E-Paper
Advertisement

ఎవరీ వాసవి గణేషన్.. క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో ఆకట్టుకుంటున్న బ్యూటీ!

ఎవరీ వాసవి గణేషన్.. క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో ఆకట్టుకుంటున్న బ్యూటీ!
Advertisement

Vasavi Ganeshan:టాలీవుడ్‌కి ప్రతి ఏటా ఎంతో మంది కొత్త భామలు వస్తుంటారు, కానీ కొందరు మాత్రమే మొదటి చూపులోనే ప్రేక్షకులను కట్టిపడేస్తారు. అలా తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్, చార్మింగ్ లుక్స్‌తో టాలీవుడ్‌ దృష్టిని ఆకర్షిస్తోంది నటి వాసవి గణేషన్. ‘హుషారు పిట్టలు’ అనే యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌తో తెలుగు తెరకు పరిచయం కాబోతున్న ఈ బ్యూటీ, రీసెంట్‌గా జరిగిన ప్రీ-రిలీజ్ వేడుకలో తన స్పీచ్‌తోనూ, హావభావాలతోనూ కుర్రకారు మనసు దోచుకుంది. మరి ఈ కొత్త భామ విశేషాలేంటో చూద్దాం..

‘హుషారు పిట్టలు’తో తెలుగులోకి ఎంట్రీ:

అన్షు, వాసవి గణేషన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘హుషారు పిట్టలు’. పద్మ అమ్మ, బీవీజీ స్టూడియోస్ సమర్పణలో… రుద్ర క్రాంతి పిక్చర్స్ బ్యానర్‌పై వెంకట్ యాదవ్ ఈ సినిమాను నిర్మించగా, బిక్షు దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాతోనే వాసవి హీరోయిన్‌గా టాలీవుడ్‌కి గ్రాండ్‌గా ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర పోస్టర్లు, టీజర్ నెట్టింట వైరల్ అవుతుండటంతో ఈ చిన్న సినిమాపై ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో స్పెషల్ మెసేజ్:

Advertisement

ఇటీవల నిర్వహించిన ఈవెంట్‌లో వాసవి గణేషన్ మాట్లాడిన తీరు అందరినీ ఆకట్టుకుంది. “నా అన్నలు, నా అక్కలు, నా క్యూటీస్… నన్ను తిట్టేవాళ్లకైనా ప్రేమతో నమస్కారం. ఇక మన సినిమా థియేటర్లలో కొన్ని చోట్ల నవ్విస్తుంది, మరికొన్ని చోట్ల కేకలు పెట్టిస్తుంది. కానీ సినిమా అయిపోయి బయటకు వచ్చేటప్పుడు మాత్రం మీ మనసును కచ్చితంగా కదిలిస్తుంది” అంటూ ఆకట్టుకునే మెసేజ్ ఇచ్చింది.

ALSO READ:వారణాసి షూటింగ్.. మహేష్ బాబు సీన్ లీక్.. వీడియో వైరల్

క్యూట్‌నెస్‌తో సోషల్ మీడియాలో క్రేజ్:

Advertisement

సినిమా రిలీజ్‌కు ముందే వాసవికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ప్రమోషన్స్, పాటల విడుదల వేడుకల్లో ఆమె కనిపించిన తీరు, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ నెటిజన్లను ఎంతగానో అలరించాయి. ఇక గ్లామర్‌తో పాటు నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలో ఆమె కనిపిస్తుండటంతో, మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకోవడం ఖాయమని సినీ వర్గాలు అంటున్నాయి.

ఆగస్టు 15న ఏషియన్, సురేష్ ఫిలింస్ ద్వారా రిలీజ్:

చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ యూత్‌ఫుల్ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థలు ఏషియన్, సురేష్ ఫిలింస్ ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాయి. ఇక బడా డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను థియేటర్లకు తీసుకువస్తుండటంతో ఓపెనింగ్స్ బాగుంటాయని చిత్రబృందం ఆశిస్తోంది.

టాలీవుడ్‌లో మరో సక్సెస్ ఫుల్ హీరోయిన్?:

తన అందంతో, మాటలతో అలరిస్తున్న వాసవి గణేషన్ ‘హుషారు పిట్టలు’తో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో చూడాలి. మొదటి సినిమాతోనే ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకుని, తెలుగులో మరిన్ని అవకాశాలు అందుకోవాలని ఆశిద్దాం.

?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

Related News

విభిన్న గెటప్స్ లో శర్వానంద్.. ‘జార్జ్ క్రిష్’ నుండి ఫస్ట్ బూస్టర్ రిలీజ్!

ది ప్యారడైజ్ దెబ్బ.. టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ లో ఇప్పుడైనా మార్పు వస్తుందా?

మా ఇంటి వాచ్‌మెన్ ఫోన్‌లో నా ఇంటిమేట్ సీన్స్.. నరకం చూశా – రాధిక ఆప్టే

డింపుల్ హయతి నెలకు అంత సంపాదిస్తుందా..? సినిమాల కన్నా ఎక్కువే..

ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ దర్శకుడు కన్నుమూత..

అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. ఇది అస్సలు ఊహించలేదు మావా..

నాని కెరీర్‌లోనే బిగ్ రిలీజ్.. ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ లెక్కలు ఇవే!

అబ్బబ్బా.. ఖుషీ కపూర్ ఏంటి ఈ లుక్! ఫ్యాన్స్‌కి ఫుల్ ట్రీట్

Big Stories

Advertisement
×