిగ్ ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్.. అందరూ సేఫ్..
Advertisement

Bigg Boss 9 Telugu : బుల్లితెర టాప్ రియాల్టీ షో బిగ్ బాస్ మరికొన్ని రోజుల్లో పూర్తికావోస్తుంది. 10 వారాలు పూర్తి చేసుకున్న ఈ షోలో 11వ వారం నామినేషన్స్ అందరినీ ఆలోచనలో పడేసాయి. ఈవారం హౌస్ లోని స్ట్రాంగ్ కంటెస్టెంట్లలో ఒకరు ఎలిమినేట్ అవుతారని అందరూ అనుకున్నారు. అంతేకాదు మరోవైపు డబల్ ఎలిమినేషన్ కూడా ఉండబోతుందంటూ వార్త అయితే సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. ఈవారం డేంజర్ జోన్ లో ఉన్నది సంజన, దివ్య.. అయితే ఈ వీక్ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారు? లేదా ఇద్దరు ఎలిమినేట్ అవుతారన్న వార్తలు వినిపించాయి. కానీ ప్రస్తుతం మాత్రం ఆ వార్తల్లో నిజం లేదని తెలుస్తుంది. దివ్య – తనూజ మధ్య జరిగిన గొడవల వల్ల టీఆర్పీ రేటింగ్ బాగా పెరిగిందట.. దాంతో దివ్యను కాపాడేందుకు బిగ్ బాస్ మాస్టర్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.. అసలేం జరుగుతుందో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

దివ్యను కాపాడేందుకు బిగ్ స్కెచ్..

బిగ్ బాస్ సీజన్ 9 ప్రస్తుతం రసవత్తరంగా సాగుతుంది. 11వ వారం నామినేషన్స్ జనాలని ఎంతగానో ఆకట్టుకున్నాయి.. మరి హౌస్ లో ప్రస్తుతం స్ట్రాంగ్ కంటెస్టెంట్లు ఉండడంతో ఈవారం ఎవరు బయటికి వెళ్లిపోతారని జనాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎపిసోడ్ లో నాగార్జున అందరికీ దిమ్మ తిరిగిపోయేలా క్లాస్ ఇచ్చాడు.. ఇక ఇవాళ ఎలిమినేషన్ జరగబోతుందని అనుకున్నారు కానీ.. నిజానికి ఎలిమినేషన్ లేదన్న వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అందుకు కారణం దివ్య, తనుజ గొడవలే.. ఈ వారం వీళ్లిద్దరి మధ్య జరిగిన గొడవలు జనాలను బాగా ఆకట్టుకున్నాయి. దాంతో టిఆర్పి రేటింగ్ కూడా బాగానే పెరిగినట్లు తెలుస్తుంది. ఇప్పుడు దివ్యని బయటకు పంపిస్తే మళ్లీ సీజన్ డల్ గా కనిపిస్తుందని బిగ్ బాస్ స్కెచ్ వేసినట్లు తెలుస్తుంది.. ఈ క్రమంలోనే ఈ వీక్ నో ఎలిమినేషన్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. మరి నిజంగానే ఇవాళ ఎలిమినేషన్ లేదని ప్రకటిస్తారేమో చూడాలి..

Advertisement

Also Read: బిగ్ డిజాస్టర్ అయినా భారీగా పెంచేసిన రెమ్యూనరేషన్… అఖండ 2కి బోయపాటికి ఎన్ని కోట్లంటే?

విన్నర్ రేస్ లో కళ్యాణ్.. 

శనివారం ఎపిసోడ్ లో కళ్యాణ్ కోసం ఆయన తండ్రి, తమ్ముడు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు..కొడుకును చూసి ఎమోషనలైన తండ్రి.. నీనుంచి పదిమంది బతకాలి.. పదిమంది నుంచి నువ్వు బతక్కూడదు అంటూ గొప్ప మాటలు చెప్పాడు. దాంతో హౌస్ మొత్తం ఒక వైబ్ క్రియేట్ అయ్యింది. కల్యాణ్‌, ఇమ్మాన్యుయేల్‌, తనూజ, రీతూ, పవన్‌ను టాప్‌ 5 పెట్టారు. అనంతరం ఇమ్మాన్యుయేల్‌ అన్నతో పాటు కమెడియన్‌ అవినాష్‌ వచ్చారు.. అతను ఇమ్మూ, తనూజ, కల్యాణ్‌, పవన్‌, రీతూని టాప్‌ 5లో పెట్టారు.. మొత్తానికి ఈ వారం టాప్ ఫైవ్ లో వీళ్లే ఉండటం విశేషం.. మరికొన్ని రోజుల్లో బిగ్ బాస్ షో పూర్తి కావస్తున్న నేపథ్యంలో విన్నర్ ఎవరు అన్నది సోషల్ మీడియాలో ప్రశ్నార్ధకంగా మారింది. టాప్ ఫైవ్ లో ఉన్న స్ట్రాంగ్ కంటెస్టెంట్లలో ఎవరో ఒకరు విన్నర్ అవుతారు. అయితే ఇప్పటివరకు తనుజ ఇమాన్యుల్ పేర్లు మాత్రమే వినిపించాయి. కానీ ఇప్పుడు కళ్యాణ్ పేరు కూడా ఆ లిస్టులో కొంచెం చేరడంతో విన్నర్ ప్లేస్ మారే అవకాశం ఉందని సోషల్ మీడియాలో మరో వార్త ప్రచారంలో ఉంది.. మరి ఈ సీజన్ కు విన్నర్ ఎవరో అవుతారో తెలుసుకోవాలంటే బిగ్ బాస్ ను మరికొన్ని రోజులు మిస్ అవ్వకుండా చూడాల్సిందే..

Related News

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

Big Stories

Advertisement
×