How To Lose Belly Fat: ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్య ‘బెల్లీ ఫ్యాట్’. కూర్చుని పని చేసే లైఫ్ స్టైల్, జంక్ ఫుడ్ అలవాట్లు పొట్ట పెరగడానికి ప్రధాన కారణాలు. కేవలం ఏడు రోజుల్లోనే పొట్టను పూర్తిగా తగ్గించడం అసాధ్యం కావచ్చు. కానీ సరైన పద్ధతులు పాటిస్తే.. వారం రోజుల్లోనే మీ శరీరంలో మార్పును గమనించవచ్చు. బరువు తగ్గడం అనేది ఒక క్రమ శిక్షణతో.. కూడిన ప్రక్రియ. మీ ఆహారపు అలవాట్లు, వ్యాయామంలో.. చిన్న చిన్న మార్పులు చేయడం ద్వారా ఫ్లాట్ టమ్మీని ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం..
వారం రోజుల్లో పొట్ట తగ్గించుకోవడం ఎలా ?
పొట్ట దగ్గర కొవ్వు పెరగడం వల్ల మనకు నచ్చిన బట్టలు సరి పోకపోవడమే కాకుండా.. డయాబెటిస్, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే.. ప్రమాదం ఉంది. వారం రోజుల్లోనే మీ బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడానికి ఈ కింది పద్ధతులను పాటించండి.
1. చక్కెర, తీపి పదార్థాలకు స్వస్తి :
బొడ్డు కొవ్వు పెరగడానికి ప్రధాన శత్రువు చక్కెర. కూల్ డ్రింక్స్, స్వీట్లు, ప్రాసెస్ చేసిన ఆహారంలో.. ఉండే అధిక చక్కెర నేరుగా పొట్ట భాగంలో.. కొవ్వుగా మారుతుంది. ఈ వారం రోజులు మీరు వీటికి పూర్తిగా దూరంగా ఉండాలి. వీటికి బదులుగా తాజా పండ్లు తీసుకోండి.
2. ప్రోటీన్, ఫైబర్ పెంచండి:
మీ భోజనంలో ప్రోటీన్ (పప్పులు, గుడ్లు, పాలు) ఎక్కువగా ఉండేలా చూసుకోండి. ప్రోటీన్ తింటే.. ఆకలి త్వరగా వేయదు. దీని వల్ల మీరు అనవసరమైన స్నాక్స్ తినడం మానేస్తారు. అలాగే.. కూరగాయలు, పీచు పదార్థం ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణ క్రియ మెరుగు పడి పొట్ట ఉబ్బరం తగ్గుతుంది.
3. నీరు – మీ బెస్ట్ ఫ్రెండ్:
బరువు తగ్గడానికి నీరు అద్భుతంగా పని చేస్తుంది. భోజనానికి అరగంట ముందు గ్లాసు నీరు తాగడం.. వల్ల మీరు తక్కువ ఆహారం తీసుకుంటారు. రోజుకు కనీసం 3 నుంచి 4 లీటర్ల నీరు తాగాలి. ముఖ్యంగా పరగడుపున గోరు వెచ్చని నీటిలో.. కొంచెం నిమ్మ రసం, తేనె కలుపుకుని తాగితే.. మెటబాలిజం వేగవంతం అవుతుంది.
4. కార్డియో, కోర్ వ్యాయామాలు:
వ్యాయామం లేకుండా.. కొవ్వు కరిగించడం కష్టం. వారం రోజులు ప్రతి రోజూ కనీసం 30 నుంచి 45 నిమిషాల పాటు వేగంగా నడవడం, పరిగెత్తడం లేదా సైక్లింగ్ చేయండి. వీటితో.. పాటు పొట్ట కండరాలపై.. ఒత్తిడి తెచ్చే వ్యాయామాలు చేస్తే.. ఫలితం త్వరగా ఉంటుంది.
5. రాత్రి భోజనం త్వరగా ముగించండి:
చాలా మంది చేసే.. పొరపాటు రాత్రి ఆలస్యంగా భోజనం చేయడం. నిద్ర పోవడానికి కనీసం 2-3 గంటల ముందే భోజనం పూర్తి చేయాలి. రాత్రి పూట చాలా తేలిక పాటి ఆహారం (సూప్స్ లేదా సలాడ్స్) తీసుకోవడం వల్ల.. శరీరం నిద్రలో కొవ్వును కరిగించే పనిపై దృష్టి పెడుతుంది.
Also Read: మీరు సరిగ్గా నిద్రపోకపోవడానికి కారణం.. ఈ సమస్యలే!
6. ఒత్తిడి తగ్గించుకోండి:
మీరు ఎంత కష్టపడినా.. సరిగ్గా నిద్ర పోకపోతే బరువు తగ్గడం కష్టం. తక్కువ నిద్ర, ఎక్కువ ఒత్తిడి వల్ల శరీరంలో.. ‘కార్టిసాల్’ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఇది పొట్ట దగ్గర కొవ్వును పెంచుతుంది. కాబట్టి రోజుకు 7-8 గంటల ప్రశాంతమైన నిద్ర అవసరం.
7. ఉప్పు వాడకం తగ్గించండి:
ఉప్పు శరీరంలో.. నీటిని నిలిపి ఉంచుతుంది. దీని వల్ల పొట్ట ఉబ్బినట్లుగా కనిపిస్తుంది. ఆహారంలో ఉప్పును తగ్గిస్తే.. మీ శరీరం అదనపు నీటిని బయటకు పంపిస్తుంది. తద్వారా వారం చివరకి మీరు సన్నగా కనిపిస్తారు.
ఈ ఏడు రోజుల ప్లాన్ మీ శరీరానికి ఒక మంచి ఆరంభాన్ని ఇస్తుంది. అయితే.. వారం తర్వాత మళ్ళీ పాత అలవాట్లకు వెళ్ళి పోతే.. ఫలితం ఉండదు. ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పని వ్యాయామం మీ జీవితంలో భాగం కావాలి.