E-Paper
Advertisement

VV Vinayak: ఒకప్పుడు మాస్ డైరెక్టర్… ఇప్పుడు ఛాన్స్ కోసం వెయిట్?

VV Vinayak: ఒకప్పుడు మాస్ డైరెక్టర్… ఇప్పుడు ఛాన్స్ కోసం వెయిట్?
Advertisement

VV Vinayak: వివి వినాయక్ ..ముద్దుగా వరుస విజయాల వినాయక్ అని కూడా పిలుచుకునే వారంటే సక్సెస్ స్ట్రీక్ ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు.అలా ఒకప్పుడు ఆది, దిల్ ,’ఠాగూర్’ అంటూ బాక్సాఫీస్ వద్ద తొడగొట్టిన ఈ మాస్ డైరెక్టర్ గత కొంతకాలంగా సినిమాలకి దూరంగా ఉండటంతో ఇక ఈయనగారి పని అయిపోయిందా అన్న కామెంట్లు గట్టిగానే వినిపిస్తున్నాయ్.

మెగా ఫోన్ పట్టుకోవాలని ఉవ్విళ్ళూరుతున్న వినాయక్

Advertisement

ముఖ్యంగా ఖైదీ నంబర్ 150 వంటి సాలిడ్ హిట్ ఇచ్చిన సాయి దుర్గ తేజ్ తో ఇంటిలిజెంట్(2018) అని, బెల్లంకొండ శ్రీనివాస్ ఛత్రపతి (2023)ని హిందీ రీమేక్ అంటూ ప్లాపులు మూటగట్టుకోవడం వినాయక్ కెరీర్ కి పెద్ద దెబ్బే అని చెప్పాలి.ముఖ్యంగా వినాయక్ మొదట్లో ఆయనే గ్యాప్ తీసుకున్నారని ప్రచారం జరిగినా ఆ తర్వాత హెల్త్ ఇష్యూస్ ఆయన్ని ఇండస్ట్రీకి దూరం చేసిన సంగతి తెల్సిందే.అయితే తాజాగా ఆయన పూర్తిగా క్యూర్ అయ్యి మళ్ళీ మెగా ఫోన్ పట్టుకోవాలని ఉవ్విళ్ళూరుతున్న వినాయక్ దగ్గరకు రావడానికి ఏ హీరో కూడా డేర్ చేయ్యట్లేదనే టాక్ ఫిలిం సర్కిల్స్ లో కాస్త గట్టిగానే వినిపిస్తుంది.

also read:Ram Charan Birthday Special:హ్యాపీ బర్త్ డే రామ్ చరణ్

Advertisement

అదుర్స్-2′ తీస్తారని ఆశపడ్డ ఫ్యాన్స్ కి పెద్ద షాక్  

ఇక మొన్నటి దాకా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ‘అదుర్స్-2’ తీస్తారని ఆశపడ్డ ఫ్యాన్స్ కి పెద్ద షాకే ఇచ్చాడు వినాయక్, అసలు అలాంటి ఆలోచనేమీ లేదని స్వయంగా క్లారిటీ ఇవ్వడంతో డీలా పడిపోయారు తారక్ ఫ్యాన్.అయితే ఆ మధ్య విక్టరీ వెంకటేష్ కోసం ఆకుల శివ రాసిన ఓ కామెడీ కథను పట్టుకుని వెళ్లారట వినాయక్ .కానీ వెంకీ అప్పటికే అనిల్ రావిపూడితో ‘సంక్రాంతికి వస్తున్నాం’ అంటూ కామెడీ సినిమా తీస్తున్న వెంకీ పాత చింతకాయ పచ్చడి లాంటి ఆ స్క్రిప్ట్ ని రిజెక్ట్ చేసినట్టు ఇన్ సైడ్ టాక్.

ప్లాపులకి కేరాఫ్ అయిన మెహర్ రమేశ్ కే ఛాన్స్

అయితే తాజాగా చిరుకోసం వినాయక్ తెగ ట్రై చేస్తున్నాడని , గతంలో ఠాగూర్’, ‘ఖైదీ నంబర్ 150’ లాంటి సాలిడ్ హిట్స్ ఇచ్చిన నాకు డేట్స్ ఇవ్వకుండా ఎలా ఉంటాడని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడట. అంటే ప్లాపులకి కేరాఫ్ అయిన మెహర్ రమేశ్ కే ‘భోళా శంకర్’ ఛాన్స్ ఇచ్చిన చిరంజీవి నాకు ఎందుకు అవకాశం ఇవ్వడన్నది వినాయక్ లాజిక్ కాబోలు.అయితే ఇండస్ట్రీలోకి దూసుకొస్తున్న యంగ్ బ్లడ్ తో పోలిస్తే వినాయక్ అవుట్  డేటెడ్ అయిపోయాడని, పైగా వినాయక్ లాంటి వాళ్ళ విజన్ తో ఇప్పుడు సినిమా చేయలేమని చిరు కూడా సైలెంట్ సైడ్ అయ్యాడని టాలీవుడ్ టాక్ .

పాత చింతకాయ పచ్చడి లాంటి కథలతో ఇంకెంత కాలం

అయితే ఆడియన్స్ మైండ్ సెట్ దగ్గట్టుగా సుకుమార్, రాజమౌళి, సందీప్ రెడ్డి వంగ లాంటి వాళ్ళు అప్ డేట్ అవుతుంటే ఇంకా వినాయక్ ఆ పాత చింతకాయ పచ్చడి లాంటి కథలతో ఇంకెంత కాలం సర్వైవ్ అవుతారని ఓపెన్ గా వినిపిస్తున్న కామెంట్ .ఏదేమైనా టెక్నాలజీ మారింది, నెరేషన్ మారింది.. కానీ వినాయక్ లాంటి చాల మంది అప్‌డేట్ అవ్వడం లేదన్నది వాస్తవం.

మొత్తానికి ఒకప్పుడు స్టార్ హీరోలు వినాయక్ డేట్స్ కోసం క్యూ కట్టేవారు.. కానీ ఇప్పుడు వినాయక్ హీరోల ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చేసిందన్న మాట. మరి ఇప్పటికైనా అప్ డేట్ అయ్యి ఏదైనా మ్యాజిక్ చేస్తాడా లేక గతం చెప్పుకునే కాలం వెళ్ళదీస్తాడా చూడాలి !

also read:Relationship Secrets: ప్రేమలో ఉన్నారా ..అయితే ఈ పొరపాట్లు చేస్తున్నారేమో చెక్ చేసుకోండి.

Related News

ఏడేళ్ల వయసులోనే సాఫ్ట్వేర్ సంస్థకు యజమాని.. ‘జైలర్’ బుడ్డోడు చిన్నోడు కాదండోయ్!

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

Big Stories

Advertisement
×