E-Paper
Advertisement

అరిచే కుక్కలు కరవవు.. ‘పోలీస్ కంప్లైంట్’ డైరెక్టర్‌కు వరలక్ష్మి శరత్ కుమార్ పవర్‌ఫుల్ పంచ్!

అరిచే కుక్కలు కరవవు.. ‘పోలీస్ కంప్లైంట్’ డైరెక్టర్‌కు వరలక్ష్మి శరత్ కుమార్ పవర్‌ఫుల్ పంచ్!
Advertisement

Varalaxmi Controversy: కాంట్రవర్సీలు ఇండస్ట్రీకి కొత్తేం కాదు.నటీనటులకి , దర్శకులకి,నిర్మాతలకి ..ఇలా ఎవరికో ఒకసారి ఎప్పుడో సారి గొడవలు జరగడం ఇక్కడ చూస్తూనే ఉంటాం తాజాగా నవీన్ చంద్ర, వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘పోలీస్ కంప్లైంట్’ సినిమా చుట్టూ కమ్ముకున్న కాంట్రవర్సీ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.

సినిమా జూన్ 12న థియేటర్లలోకి రాబోతున్న ఈ సమయంలో డైరెక్టర్ సంజీవ్ వరలక్ష్మి పై చేసిన కామెంట్స్,దానికి వరలక్ష్మి శరత్ కుమార్ ఇచ్చిన కౌంటర్స్ ఇపుడు నెట్టింట హైలెట్ అవుతుంది. సాధారణంగా సినిమా ప్రమోషన్స్ కోసం వివాదాలు సృష్టిస్తారనే టాక్ ఉంది.కానీ ఇపుడు ఈ ఇద్దరి మధ్య జరుగుతున్న మాటల యుద్ధం చూస్తుంటే ఇది కేవలం పబ్లిసిటీ స్టంట్ మాత్రమే కాదనే విషయం స్పష్టమవుతోంది.

ప్రమోషన్స్ కి రమ్మని అడుక్కున్నానన్న సంజీవ్ మేగోటి

Advertisement

సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో దర్శకుడు సంజీవ్ మేగోటి మైక్ పట్టుకుని తన ఆవేదననంతా వెళ్లగక్కడం ఇండస్ట్రీని షాక్‌కు గురిచేసింది. క్రమశిక్షణ విషయంలో వరలక్ష్మిని చాలామంది ‘లేడీ బాలయ్య’ అని పిలుస్తారని విన్నానని, షూటింగ్ సమయంలో ఆమె బాగానే సహకరించినప్పటికీ ప్రమోషన్స్ విషయంలో మాత్రం తమకు నరకం చూపించిందని ఆయన ఆరోపించారు. పూర్తి రెమ్యూనరేషన్ తీసుకుని కూడా పబ్లిసిటీ ఈవెంట్లకు రావడం లేదని, ప్రమోషన్స్ కి రమ్మని అడుక్కున్నా టైమ్ లేదని చెప్పిందని మండిపడ్డారు.

also read :‘దృశ్యం 3’లో కనిపించిన నంబర్ ప్లేట్ అసలెవరిది? కేరళలో హాట్ టాపిక్‌గా మారిన వివాదం

Advertisement

అంతేకాదు, మూడు నెలల పాటు డబ్బింగ్ చెప్పకుండా ఏడిపించిందని, ఆ గ్యాప్‌లో ఆమె స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సరస్వతి’ అనే సినిమాను పూర్తి చేసుకుందని సంజీవ్ పేర్కొన్నారు. రామ్ చరణ్ లాంటి గ్లోబల్ స్టార్స్, 94 ఏళ్ల వయసులోనూ లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు లాంటి వాళ్లే తమ సినిమాలను ప్రమోట్ చేసుకుంటుంటే, వరలక్ష్మికి అంత అహంకారం ఏంటని ఆయన నేరుగానే ప్రశ్నించడం సంచలనంగా మారింది. ఆమె ప్రవర్తన వల్ల సినిమాకు భారీ నష్టం వాటిల్లిందని ఆయన ఆవేదన చెందారు.

ఘాటుగా స్పందించిన వరలక్ష్మి 

ఈ ఆరోపణలు మీడియాలో వైరల్ కావడంతో అందరి దృష్టి వరలక్ష్మి వైపు మళ్లింది. గతంలో ‘క్రాక్’, ‘నాంది’, ‘వీరసింహారెడ్డి’, ‘హనుమాన్’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో పవర్‌ఫుల్ పాత్రలతో మెప్పించి, తాజాగా ‘శబరి’,సరస్వతి చిత్రాలతో  అలరించిన ఈ కోలీవుడ్ భామ తనదైన శైలిలో ఘాటుగా స్పందించింది. వివాదాన్ని మరింత పెద్దది చేయడం ఇష్టం లేదని చెప్తూనే, తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక సాలిడ్ పోస్ట్ పెట్టింది.

వాళ్లకు అవసరమైనప్పుడల్లా తాను అందుబాటులోనే ఉన్నానని, సినిమాకు సంబంధించిన ప్రతి ఈవెంట్ కి హాజరయ్యానని క్లారిటీ ఇచ్చింది. ఇటీవలి ఈవెంట్ లో దర్శకుడు ఏం మాట్లాడారో తనకు పూర్తిగా తెలియదని, కొన్ని విషయాల్లో నాకంటూ సొంత అభిప్రాయాలు ఉంటాయని, అందుకే వారు చేస్తోన్న ఆరోపణల గురించి బహిరంగంగా చర్చించి టైమ్ వేస్ట్ చేయదలుచుకోలేదని స్పష్టం చేసింది.

అరిచే కుక్కలు కరవవు .. నేను అరవను, కరుస్తా

అయితే అంతటితో ఆగకుండా వరలక్ష్మి షేర్ చేసిన మరో క్రేజీ కొటేషన్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. “అరిచే కుక్కలు కరవడం చాలా అరుదు.. నేను అరవను, కరుస్తా” అంటూ ఆమె పెట్టిన పోస్ట్ నేరుగా దర్శకుడు సంజీవ్ మేగోటిని ఉద్దేశించిందేనని నెటిజన్లు ఫిక్స్ అయిపోయారు. తాను అందరిలా అనవసర ఆరోపణలు చేయనని, తన పని తాను చూసుకుంటూ సైలెంట్‌గా వెళ్లిపోతానని పరోక్షంగా గట్టి కౌంటర్ ఇచ్చింది.

ఈ వివాదం కారణంగా జూన్ 12న విడుదల కానున్న ‘పోలీస్ కంప్లైంట్’ సినిమాపై ప్రేక్షకుల్లో విపరీతమైన క్యూరియాసిటీ పెరిగిపోయింది. నెటిజన్లు మాత్రం ఈ ఇద్దరి మధ్య జరుగుతున్న కోల్డ్ వార్‌పై భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు దర్శకుడి వాదనను సమర్థిస్తుంటే, మరికొందరు వరలక్ష్మి వైపు నిలుస్తున్నారు. ఏదేమైనా, సినిమా విడుదలకు ముందు మొదలైన ఈ మాటల యుద్ధం సినిమాకు గట్టి ప్రచారాన్నే తెచ్చిపెట్టిందనే చెప్పాలి.

also read :రణ్‌వీర్ సింగ్ బాక్సాఫీస్ సునామీ.. ‘పుష్ప-2’ రికార్డులను తిరగరాసిన ‘దురంధర్-2’

Related News

ప్రస్తుత పరిస్థితులే నన్ను రాజకీయాల వైపు నడిపించాయి: రాఘవ లారెన్స్

పెళ్లి రోజున కవల పిల్లల మొదటి ఫోటో షేర్ చేసి ఉపాసన ఎమోషనల్..

‘విశ్వంభర’ సమ్మర్ మిస్.. దసరా రేసులోకి మెగాస్టార్? సస్పెన్స్‌లో ఫ్యాన్స్!

‘లగాన్’ 25 ఏళ్ల వేడుక.. సరికొత్త లుక్‌లో సల్మాన్ ఖాన్.. కరీనా, జూహీ చావ్లా సందడి!

ఆ బుల్లితెర నటికి ఆడపిల్ల.. సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు!

మెగాస్టార్ సంచలన వ్యాఖ్యలు.. ‘దంగల్’ కంటే రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాకే ఎక్కువ ఆదరణ!

‘కాక్‌టెయిల్ 2’ ఈవెంట్‌లో రష్మికకు రక్షణగా నిలిచిన బాలీవుడ్ నటి.. అసలు ఏం జరిగిందంటే?

ప్రతిభావంతులైన విద్యార్థులకు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న సత్కారం..

Big Stories

Advertisement
×