E-Paper
Advertisement

4 నిమిషాల నాన్‌స్టాప్ కామెడీ.. అక్షయ్ ‘వెల్‌కమ్ టు ది జంగిల్’ ట్రైలర్ సెన్సేషన్..

4 నిమిషాల నాన్‌స్టాప్ కామెడీ.. అక్షయ్ ‘వెల్‌కమ్ టు ది జంగిల్’ ట్రైలర్ సెన్సేషన్..
Advertisement

Welcome Jungle: అక్షయ్ కుమార్…బాలీవుడ్ ఖిలాడీగా పేరు గాంచిన ఈ వెటరన్ స్టార్ ఇపుడు మరోసారి నవ్వుల వర్షం కురిపిస్తానంటూ రెడీ అయిపోయాడు.ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘వెల్‌కమ్ టు ది జంగిల్’ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ విడుదల చేసిన క్రేజీ ట్రైలర్ సోషల్ మీడియాని షేక్ చేస్తోంది.

దాదాపు నాలుగు నిమిషాల లెంత్ ఉన్న ఈ ట్రైలర్ ఫుల్-టు-ఫుల్ కామెడీ, మైండ్ బ్లోయింగ్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో కూడిన ఒక పర్ఫెక్ట్ నవ్వుల రైడ్‌లా సాగింది. ఐకానిక్ ‘వెల్‌కమ్’ ఫ్రాంచైజీలో వస్తున్న ఈ మూడో భాగం థియేటర్లలో ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని పంచబోతోందని ట్రైలర్ చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది.

థియేటర్లలో నవ్వుల పువ్వులు పూయించడం ఖాయం

Advertisement

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లకు సాలిడ్ క్రేజ్ ఉంటుంది.ముఖ్యంగా బాలీవుడ్ క్లాసిక్ కామెడీ చిత్రం ‘హేరా ఫేరి’ (2000) మరియు దాని సీక్వెల్ ‘ఫిర్ హేరా ఫేరి’ (2006) చిత్రాలలో అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి, పరేష్ రావల్ ల కెమిస్ట్రీ ఎలాంటి సంచలనాలు సృష్టించిందో చెప్పక్కర్లేదు.ఇప్పుడు దాదాపు రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ నవ్వులు పూయిస్తాం అంటూ అదే కాంబో మరోసారి ఎంట్రీ ఇస్తుంది.ఇక వీరి ముగ్గురి టైమింగ్, సిట్యుయేషనల్ కామెడీ థియేటర్లలో నవ్వుల పువ్వులు పూయించడం ఖాయంగా కనిపిస్తోంది.
also read :బాలయ్య సినిమాలో పవర్‌ఫుల్ విలన్‌గా రాజశేఖర్?.. కొరటాల శివ స్కెచ్ మామూలుగా లేదుగా!

గతంలో 2007లో వచ్చిన ‘వెల్‌కమ్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంతటి భారీ విజయాన్ని అందుకుందో తెలిసిందే. ఆ తర్వాత 2015లో ‘వెల్‌కమ్ బ్యాక్’ పేరుతో వచ్చిన సీక్వెల్ కూడా ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు ఆ సక్సెస్‌ఫుల్ ఫ్రాంచైజీని మరింత గ్రాండ్‌గా, విజువల్ వండర్‌గా ముందుకు తీసుకెళ్లేందుకు సిద్దమైపోయాడు దర్శకుడు అహ్మద్ ఖాన్. ప్రముఖ నిర్మాత ఫిరోజ్ ఎ. నడియాద్వాలా అత్యంత భారీ బడ్జెట్‌తో, ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ట్రైలర్‌లో కనిపించిన రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్, జంగిల్ బ్యాక్‌డ్రాప్ సెట్టింగ్స్ ఈ సినిమా రేంజ్‌ను చెప్పకనే చెబుతున్నాయి.

సినిమాలో భారీ స్టార్ క్యాస్టింగ్ 

Advertisement

ఇక ఈ సినిమాలో అక్షయ్ కుమార్‌తో పాటు టాలెంటెడ్ యాక్టర్స్ సునీల్ శెట్టి, అర్షద్ వార్సి, పరేష్ రావల్, కామెడీ లెజెండ్స్ జానీ లీవర్, రాజ్‌పాల్ యాదవ్, శ్రేయాస్ తల్పడే తమదైన కామెడీతో అలరించనున్నారు. ఇక గ్లామర్ డోస్ పెంచేందుకు దిశా పటాని, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, సీనియర్ బ్యూటీలు రవీనా టాండన్, లారా దత్తా నటిస్తున్నారు. వీరితో పాటు ప్రముఖ పాప్ సింగర్ దలేర్ మెహందీ కూడా ఒక ప్రత్యేక పాత్రలో మెరవడం విశేషం. ఇంతమంది స్టార్స్ ఒకే స్క్రీన్‌పై కనిపిస్తే ఆ హంగామా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

also read :అరిచే కుక్కలు కరవవు.. ‘పోలీస్ కంప్లైంట్’ డైరెక్టర్‌కు వరలక్ష్మి శరత్ కుమార్ పవర్‌ఫుల్ పంచ్!
ఇప్పటికే బాలీవుడ్‌లో అక్షయ్ కుమార్ నటించిన ‘హౌస్‌ఫుల్’ సిరీస్, ‘భూల్ భులయ్యా’ లాంటి సినిమాలు కామెడీ జానర్‌లో ట్రెండ్ సెట్ చేశాయి. ఆ కోవలోనే ఇప్పుడు ‘వెల్‌కమ్ టు ది జంగిల్’ కూడా నిలుస్తుందని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అన్ని హంగులతో సిద్ధమైన ఈ క్రేజీ అండ్ హిలేరియస్ కామెడీ ఎంటర్‌టైనర్ జూన్ 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.చూడాలి మరి సూపర్ హిట్ కాంబోలో వస్తున్న ఈ సినిమా మళ్ళీ ఆ మ్యాజిక్ రిపీట్ చేస్తుందో లేదో !

Related News

నాని ది ప్యారడైజ్ నుంచి బిగ్ అప్డేట్.. టీజర్ విడుదల ఎప్పుడంటే?

జనాలను పిచ్చోళ్లని చేస్తున్నారా.. చెన్నై లవ్ స్టోరీ టీమ్ పై నెటిజన్స్ ఫైర్!

సినిమా తీయాలి.. గివ్ అవేలు ఇవ్వాలి.. ఏమీ టైం సర్ ఇది.. ఏమీ ప్రమోషన్!

రూ.కోటి విలువ చేసే టికెట్లు ఫ్రీగా పంచిపెట్టిన హీరో.. అసలు నిజం తెలిస్తే షాక్!

గౌతమ్ హీరోగా ఇండస్ట్రీ ఎంట్రీ అప్పుడే.. జయకృష్ణ క్లారిటీ!

నరేష్ మాటలకు స్టేజ్ దిగి వెళ్లిపోయిన బ్రహ్మాజీ.. అంత మాట అనేశాడు ఏంటి?

బాలకృష్ణను పరామర్శించిన ఏపీ ముఖ్యమంత్రి!

వివాదంలో చిక్కుకున్న నోలన్ ‘ది ఒడిస్సీ’ మూవీ.. 2వేల కోట్ల మూవీకి 6 లక్షలు ఇవ్వలేరా?

Big Stories

Advertisement
×