E-Paper
Advertisement

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్
Advertisement

Marathi Crime Thriller Series: కోర్టులో నేరస్థులకు శిక్ష పడేలా చేయాల్సిన ఓ లాయర్… అసలు న్యాయం జరుగుతుందా అనే సందేహంతో తన వృత్తికే దూరం అవుతాడు. ఓ వ్యక్తి అనుమానాస్పద మరణం అతడిని మళ్లీ కేసు చేతిలోకి తీసుకునేలా చేస్తుంది. కానీ నిజం తెలుసుకునే ప్రయత్నంలో ఒక్కో చిక్కుముడి వీడుతుంటే… కొత్త ప్రమాదాలు ఎదురవుతాయి. సాక్షులు ప్రాణాలు కోల్పోతారు, నిజాన్ని నిరూపించే ఆధారాలు మాయమవుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆ లాయర్ అసలు దోషులను పట్టుకోగలిగాడా ? న్యాయం కోసం అతడు చేసిన పోరాటం ఎలాంటి మలుపులు తిరిగింది ? ఈ ఉత్కంఠభరితమైన కథతో వచ్చిన మరాఠీ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ‘కోన్ యశ్వంత్ పాన్సారే?’ (Kon Yashwant Pansare?). మరి ఈ సిరీస్ స్ట్రీమింగ్ ఎక్కడ ? స్టోరీ ఏంటి ? అనే వివరాల్లోకి వెళ్తే…

కథలోకి వెళ్తే…

యశ్వంత్ పాన్సారే జీవితంలో ఎదురైన అనుభవాలు అతడికి న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని పూర్తిగా దూరం చేస్తాయి. నిజం వైపు నిలబడినా న్యాయం దక్కుతుందనే గ్యారంటీ లేదని భావిస్తూ, తన వృత్తిపట్ల కూడా ఆసక్తి కోల్పోతాడు. అలాంటి సమయంలో మాపారి అనే వ్యక్తి అనుమానాస్పద మరణం అతడిని తీవ్రంగా కలచి వేస్తుంది. ఈ ఘటనతో తనకు ఉన్న అపరాధ భావన అతడిని మళ్లీ న్యాయం కోసం పోరాడేలా చేస్తుంది.

Advertisement

మాపారి మరణం వెనుక అసలు కారణాలు తెలుసుకునే ప్రయత్నంలో యశ్వంత్‌కు ఊహించని విషయాలు తెలుస్తాయి. మృతుడి గతానికి సంబంధించిన వివరాలు బయటపడటంతో కేసు ఊహించని మలుపులు తిరుగుతుంది. మొదట సులభంగా పరిష్కారమవుతుందని భావించిన ఈ కేసు, ఒక్కో ఆధారం బయట పడేకొద్దీ కొత్త ప్రశ్నలను లేవనెత్తుతుంది. యశ్వంత్ నిజం తెలుసుకునేందుకు ముందుకు వెళ్తున్న కొద్దీ అతడికి ఎదురుదెబ్బలు తగులుతాయి.

సందీప్ అనే వ్యక్తి మరణం కేసును మరో మలుపు తిప్పుతుంది. ఆల్కా ఆచూకీ తెలుసుకోవాలని యశ్వంత్ ప్రయత్నిస్తుండగా, కీలకమైన సమాచారం అందకుండా పోతుంది. ఓ సాక్షి చనిపోయే ముందు చెప్పిన వివరాలు కూడా అతడికి స్పష్టమైన దారి చూపించవు. మరోవైపు, అడ్వకేట్ సర్దా కోర్టులో వేసే ఎత్తుగడలు యశ్వంత్ కేసును మరింత బలహీనపరుస్తాయి. నిజం బయట పడకుండా అడ్డుపడుతున్నది ఎవరు ? ఈ కేసు వెనుక ఉన్న అసలు వ్యక్తులు ఎవరు ? సాక్షి చెప్పే విషయాలతో కేసు ఎలాంటి మలుపు తిరుగుతుంది ? చివరకు యశ్వంత్ నిజాన్ని నిరూపించగలుగుతాడా ? అన్నది సిరీస్‌లో చూడాల్సిందే.

ఓటీటీలో తెలుగులో ఉందా ?

Advertisement

‘కోన్ యశ్వంత్ పాన్సారే?’ అక్టోబర్ 16 నుంచి జీ5 (ZEE5)లో స్ట్రీమింగ్ అవుతోంది. మరాఠీ భాషలో రూపొందిన ఈ క్రైమ్ థ్రిల్లర్‌లో ఏడు ఎపిసోడ్‌లు ఉన్నాయి. జీ5లో అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం మరాఠీ ఆడియోతో పాటు ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ ఉన్నాయి. తెలుగు డబ్బింగ్ అందుబాటులో లేదు. భరత్ జాధవ్ (Bharat Jadhav), పుష్కర్ శ్రోత్రి (Pushkar Shrotri), శివాని రంగోలే (Shivani Rangole), శర్వరి జమెనిస్ (Sharvari Jamenis) ప్రధాన పాత్రల్లో నటించారు. ఆనంద్ గోఖలే (Anand Gokhale) దర్శకత్వం వహించారు. క్రైమ్ థ్రిల్లర్స్‌, కోర్టు డ్రామాలు, అనుమానాస్పద మరణాలు, వరుస ట్విస్టులతో సాగే ఇన్వెస్టిగేషన్ కథలు ఇష్టపడే వారికి ఈ సిరీస్ ఓ మంచి ఆప్షన్ కావచ్చు. ముఖ్యంగా నిజం కోసం పోరాడే ఓ లాయర్ ఎదుర్కొనే సవాళ్లు, కోర్టులో జరిగే ఎత్తుగడలు ఆసక్తి కలిగిస్తాయి.

Read Also: అందరూ తక్కువ అంచనా వేసే లాయర్‌… కోర్టులో ఆమె వాదనలు వింటే మైండ్‌ బ్లాక్‌… మెంటలెక్కించే లీగల్‌ డ్రామా

Tags

Related News

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

వచ్చేవారం నెట్ ఫ్లిక్స్ లో 3 సినిమాలు.. ఆ 2 మస్ట్ వాచ్!

అందరూ తక్కువ అంచనా వేసే లాయర్‌… కోర్టులో ఆమె వాదనలు వింటే మైండ్‌ బ్లాక్‌… మెంటలెక్కించే లీగల్‌ డ్రామా

థెరపీ కోసం వచ్చిన పేషెంట్‌తోనే సైకాలజిస్ట్‌కి తలనొప్పులు… నవ్వించే డార్క్ కామెడీ డ్రామా

Big Stories

Advertisement
×