E-Paper
Advertisement

Aadarsha Kutumbam Ak 47: వెంకీ-త్రివిక్రమ్ కాంబోపై పెరుగుతున్న హైప్..రిలీజ్ ఎప్పుడంటే..?

Aadarsha Kutumbam Ak 47: వెంకీ-త్రివిక్రమ్ కాంబోపై పెరుగుతున్న హైప్..రిలీజ్ ఎప్పుడంటే..?
Advertisement

Aadarsha Kutumbam Ak 47: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాలకు కేరాఫ్ విక్టరీ వెంకటేష్.. ఈమధ్య ఈయన నటించిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయని సొంతం చేసుకుంటుంది. వయసు పెరుగుతున్నా ఆయన ఇమేజ్‌కి, నటనకు ఏమాత్రం తగ్గుదల లేకుండా వరుసగా ప్రేక్షకులను అలరిస్తుండటం విశేషం. గత ఏడాది సంక్రాంతికి వస్తున్నాం మూవీతో బిగ్గెస్ట్ కొట్టాడు. ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకరవరప్రసాద్ గారు మూవీ గెస్ట్ రోల్లో నటించాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ కాంబోలో ఆదర్శ కుటుంబం చిత్రంలో నటిస్తున్నాడు. ఈ మూవీ రిలీజ్ డేట్ పై వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది.. ఎప్పుడు రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం..

వెంకీ ‘ఆదర్శ కుటుంబం’ రిలీజ్ డేట్..? 

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వెంకటేశ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీనే ఇది. నువ్వు నాకు నచ్చవ్’, ‘మల్లీశ్వరి’ వంటి హిట్ చిత్రాలకు రైటర్-హీరో కాంబోగా కలిసి పనిచేసిన వీరిద్దరూ ఇప్పుడు డైరెక్టర్-హీరోగా మొదటిసారి చేయబోతున్నారు. ఈ మూవీ పై రోజు రోజుకు అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి. ఇటీవల విడుదలైన టైటిల్ అనౌన్స్‌మెంట్, ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రెట్టింపు చేశాయి.. నాన్యత విషయంలో ఎక్కడా తగ్గకుండా త్రివిక్రమ్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ మూవీ రిలీజ్ డేట్ గురించి గత కొన్ని రోజులుగా ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. తాజాగా మూవీ నుంచి ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఈ సినిమాను ఈ ఏడాది గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న థియేటర్లలో రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందులో నిజం ఎంత ఉందో తెలియాలంటే మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసే వరకు వెయిట్ చేయాల్సిందే..

Advertisement

Also Read : సూపర్ రన్ టైంతో వస్తున్న ‘ఫంకీ’.. విశ్వక్ ఈసారి కొట్టేస్తాడా..?

షూటింగ్ అందుకే లేట్ అవుతుందా..? 

త్రివిక్రమ్ మూవీలలో ఒక మార్క్ ఉంటుంది. పవర్ ఫుల్ డైలాగులతో, కామెడీ పంచులతో ప్రేక్షకులతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా సినిమా ఉంటుంది. హీరోయిన్‌గా శ్రీనిధి శెట్టి నటిస్తుండగా, నారా రోహిత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆయన పాత్రకు ప్రత్యేకమైన ట్రాక్ ఉంటుందని సమాచారం.. ఇదిలా ఉండగా.. త్రివిక్రమ్ టెక్నికల్ టీమ్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు తెలుస్తోంది. షూటింగ్ మధ్యలో సినిమాటోగ్రాఫర్, ఆర్ట్ డైరెక్టర్ మార్పులు జరిగినట్లు సమాచారం.. మరో ఆర్ట్ డైరెక్టర్ తో సెట్ వేయినట్లు తెలుస్తుంది. అందుకే షూటింగ్ కాస్త ఆలస్యం అయ్యినట్లు తెలుస్తుంది.. ఈ మూవీ హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తుండగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో పాటు క్రైమ్ ఎలిమెంట్స్‌ను కూడా చూపించనున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రాజెక్ట్‌తో పాటు వెంకటేశ్ రెమ్యునరేషన్‌పై కూడా ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.. ప్రస్తుతం ఈ సినిమా కోసం హీరో వెంకటేష్ దాదాపు 20 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తుంది.. మరి ఈ సినిమా అక్టోబర్ 2న రిలీజ్ అవుతుందా అనేది త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు టాక్..

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×