HBD Mokshagna: నందమూరి అభిమానులు ఎంతో కాలంగా కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న మోక్షజ్ఞ సినీ అరంగేట్రంపై ఎట్టకేలకు ఒక సాలిడ్ అప్‌డేట్ వచ్చింది. నేడు (సెప్టెంబర్ 6) ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ డెబ్యూ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం. బాలకృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీలోకి రాబోతున్న మోక్షజ్ఞ ఎంట్రీ కోసం పక్కా ప్లాన్ సిద్ధమైంది. ఈ రోజైనా ఆయన కొత్త మూవీ అనౌన్స్‌మెంట్‌కు మోక్షం లభిస్తుందో లేదో చూడాలి?
నందమూరి నటసింహం బాలకృష్ణ తండ్రికి తగ్గ తనయుడిగా తన పవర్ ఫుల్ డైలాగ్స్, మాస్ ఇమేజ్‌తో ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన వారసుడిగా మోక్షజ్ఞ ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడా అని గత కొన్నేళ్లుగా రకరకాల రూమర్లు ప్రచారంలో ఉన్నాయి. గతంలో ప్రశాంత్ వర్మ కాంబినేషన్‌లో సినిమా ఉంటుందని టాక్ వచ్చినా అది పట్టాలెక్కలేదు. దాంతో ఈసారి బాలయ్య చాలా గట్టి ప్రణాళికతో ముందడుగు వేస్తున్నారు.
ఈసారి మోక్షజ్ఞ ఎంట్రీ ఊరికే ఉండబోవడం లేదని తెలుస్తోంది. ‘బింబిసార’, ‘విశ్వంభర’ చిత్రాలతో తన సత్తా చాటుకున్న దర్శకుడు వశిష్ఠ దర్శకత్వంలో మోక్షజ్ఞ అరంగేట్రం దాదాపు ఖరారైంది. ఇక ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ భారీ ప్రాజెక్ట్‌ను నిర్మించడానికి ముందుకు వచ్చారని సమాచారం.
also read:“దుష్టశక్తుల కళ్ళన్నీ నాపైనే”.. మరో సంచలన వీడియోతో అనసూయ!
ఈరోజే మోక్షజ్ఞ బర్త్‌డే కావడంతో ఈ డెబ్యూ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించి అభిమానులకు పండగ లాంటి వార్త అందిస్తారని విపరీతంగా ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా, రాబోయే దసరా పండుగ సందర్భంగా ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో చాలా ఘనంగా లాంచ్ చేయడానికి ముహూర్తం ఖరారు చేశారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
కేవలం మోక్షజ్ఞ బర్త్‌డే అనౌన్స్‌మెంట్ మాత్రమే కాకుండా, బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘NBK111’ ఆఫీషియల్ అప్‌డేట్ కూడా ఈరోజే రాబోతున్నట్లు టాక్. ఇక గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ మరియు విడుదల తేదీని ఈరోజే వెల్లడించనున్నారట. ఇక దీంతో నందమూరి అభిమానులకు ఇది ఒక రకంగా డబుల్ ట్రీట్ అని చెప్పవచ్చు.
తెలుగు చిత్రసీమలోకి అడుగుపెడుతున్న నందమూరి నట వారసుడు మోక్షజ్ఞకు పుట్టినరోజు శుభాకాంక్షలు! ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఆ క్షణం ఈరోజే రాబోతుందా లేదా అనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. ఇక వశిష్ఠ, దిల్ రాజుల క్రేజీ కాంబినేషన్లో రాబోయే ఈ చిత్రం మోక్షజ్ఞ కెరీర్‌కు ఎలాంటి ఊపునిస్తుందో వేచి చూడాల్సిందే.