E-Paper
Advertisement

Smriti Mandhana Marriage: పూల దండ‌ల‌తో తీన్మార్ డాన్స్ ఇర‌గ‌దీసిన స్మృతి మందాన దంప‌తులు !

Smriti Mandhana Marriage: పూల దండ‌ల‌తో తీన్మార్ డాన్స్ ఇర‌గ‌దీసిన స్మృతి మందాన దంప‌తులు !
Advertisement

Smriti Mandhana Marriage: టీమిండియా లేడీ కోహ్లీ స్మృతి మందాన ( Smriti Mandhana ) గురించి తెలియని వారు ఉండరు. టీమిండియాకు ఒంటి చేత్తో ఎన్నో విజయాలు అందించిన స్మృతి మందాన ఆదివారం రోజున పెళ్లి పీటలు ఎక్క‌బోతున్నారు. అంటే మరికొన్ని గంటల్లోనే స్మృతి మందాన ( Smriti Mandhana Marriage ) మెడలో పలాష్ ముచ్చల్ (Palash Muchhal) అనే సింగర్ తాళిబొట్టు కట్టబోతున్నాడు. ఈ నేపథ్యంలో మూడు రోజుల నుంచి స్మృతి మందాన ఇంట పెళ్లి సందడి నెలకొంది. ఈ పెళ్లికి ఇప్పటికే టీమిండియా మహిళా క్రికెటర్లు వెళ్లి సందడి చేస్తున్నారు. వాళ్లు రీల్స్‌ చేస్తూ రచ్చ చేయడమే కాకుండా, స్మృతి మందాన‌ల‌ను కూడా ఇన్వాల్వ్ చేసి, ఇరగదీస్తున్నారు.

Also Read: Aus vs Eng Ashes 2025-26 : సెంచరీతో రెచ్చిపోయిన హెడ్.. మొదటి టెస్ట్ లో ఆస్ట్రేలియా విజయం.. 2 రోజుల్లోనే మ్యాచ్ ఫినిష్

పూలదండలతో తీన్మార్ స్టెప్పులు వేసిన స్మృతి మందాన దంపతులు

Advertisement

ఆదివారం రోజున స్మృతి మందాన వివాహం ఉన్న నేపథ్యంలో శనివారం రాత్రి బ్యాచిలర్ గ్రాండ్ పార్టీ నిర్వహించారు. అయితే ఈ ఈవెంట్ నేపథ్యంలో స్మృతి మందాన, సింగర్ పలాష్ ముచ్చల్ (Palash Muchhal) ఇద్దరు కూడా డాన్స్ చేస్తూ రచ్చ చేశారు. ఒకరికొకరు పూలదండలు మార్చుకొని, తీన్మార్ స్టెప్పులతో దుమ్ము లేపారు. అంతేకాదు స్టేజి పైన ఇద్దరు హగ్ చేసుకోవడం, స్మృతి మందానను పలాష్ ముచ్చల్ ఎత్తుకోవడం కూడా జరిగింది. దీనికి సంబంధించిన వీడియో అలాగే ఫోటోలు వైరల్ గా మారాయి. ఈ వీడియో చూసిన క్రికెట్ అభిమానులు ఫిదా అయిపోతున్నారు. స్మృతి మందాన వివాహం అద్భుతంగా జరుగుతోందని కామెంట్స్ చేస్తున్నారు. మరికొంతమంది స్మృతి మందాన దంపతులకు శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నారు.

మహారాష్ట్రలోనే స్మృతి మందాన వివాహం

మహారాష్ట్ర లోని సంగ్లీ ప్రాంతంలో స్మృతి మందాన, పలాష్ ముచ్చల్ (Palash Muchhal) వివాహం జరుగుతోంది. ఇవాళ సాయంత్రం స్మృతి మందాన వివాహం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు భారీగా ఏర్పాట్లు కూడా జరిగిపోయాయి. ఇక నిన్న మొన్న హల్దీ వేడుకలతో సందడి చోటుచేసుకుంది. అటు పెళ్లికొడుకు పలాష్ ముచ్చల్ మెహందీ పెట్టుకుంటున్న నేపథ్యంలో అతనికి స్మృతి మందాన ఫుడ్ కూడా పెట్టింది. దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్ గా మారింది.

Advertisement

అంతకు ముందు హల్దీ వేడుకలలో టీమిండియా మహిళా క్రికెటర్లతో పాటు స్మృతి మందాన సందడి చేశారు. అందరూ ఎల్లో డ్రెస్ లో మెరిసి దుమ్ము లేపారు. ఇది ఇలా ఉండగా స్మృతి మందాన అలాగే పలాష్ ముచ్చల్ ఇద్దరు కూడా ఆరు సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారు. బాలీవుడ్ సింగర్ గా ఉన్న పలాష్ ముచ్చల్ మొదటిగా ప్రపోస్ చేశాడు. దీనికి స్మృతి మందాన కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వీళ్ళ డేటింగ్ మొదలైంది. ఇప్పుడు ఇరు కుటుంబాల సమక్షంలోనే వివాహం జరుగుతోంది.

Also Read: T20 World Cup 2026: ఆ రోజునే పాకిస్తాన్ వ‌ర్సెస్ ఇండియా మ‌ధ్య మ‌రోసారి మ్యాచ్‌… ఏ గ్రూపులో ఏ జట్లు ఉంటాయంటే?

 

 

 

 

Related News

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

Big Stories

Advertisement
×