Sai Dharam Tej: మెగా కాంపౌండ్ నుంచి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన వారిలో సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) ఒకరు. ప్రస్తుతం ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్న సాయి ధరమ్ తేజ్ నేడు తన పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. ఇలా తన పుట్టినరోజు వేడుకలలో భాగంగా సాయి ధరమ్ తేజ్ అభిమానులతో కలిసి సరదాగా ముచ్చటించారు. ఈ నేపథ్యంలోనే పలు మంచి పనులకు కూడా శ్రీకారం చుట్టారు. అయితే ఈ ఫ్యాన్స్ మీట్ కార్యక్రమంలో భాగంగా సాయిధరమ్ తేజ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ ఫ్యాన్స్ మీట్ కార్యక్రమంలో భాగంగా ఒక అభిమాని సాయి ధరంతేజ్ తో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తో మీ సినిమా ఎప్పుడు ఉంటుంది అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సాయి ధరమ్ తేజ్ సమాధానం చెబుతూ.. పవన్ కళ్యాణ్ గారితో కలిసి తాను బ్రో సినిమా(Bro Movie) చేశాను బ్రో. ఈ సినిమా మీరు చూడకపోతే కనుక ఓటీటీలో సినిమా అందుబాటులో ఉంటుంది వెళ్లి ఒకసారి చూడండి అంటూ సాయి ధరమ్ తేజ్ తెలిపారు. అయినా ఈ సినిమా విషయంలో తప్పు మాదే మేము ఈ సినిమా సరిగ్గా ప్రమోట్ చేయలేదు అందుకే ఈ సినిమా గురించి పెద్దగా ఎవరికి తెలియడం లేదు అంటూ సాయి ధరమ్ తేజ్ తెలిపారు.
ఇలా పవన్ కళ్యాణ్ సినిమా విషయంలో తప్పు మాదే అంటూ ఈయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక వీరిద్దరి కాంబినేషన్లో సముద్రఖని డైరెక్షన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ విడుదల అయినప్పటికీ పెద్దగా ప్రేక్షకుల అంచనాలను మాత్రం చేరుకోలేకపోయింది. ఇక సాయిధరమ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా నేడు ఈయన తన కొత్త సినిమాని ప్రకటించారు. ఇక ప్రస్తుతం సాయి తేజ్ సంబరాల యేటిగట్టు(SYG) అనే సినిమా పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.
ఇక పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికి వస్తే.. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే సినిమాలకు కొంచెం విరామం ప్రకటించారు అయితే ఈయన గతంలో కమిట్ అయిన సినిమాలో షూటింగ్లను పూర్తి చేసి విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా(OG Movie) ఎంతో మంచి సక్సెస్ అందుకుంది ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు సీక్వెల్ చిత్రాన్ని కూడా ప్రకటించారు. ఇక ప్రస్తుతం డైరెక్టర్ సుజిత్ నాని బ్లడీ రోమియో సినిమా పనులలో బిజీగా ఉండటంవల్ల ఓజీ 2 రావడానికి మరింత ఆలస్యం అవుతుందని తెలుస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ సైతం ప్రస్తుతం ఆయన రాజకీయ కార్యకలాపాలలో ఎంతో బిజీగా ఉన్నారు.
Also Read: నా బెడ్ రూమ్ లో దెయ్యాలున్నాయి…షాకింగ్ విషయాన్ని బయటపెట్టిన హీరో!