E-Paper
Advertisement

“దుష్టశక్తుల కళ్ళన్నీ నాపైనే”.. మరో సంచలన వీడియోతో అనసూయ!

“దుష్టశక్తుల కళ్ళన్నీ నాపైనే”.. మరో సంచలన వీడియోతో అనసూయ!
Advertisement

Anasuya: జబర్దస్త్ కామెడీ షో ద్వారా యాంకర్ గా బుల్లితెరకు పరిచయమైన అనసూయ (Anasuya).. ఈ షోలో అద్భుతమైన వాక్చాతుర్యంతో, అందరినీ కట్టిపడేసే గ్లామర్ లుక్ తో ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈమె కోసమే షో చూసిన ఆడియన్స్ కూడా లేకపోలేదు. అలా షో తో భారీ పాపులారిటీ అందుకున్న అనసూయకు.. డైరెక్టర్ సుకుమార్ (Sukumar) రంగస్థలం, పుష్ప వంటి సినిమాలలో రంగమ్మత్త, ద్రాక్షాయని లాంటి పాత్రలు ఇచ్చి.. ఆమె స్థాయిని ఎక్కడికో పెంచేశారు. అలా ఒకవైపు బుల్లితెర షోలలో సందడి చేస్తూనే.. మరొకవైపు సినిమాలలో విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తోంది అనసూయ.

దుష్టశక్తుల కళ్ళన్నీ నా వైపే – అనసూయ

రీసెంట్ గా ‘నాగబంధం’ సినిమాలో కూడా విలక్షణమైన పాత్ర పోషించి అందరినీ అబ్బురపరిచింది. అలాంటి ఈమె గత కొంతకాలంగా సమాజంలో జరిగే అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తూ కాంట్రవర్సీ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. గత కొంత కాలం క్రితం హిందూ ధర్మంపై , హిందూ దేవుళ్ల పేరుతో మోసం చేసే వారి గురించి ప్రస్తావిస్తూ చేసిన కామెంట్లు ఈమెను పూర్తిస్థాయిలో విమర్శల పాలు చేశాయి. ఎంతోమంది ఈమెను బహిరంగంగా తిట్టిపోస్తూ ఈమె వెళ్లాల్సిన షాప్ ఓపెనింగ్ లను కూడా క్యాన్సిల్ చేయిస్తూ రచ్చ చేశారు. అయితే తనకేవి పట్టనట్టుగా అంతే దీటుగా సోషల్ మీడియాలో స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తోంది అనసూయ.

మరో వీడియోతో సంచలనం..

Advertisement

నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ రోజుకో వీడియోతో వైరల్ అవుతున్న ఈమె.. తాజాగా మరో వీడియో విడుదల చేసింది. పైగా “దుష్టశక్తుల కళ్ళని నాపైనే ఉన్నాయి” అంటూ ఆమె చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి. విషయంలోకి వెళ్తే.. జిమ్ వర్కౌట్స్ కి సంబంధించిన వీడియోని ఆమె షేర్ చేసింది. అందులో వర్కౌట్స్ కి ముందు తరువాత స్ట్రెచెస్ చేయడం చాలా ముఖ్యం అని చెబుతూనే.. “కొంతమంది దుష్టశక్తుల కళ్ళని నాపైనే ఉన్నాయి” అంటూ వీడియో చేసింది. అందులో వర్కౌట్స్ చేస్తూ కనిపించింది అనసూయ . పైగా ఈ వీడియోకి ఆమె “ఏదో ఊరికే ఎందుకు ఉండటం అని ముచ్చట చెబుతుంటే.. వినలేకపోయినా ఏమనుకోకండి” అంటూ క్యాప్షన్ జోడించింది. మొత్తానికైతే అనసూయను టార్గెట్ గా చేసుకొని అదే పనిగా విమర్శలు గుప్పిస్తున్న కొంతమందికి ఆమె ఈ విధంగా కౌంటర్ ఇచ్చింది అనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి.

also read:డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం !

నెటిజన్ కామెంట్ కి అనసూయ రియాక్షన్..

Advertisement

అనసూయ తాజాగా షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఇది చూసిన నెటిజన్ “ఆమెను తిట్టడం కంటే ఫాలో చేయడం మంచిది. ఆమె మారదు. కనీసం మనమైనా మారాలి కదా” అంటూ ఆ నెటిజన్ తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు . అయితే దీనికి అనసూయ.. “ఫాలో కాదు అన్ ఫాలో ” అంటూ అతడు స్పెల్లింగ్ మిస్టేక్ చేసిన విషయాన్ని ఆమె గుర్తు చేసింది . మొత్తానికైతే అనసూయ రియాక్షన్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ మారుతుంది.

 

Related News

డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం !

బిగ్ బాస్ 10లోకి అడుగుపెడుతున్న దేబ్జానీ మోదక్.. ఆమె బ్యాక్ గ్రౌండ్, రెమ్యూనరేషన్ ఎంతంటే?

బిగ్ బాస్ లవర్స్ కి గుడ్ న్యూస్.. టైమింగ్స్ లో భారీ మార్పు!

Gundeninda Gudigantalu Balu : బిగ్ బాస్ లోకి బాలు.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ అంతా..?

Telugu Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. టాక్ ఆఫ్ ది సీరియల్?

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి ప్రభావతి కండీషన్.. మీనా, బాలు హ్యాపీ.. ప్రభకు కొత్త టెన్షన్..

Podarillu Today Episode : చక్రీ కి దిమ్మతిరిగే షాక్.. మాధవ్ నిర్ణయంలో మార్పు..? శైలు పై అనుమానం..

Big Stories

Advertisement
×