E-Paper
Advertisement

తమిళ్ ఇండస్ట్రీలో మళ్లీ ‘మీటూ’ మంటలు.. బాంబు పేల్చిన సింగర్!

తమిళ్ ఇండస్ట్రీలో మళ్లీ ‘మీటూ’ మంటలు.. బాంబు పేల్చిన సింగర్!
Advertisement

Swagatha Krishnan:కోలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఓ సింగర్ వేసిన ఒక్క ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ పెద్ద చర్చకు దారితీసింది. ప్రముఖ గాయని స్వగత కృష్ణన్ పేరు చెప్పకుండా చేసిన కొన్ని కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఓ వ్యక్తిపై కొంతమంది మహిళలు తీవ్రమైన ఆరోపణలు చేసినా.. అతడికి సినీ పరిశ్రమలో ఇంకా సపోర్ట్, గౌరవం, అవకాశాలు ఎలా దక్కుతున్నాయంటూ ఆమె ప్రశ్నించారు.

Advertisement

లైంగిక వేధింపులు, బెదిరింపులు, బ్లాక్‌మెయిల్‌, బలవంతపు మత మార్పిడి వంటి ఆరోపణలు ఉన్న వ్యక్తి తనకున్న పేరుప్రతిష్టల గురించి ఇంటర్వ్యూలు ఇవ్వడం ఏంటని ఆమె నిలదీస్తుంది.అయితే స్వగత తన తాజా పోస్టులో ఎవరి పేరును వెల్లడించకపోవడం గమనార్హం..

అయితే ఇది స్వగత నుంచి వచ్చిన మొదటి ఆరోపణ కాదు. 2026 ఏప్రిల్‌లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె ఓ మ్యూజిక్ కంపోజర్ స్టూడియోలో తనకు ఎదురైన దారుణమైన అనుభవం గురించి మాట్లాడారు. సౌండ్‌ప్రూఫ్ గదిలో జరిగిన ఘటనను ఆమె వివరించడంతో అప్పట్లోనే ఈ విషయం తమిళ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

Advertisement

అక్కడ సీసీటీవీ, రికార్డింగ్ లు ఉన్నాయని , ఆ ఫుటేజ్‌ను ఉపయోగించి బెదిరింపులకు పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. తనకు మాత్రమే కాకుండా మరికొందరు మహిళలకు కూడా ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని స్వగత చెప్పింది కూడా.ఇక ఈ ఘటన తర్వాత చెన్నైని విడిచి రిషికేశ్‌కు వెళ్లినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి కూడా.

స్వగత కృష్ణన్ ..విషయానికి వస్తే ఈమె తమిళ సినిమా మ్యూజిక్‌లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ప్లేబ్యాక్ సింగర్ . 2019లో వచ్చిన ‘ఇస్పేడ్ రాజావుమ్ ఇదయ రాణియుమ్’ సినిమాలోని ‘యెనో పెన్నే ’ పాటతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత 2021లో ‘బ్యాచిలర్’ సినిమాలోని ‘కాదల్ కన్మణి పాట కూడా ఆమె కెరీర్‌లో చెప్పుకోదగ్గ పాటగా నిలిచింది. ఇక 2025లో వచ్చిన ‘కాయల్ సినిమాలోని ‘తెంజోమోహి పాట కూడా మంచి పేరు తెచ్చిందే.

ఇలా ఆమె మ్యూజిక్ జర్నీలో తమిళ సినిమాలతో పాటు ఇతర మ్యూజిక్ ప్రాజెక్టుల్లోనూ భాగమయ్యారు. అందుకే తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు బయటకు రావడంతో ఒక్కసారిగా కోలీవుడ్ అలెర్ట్ అయిపొయింది.

మరోవైపు 2025 సెప్టెంబర్ 12న విడుదలైన ‘కాయల్ ’ సినిమాతో స్వగత నటిగానూ కనిపించారు.

అయితే ఇప్పుడు ఆమె పెట్టిన తాజా స్టోరీలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి చుట్టూ ఉన్న పీఆర్ , అతడికి లభిస్తున్న మద్దతు, అతడి గురించి జరుగుతున్న పబ్లిక్ డిస్కషన్‌ను స్వగత ప్రశ్నించినట్టుగా తన పోస్ట్ చూస్తే అర్థమవుతుంది.

ముఖ్యంగా ఆరోపణలు చేసిన మహిళల మాటలకు ఎంత విలువ ఇస్తున్నారు? ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి మాత్రం కెరీర్, ఇమేజ్, పబ్లిక్ సపోర్ట్ ఎందుకు కొనసాగుతోంది? అన్నది ఆమె పోస్ట్ లో ప్రధానంగా ఉన్న అంశం.

Also read :ఎన్టీఆర్–నీల్ మూవీ.. హైప్ ఎక్కువైపోతుందా?

ఇక్కడ మరో విషయం సోషల్ మీడియాలో తన తాజా స్టోరీ చివర్లో స్వగత ‘Next..’ అంటూ ఆపేశారు. అంతే.. . తర్వాతి పోస్టులో పేరు చెబుతారా? మరిన్ని ఆధారాలు బయటపెడతారా? లేక గతంలో తాను చెప్పిన విషయాలపై మరింత క్లారిటీ ఇస్తారా? అనే చర్చ మొదలైంది.చూడాలి మరి ముందు ముందు ఈ కోలీవుడ్ మల్టీ టాలెంటెడ్ ఇంకెన్ని సంచలనాలకి తెర తీస్తుందో !

Tags

Related News

కళ్ళుచెదిరే రేంజ్ లో ” వారణాసి” తెలుగు థియేట్రికల్ బిజినెస్.. టాలీవుడ్ లోనే హైయెస్ట్!

సినిమా ఖర్చుల్లో బిగ్ స్కామ్?.. బోగస్ బిల్లులతో కోట్ల గోల్‌మాల్!

హ్యాపీ బర్తడే మోక్షజ్ఞ.. కొత్త మూవీ అనౌన్స్మెంట్ కి ఈ రోజైనా మోక్షం లభిస్తుందా?

డిజాస్టర్ హీరోయిన్ తో మోక్షజ్ఞ డెబ్యూ మూవీ… సాహసం చేస్తున్న నందమూరి హీరో?

ఎన్టీఆర్–నీల్ మూవీ.. హైప్ ఎక్కువైపోతుందా?

సంగీత్ శోభన్ ‘అంతా రాములోరు చూస్కుంటారు’ గ్లింప్స్ రిలీజ్!

‘రాకా’లో పృథ్వీరాజ్.. ఏమన్నారంటే?

Big Stories

Advertisement
×