E-Paper
Advertisement

ఎవరీ సాత్విక.. ఒక్క టీజర్ తోనే ఊహించని క్రేజ్!

ఎవరీ సాత్విక.. ఒక్క టీజర్ తోనే ఊహించని క్రేజ్!
Advertisement

Satvika Veeravalli: సాత్విక వీరవల్లి.. ఒక్క టీజర్ తోనే తన అమాయకపు చూపుతో అందరిలో అటెన్షన్ క్రియేట్ చేసి, తన గురించి అందరూ నెట్టింట సెర్చ్ చేసేలా చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. అసలు ఎవరీ సాత్విక ? ఏ సినిమాలో నటిస్తోంది? అనే విషయాన్నికొస్తే తాజాగా పవన్ సాధినేని దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఆకాశంలో ఒక తార’. ఈ చిత్రం ద్వారానే కల్పన అనే పాత్రతో సాత్విక వీరవల్లి హీరోయిన్గా వెండితెరకు తొలిసారి పరిచయం కాబోతోంది. నవంబర్ 20వ తేదీన తెలుగు, తమిళ్, మలయాళం , హిందీ భాషలలో పాన్ ఇండియా విడుదల కాబోతున్న ఈ సినిమా నుండి తాజాగా మేకర్స్ టీజర్ విడుదల చేశారు

సాత్విక వీరవల్లి బ్యాక్ గ్రౌండ్..

టీజర్ చూసిన ప్రతి ఒక్కరు ఎవరీ సాత్విక అంటూ తెగ వెతికేస్తున్నారు. సాత్విక శాస్త్రీయ నృత్యకారిణి . పైగా ఇంజనీరింగ్ లో పట్టభద్రురాలు కూడా.. శాస్త్రీయ కళలలో బలమైన నేపథ్యం , అద్భుతమైన విద్యా నైపుణ్యం పొందిన ఈమె వాటిల్లో పట్టు పొందాకే నటన రంగంలోకి అడుగు పెట్టింది. వండర్ బిల్డ్ విశ్వవిద్యాలయం నుండి 2024 లో ఇంజనీరింగ్ లో పట్టభద్రురాలైన ఈమె.. నిష్ణాతురాలైన భరతనాట్య నర్తకి కూడా.. ఈమె తన తల్లి శ్రీమతి వనిత వీరవల్లి వద్ద దశాబ్దానికి పైగా భరతనాట్యంలో శిక్షణ పొంది.. 2015లో చికాగోలో తన తొలి ప్రదర్శన ఇచ్చి భరతనాట్యంలో అరంగేట్రం చేసింది..భారతదేశంలోని చెన్నైలో ఈమె మూలాలను కలిగి ఉన్నప్పటికీ .. యునైటెడ్ స్టేట్స్ లో జన్మించింది. ఇక అలాంటి ఈమెను పవన్ సాధినేని హీరోయిన్గా తొలిసారి వెండితెరకు పరిచయం చేయబోతున్నారు.. మరి టీజర్ తోనే తన అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈమె .. ఈ సినిమాతో హీరోయిన్గా ఎదగాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

Advertisement

ALSO READ:షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. ఆకట్టుకున్న ప్రత్యేక ప్రదర్శనలు!

ఆకాశంలో ఒక తార మూవీతో నటన రంగ ప్రవేశం..

పవన్ సాదినేని దర్శకత్వంలో గీత ఆర్ట్స్ , స్వప్న సినిమాస్, లైట్ బాక్స్ మీడియా బ్యానర్లపై సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్ లో నవంబర్ 20వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతోంది. సరైన రోడ్లు కూడా లేని ఒక మారుమూల గ్రామానికి చెందిన అమ్మాయి.. జిల్లాలో ప్రధమ ర్యాంకు సాధించిన ప్రతిభావంతురాలైన కల్పనా పాత్రను సాత్విక పోషిస్తుంది. సామాజిక పరిమితులను అధిగమించి వ్యోమగామిగా మారి అంతరిక్షంలోకి ప్రయాణించాలనే అసాధారణమైన కలను ఆమె తన పాత్రలో కలిగి ఉంది.

Advertisement

స్ఫూర్తిదాయకమైన భావోద్వేగ ప్రయాణాన్ని ఈ కథ చెబుతోంది.. ఈ ప్రయాణంలో కుటుంబం, సమాజం నుండి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటూ.. కృష్ణుడు ఆమెలోని సామర్థ్యాన్ని గుర్తించి ఆమెకు అండగా నిలవడం సినిమాకి హైలైట్ గా నిలవనుంది. మొత్తానికైతే మొదటి సినిమాతో ప్రేక్షకులను మరింత ఆకట్టుకొని మరిన్ని అవకాశాలు అందుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు

Related News

కీర్తి సురేష్ పుట్టినరోజు స్పెషల్.. ‘అక్క’ టీజర్ రిలీజ్ !

ఇండస్ట్రీలో విషాదం.. మ్యూజిక్ డైరెక్టర్ ‘దేవా’ కన్నుమూత!

హార్ట్ టచ్ ఫీలింగ్.. ఆకట్టుకుంటున్న దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ టీజర్!

కావ్య మారన్ తో అనిరుధ్ పెళ్లి ఫిక్స్.. వారికి ప్రత్యేక ఆహ్వానం!

ఈ జనరేషన్‌కు మరో బ్రహ్మానందం దొరికేశాడు.. కోనా వెంకట్ కామెంట్స్!

గ్లామర్ మాత్రమే కాదు.. చీరకట్టులోనూ త్రిష అందం అదుర్స్!

రజనీకాంత్‌కు తిరుగులేదుగా.. ‘జైలర్ 2’ కలెక్షన్ల లెక్క ఇదే!

Big Stories

Advertisement
×